Home / జన సేన / అఖిలాంఢ‌కోటి బ్ర‌హ్మంఢ నాయ‌కుడి సేవ‌లో ”జ‌న‌”నాయ‌కుడు.. సామాన్యుల్లో సామాన్యుడిగా..

అఖిలాంఢ‌కోటి బ్ర‌హ్మంఢ నాయ‌కుడి సేవ‌లో ”జ‌న‌”నాయ‌కుడు.. సామాన్యుల్లో సామాన్యుడిగా..

తుఫాను తీరాన్ని తాకే ముందు వాతావ‌ర‌ణం ఎంత ప్ర‌శాంతంగా ఉంటుందో.. అదే ప్ర‌శాంతత‌.. ల‌క్ష్యం మీద గురి.. విల్లు విడిచిన పార్దుడి బాణం ప‌క్షికంటిని చేధించిన చందంగా., ల‌క్ష్యం వైపు క‌దిలే ముందు శ్వాస శ‌బ్దం సైతం బ‌య‌టికి విన‌బ‌డ‌నంత‌టి నిశ్శ‌బ్దం.. ఈ నిశ్శ‌బ్దం రాబోయే రాజ‌కీయ ఉప్పెన‌కి సంకేత‌మేనా..? జ‌న‌సేనుడు బ‌స చేసిన తిరుమ‌ల హంపి మ‌ఠం వ‌ద్ద ప‌రిస్థితి ఇది.. ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచి, ప్ర‌జ‌ల పీడిస్తున్న రాజ‌కీయ న‌ర‌కాసురుల రంగు అస‌లు రూపం బ‌ట్ట‌బ‌య‌లు చేసేందుకు , ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్ల‌నున్న జ‌న‌సేన అధినేత‌., ప్ర‌జ‌ల‌కు శ‌క్తివంచ‌న లేకుండా సేవ చేసే అవ‌కాశం క‌ల్పించ‌మంటూ ఆ క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవెంక‌టేశ్వ‌రుడి ఆశీర్వ‌చ‌నం కోసం తిరుమ‌ల వెళ్లారు..

సామాన్యుల్లో సామాన్యుడిగా., ఆ బ్ర‌హ్మాంఢ నాయ‌కుని ముందు ప్ర‌ణ‌మిల్లిన జ‌న‌సేన అధినేత‌., శ‌నివారం ఏడుకొండ‌ల వాడి ద‌ర్శ‌నానికి కాలిన‌డ‌క‌న క‌దిలారు.. అలిపిరిలో తొలి మెట్టుకి మొక్కిన ఆయ‌న పూర్తి భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో కాళ్ల జోళ్లు సైతం విడిచి తిరుమ‌ల కొండ‌కి ఎక్కారు.. ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో సామాన్య భ‌క్తుల‌తో క‌ల‌సి శ్రీవారిని ద‌ర్శించుకున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాను సామాన్యుల్లో సామాన్యుడినేన‌ని మ‌రోసారి నిరూపించారు.. అటు త‌మ‌తో పాటు ద‌ర్శ‌నానికి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని చూసిన సామాన్య భ‌క్తులు ఆనందంతో పాటు ఆశ్చ‌ర్యంలో మునిగిపోయారు.. జ‌న‌సేనాని సైతం సామాన్య భ‌క్తుల‌తో క‌ల‌సి శ్రీనివాసుని ద‌ర్శించుకోవ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు..

ద‌ర్శ‌నం అనంత‌రం హంపి మ‌ఠంలో రోజు మొత్తం జ‌న‌సేన అధినేత ధ్యానంలో గ‌డ‌ప‌నున్నారు.. మొత్తం మూడు రాత్రులు కొండ‌పై నిద్ర చేయాల‌న్న మొక్కు తీర్చుకోనున్న ప‌వ‌న్‌., సోమ‌వారం తిరుమ‌ల కొండ‌పై ఉన్న మ‌రికొన్ని క్షేత్రాల‌ని ద‌ర్శించుకుంటారు.. మ‌రో రెండు రోజులు ఆయ‌న తిరుమ‌ల‌లోనే గ‌డుపుతారు.. ఈ సంద‌ర్బంగా తిరుమ‌ల క్షేత్రంతో త‌న‌కున్న అనుబంధాన్ని ఆయ‌న స‌న్నిహితుల‌తో పంచుకున్న‌ట్టు తెలుస్తోంది.. యోగ న‌ర‌సింహుడి స‌న్నిధిలో త‌న‌కు అన్నప్రాస‌న జ‌రిగిన విష‌యాన్ని త‌న త‌ల్లిదండ్రులు త‌ర‌చూ ప్ర‌స్థావించిన విష‌యాన్ని గుర్తుచేసుకున్న‌రు..

ఇక తిరుమ‌ల నుంచి నేరుగా తాను బ‌స్సుయాత్ర ప్రారంభించ‌నున్న ప్రాంతానికి చేరుకుని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెల‌సుకుంటూ జ‌న‌సేనాని ముందుకి సాగ‌నున్నారు.. ప‌నిలో ప‌నిగా పాల‌కులు ఇచ్చిన హామీలపై ప్ర‌జాక్షేత్రంలోనే నిల‌దీస్తారు.. జ‌నం కోసం క‌దులుతున్న ఆయ‌న శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌జ‌ల‌కి సేవ చేసే భాగ్యాన్ని ప్ర‌సాధించ‌మంటూ ఆ శ్రీనివాసును వేడుకున్నారంట‌.. ఆయ‌న కోరిక‌ను ఆ అఖిలాంఢ‌కోడి బ్ర‌హ్మాంఢ‌నాయ‌కుడు నెర‌వేర్చాల‌ని కొన్ని కోట్ల హృద‌యాలు మ‌రోసారి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌రుపున ప్రార్దిస్తున్నాయి..

Share This:

3,938 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty + 3 =