Home / జన సేన / అట్లాంటాలో ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సేన అత్మీయ-అభినంధ‌న స‌మావేశం..

అట్లాంటాలో ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సేన అత్మీయ-అభినంధ‌న స‌మావేశం..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ గెలుపు కోసం త‌మ విలువైన స‌మ‌యాన్ని, స‌హాయాన్ని అందించిన ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికుల అభినంధ‌న కార్య‌క్ర‌మాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కొన‌సాగుతున్నాయి.. పాశ్చాత్య దేశాల్లో యాంత్రిక జీవ‌నానికి అల‌వాటు ప‌డిన ప్ర‌వాసులు., న‌వ‌త‌రం రాజ‌కీయ వ్య‌వ‌స్థ నిర్మాణంలో త‌మ‌వంతు పాత్ర పోషించేందుకు పెను ఉప్పెన‌లా ముంద‌డుగు వేశారు.. ఉద్యోగ‌స్థుల నుంచి వ్యాపారుల వ‌ర‌కు ఎవ‌రికి తోచిన విధంగా వారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నేతృత్వంలో మార్పును ఆహ్వానిస్తూ త‌మ వంతు కృషి చేశారు.. ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సేన విభాగం నుంచి వంద‌ల మంది స్వ‌దేశానికి వెళ్లి జ‌న‌సేన విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డారు.. అందులో వీర మ‌హిళ‌లు సైతం ఉన్నారు.. ఇక రామ్ బండ్రెడ్డి, చంద్ర‌శేఖ‌ర్ పొలిశెట్టి లాంటి ఎన్‌.ఆర్‌.ఐలు ఏకంగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి రాజ‌కీయ ఉద్దండుల‌తో హోరాహోరి త‌ల‌ప‌డ్డారు కూడా.. ఇక శేఖ‌ర్ పులి, ర‌వి వ‌ర్రే లాంటి ఎన్‌.ఆర్‌.ఐలు పార్టీ అధినేత‌కు చేదోడు, వాదోడుగా ఉంటూ ఎల‌క్ష‌నియ‌రింగ్‌లో కీ రోల్ ప్లే చేశారు.. ఇక కొంత మంది ఎన్‌.ఆర్‌.ఐలు టీంలుగా త్రిశూల్‌, అస్త్ర‌, శ‌స్త్ర ఇలా ర‌క‌ర‌కాల పేర్ల‌తో పార్టీ ప్ర‌చారంలో త‌మ‌వంతు స‌హాయ స‌హ‌కారాలు అందించారు..

ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ ప్ర‌క్రియ ముగియ‌గానే ఎవ‌రికి వారు రిలాక్స్ అయ్యారు. ఎవ‌రి ప‌నుల్లో వారు మ‌ళ్లీ బిజీ బిజీ అయ్యారు.. అయితే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎన్నిక‌ల అనంత‌రం న‌వ అభ్య‌ర్ధుల‌తో నిర్వ‌హించిన ముఖాముఖి భేటీలో అంద‌రికీ ఒక సూచ‌న చేశారు.. క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు, అండ‌గా నిల‌చిన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్ చెప్ప‌మ‌ని.. ఈ సూచ‌న‌తో ఇప్ప‌టికే పార్టీ పెద్ద‌లు ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో అంద‌రిని ఆత్మీయంగా ప‌లుక‌రించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. పార్టీ అఫైర్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌హించిన శేఖ‌ర్‌పులి, మ‌రో కీల‌క ఎన్‌.ఆర్‌.ఐ నాయ‌కుడు ర‌వి వ‌ర్రేతో క‌ల‌సి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను ఆప్యాయంగా ప‌లుక‌రించే ప‌నిని పార్టీ అధినేత త‌రఫున భుజాన వేసుకున్నారు.. ప‌ని చేసిన ప్ర‌తి కార్య‌క‌ర్త‌ను అభినంధించ‌డంతో పాటు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.. ఇప్ప‌టికే హ్యూస్ట‌న్‌, న్యూ జెర్సీ, చికాగో, బే ఏరియాల‌తో పాటు అట్లాంటాల్లో ఆత్మీయ స‌మావేశాలు నిర్వ‌హించారు.. అట్లాంటాలో జ‌రిగిన ఆత్మీయ స‌మావేశానికి 100 మందికి పైగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు..

జ‌ర్నీ ఆఫ్ జ‌న‌సేన ఇన్ అట్లాంటా పేరిట ఆత్మీయ స‌మావేశాన్ని నిర్వ‌హించారు.. ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికుడు సురేష్‌ క‌రోతు అతిధుల ఆహ్వానం ప‌ల‌క‌డంతో పాటు అభిమానులు కార్య‌క‌ర్త‌లుగా ఎలా మ‌ల‌చ‌బ‌డ్డారు అనే విష‌యాన్ని వివ‌రించారు.. ప్ర‌త్య‌క్షంగా ఎల‌క్ష‌నియ‌రింగ్‌లో పాల్గొన్న రాజు మండ‌పాటి గ్రౌండ్ రియాలిటీని వివ‌రించ‌గా., న‌ర‌స‌య్య వ‌డ్రాణం పీఆర్పీ నుండి జ‌న‌సేన వ‌ర‌కు ఎన్నిక‌ల్లో ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు.. జ‌న‌సేన ప్ర‌స్థానంలో బాధ్య‌త‌లు నిర్వ‌హించిన ప్ర‌తి ఒక్క‌రికీ సెంట్ర‌ల్ అఫైర్స్ క‌మిటీ చైర్మ‌న్ శేఖ‌ర్ పులి ధ‌న్య‌వాదాలు తెలిపారు.. ఎన్‌.ఆర్‌.ఐలు వివిధ టీంలు, గ్రూపులుగా ఏర్ప‌డి చేసే స‌ర్వీస్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించుకుంటూ మ‌రింత ముందుకు ఎలా దూసుకుపోవ‌చ్చు అనే విష‌యంలో ప‌లు సూచ‌న‌లు చేశారు.. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఎవ‌రి మండ‌ల ప‌రిధిలో వారు గ్రూప్‌లుగా ఏర్ప‌డి సేవా కార్య‌క్ర‌మాలు పోటీ ప‌డి మ‌రీ చేయొచ్చ‌ని తెలిపారు.. ఓ త‌రాన్ని మార్చాల‌న్న ల‌క్ష్యంతో ముందుకు వెళ్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురించి, ఆయ‌న‌లోని ఆత్మ‌విశ్వాసం, నిబ‌ద్ద‌త‌, స‌మాజం మీద ఉన్న అవ‌గాహ‌న గురించి జ‌న‌సైనికుల‌కు వివ‌రించారు.. దీంతో పాటు జ‌న‌సేనానితో జ‌న‌సేన‌తో ఉన్న అనుబంధాన్ని, మూడు నెల‌ల ప్ర‌స్థానాన్ని వివ‌రించిన శేఖ‌ర్ పులి., స‌మావేశానికి హాజ‌రైన కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్తేజ‌ప‌రిచారు..

వివిధ దేశాల జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చేసిన సేవ‌ల‌ను వ‌ర్రే ర‌వి కొనియాడారు.. హ్యూస్ట‌న్ జ‌న‌సైన్యం 19 నియోజ‌క‌వ‌ర్గాల‌ను ద‌త్త‌త తీసుకుని ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌, నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చార బాధ్య‌త‌లు తీసుకున్న విష‌యాన్ని, డ‌ల్లాస్ జ‌న‌సైన్యం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన రైలు ప్ర‌చారం, విరాళాల సేక‌ర‌ణ‌, ఉత్త‌రాంధ్ర‌లో వినూత్న ప్ర‌చార బాధ్య‌త‌లు తీసుకున్న టీం త్రిశూల్‌, 100కు పైగా ప్ర‌చార ర‌ధాల‌తో టీం అస్త్ర అందించిన స‌హ‌కారం, సోష‌ల్ మీడియా వారియ‌ర్స్ అందించిన స‌హ‌కారం., గ్లోబ‌ల్ ఎన్‌.ఆర్‌.ఐ టీం , ఫ‌స్ట్ రెస్పాండ్ టీంలు సంపందించిన తీరు.. ఆస్ట్రేలియా , న్యూజిల్యాండ్ ఎన్‌.ఆర్‌.ఐ విభాగాలు టీం శ‌స్త్ర అంటూ చేప‌ట్టిన సేవా కార్య‌క్ర‌మాలు , ఆవిర్భావ దినోత్స‌వానికి టోపీలు పంచిన కెన‌డా టీం, ప్ర‌త్య‌క్షంగా ఎన్నిక‌ల్లో పాల్గొన్న మ‌లేషియా, సింగ‌పూర్‌, కువైట్ టీం స‌భ్యుల‌తో పాఉ వీర మ‌హిళా విభాగం నుంచి జ‌న జాగృతి అంటూ త‌మ వంతు కృషి చేసిన సెంట్ర‌ల్ అఫైర్స్ క‌మిటీ వైస్ చైర్మ‌న్ రుక్మిణి కోట, హెల్పింగ్ హ్యాండ్స్‌, ఫ్యూచ‌ర్ లీడ‌ర్స్, క్షేత్ర‌, జ‌న‌సేన రాజ‌కీయం వంటి బృంధాల‌తో ఎలా స‌మ‌న్వ‌య ప‌రుచుకుంటూ త‌మ త‌మ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించారో క్లుప్తంగా వివ‌రించారు.. ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా ఈ కార్య‌క‌లాపాల‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలిపారు.. జ‌న‌సేన ఎల‌క్ష‌నియ‌రింగ్‌కు స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రి పేర్ల‌ను ఆత్మీయ స‌మావేశంలో చ‌దివి వినిపించారు.. థ్యాంక్స్ చెప్పే కార్య‌క్ర‌మం ముగిసిన త‌ర్వాత భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌బోతోంది అనే అంశంపై కూడా కీల‌క ముఖాముఖి స‌మావేశం సాగింది.. ఈ సంద‌ర్బంగా జ‌న‌సేన సెంట్స‌ల్ అఫైర్స్ క‌మిటీ చైర్మ‌న్ శేఖ‌ర్ పులిని స్థానిక వీర మ‌హిళా విభాగం కార్య‌క‌ర్త‌లు స‌తీస‌మేతంగా స‌త్క‌రించారు..

Share This:

1,013 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

One comment

  1. Panditi malhotra

    Nri people are backbone to the party .Good helping nature and well support given to all constituencies .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 4 =