Home / జన సేన / అంబేద్క‌ర్ ఆశ‌యాల రూప‌మే జ‌న‌సేన‌.. రాజ్యాంగ నిర్మాత‌కు జ‌న‌సేనుడి నివాళి..

అంబేద్క‌ర్ ఆశ‌యాల రూప‌మే జ‌న‌సేన‌.. రాజ్యాంగ నిర్మాత‌కు జ‌న‌సేనుడి నివాళి..

మొన్నా మ‌ధ్య లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కి వెళ్లిన‌ప్పుడు., తాను అవార్డు అందుకునే ముందు ప్ర‌పంచ విజ్ఞాన బాంఢాగారంగా భావించే రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బి.ఆర్ అంబేద్క‌ర్ స్మార‌క మందిరాన్ని సంద‌ర్శించి ఆయ‌న‌కి నివాళులు అర్పించ‌న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., అక్క‌డ ఓ రైట్ అప్ రాశారు.. ఆయ‌న సిద్ధాంతాల్లో కొన్నింటిని ఆక‌ళింపు చేసుకున్నారు.. ఆ త‌ర్వాత అక్క‌డ ఏం రాశారంటే త‌న చివ‌ని శ్వాస వ‌ర‌కు తాను., త‌న పార్టీ అంబేద్క‌ర్ ఆలోచ‌న‌ల‌కి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని..

ఇప్పుడు అంబేద్క‌ర్ 61వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా కూడా ఆయ‌న ఘ‌న‌త‌ని చాటుతూ ఘ‌న‌మైన నివాళి అర్పించారు.. భార‌త రాజ్యాంగ నిర్మాత‌, భ‌ర‌త జాతి స్ఫూర్తి ప్ర‌ధాత స్వ‌ర్గీయ అంబేద్క‌ర్ వ‌ర్ధంతి సంద‌ర్బంగా ఆయ‌న‌కు త‌న త‌రుపున , జ‌న‌సేన శ్రేణుల త‌రుపున శిర‌స్సు వంచి ప్ర‌ణామాలు స‌మ‌ర్పిస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన జ‌న‌సేనాని., ఆయ‌న‌కు నివాళిగా మ‌రోసారి భీం రావ్ ఆశ‌ల‌కి, ఆశ‌యాల‌కు అనుగుణంగా జ‌న‌సేన ప‌య‌నం సాగుతుందని ప్ర‌క‌టించారు..

ఆశ‌ల‌కు, వాస్త‌వాల‌కీ పొంత‌న లేక కునారిల్లిపోతున్న ప్ర‌స్తుత యువ‌త ప‌రిస్థితి ఇలా ఉంటుంద‌ని అంబేద్క‌ర్ ముందే ఊహించి ఉంటే., రాజ్యాంగంలో ఓ అధ్యాయాన్ని యువ‌త భ‌విష్య‌త్తు కోసం రాసి ఉండేవార‌నిపిస్తున్న‌ట్టు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు.. ఆ మ‌హా నేత‌కి జ‌న‌సేన పార్టీ మొత్తం విన‌మ్రంగా అంజ‌లి ఘ‌టిస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

భావిత‌రాల‌కి నిజాయితీతో కూడిన రాజ‌కీయాలు అందిద్దాం రండి.. జ‌న‌సేనుడి పిలుపు..

నీతి..నిజాయితీ..నిబ‌ద్ద‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేద్దాం ర‌మ్మంటూ జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., త‌న సేన జ‌న‌సైన్యాన్ని కార్యోన్ముఖుల్ని చేసే కార్య‌క్ర‌మానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen + 9 =

%d bloggers like this: