Home / పోరు బాట / అడుగ‌డుగునా అణ‌చివేత‌.. శాంతియుత ఉద్య‌మంపై ప్ర‌భుత్వాల దాడి..

అడుగ‌డుగునా అణ‌చివేత‌.. శాంతియుత ఉద్య‌మంపై ప్ర‌భుత్వాల దాడి..

రిప‌బ్లిక్ డే.. సాక్షిగా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం పౌరుల హ‌క్కుల్ని కాల‌రాసింది.. కాకీల సాయంతో ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం శాంతియుతంగా చేయ‌త‌ల‌పెట్టిన ఉద్య‌మాన్ని ఉద్రిక్తంగా మార్చేసింది,, ముంద‌స్తు అరెస్టులు., లాఠీ ఛార్జ్‌ల‌తో నిర‌స‌న‌కు దిగిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లపై పోలీసులు ప్ర‌తాపం చూపారు.. విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తిల‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జ‌న‌సేన పార్టీ శ్రేణులు., యువ‌త‌ను 144 సెక్ష‌న్ పేరుతో ఆంక్ష‌లు విధించి మ‌రీ అరెస్ట్ చేశారు.. కొంత మందిని రాత్రే అరెస్ట్ చేయ‌గా., మ‌రికొంత మందిని నిద్ర‌లేవ‌క ముందే పోలీసులు బ‌ల‌వంతంగా ఈడ్చుకెళ్లారు.. ఇదేమి అన్యాయం అని ప్ర‌శ్నించిన వారిపై లాఠీలు ఝుళిపించారు.. ప్ర‌భుత్వం పోలీసుల తీరుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి..img-20170126-wa0036img-20170126-wa0070

విజ‌య‌వాడ‌లో జ‌న‌సైనికుడు మండ‌లి రాజేష్‌ని ఉద‌యం కృష్ణ‌లంక పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించిన పోలీసులు., కార్య‌క‌ర్త‌ల ఆందోళ‌న నేప‌ధ్యంలో అక్క‌డి నుంచి మాయం చేశారు.. అత‌నితో పాటు మ‌రికొంత మంది కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకుని., ర‌హ‌స్య ప్ర‌దేశంలో ఉంచారు.. పోలీసులు వారిని ఏం చేశారో తెలియక కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు..

తూర్పుగోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన పార్టీ నాయ‌కులు చింత‌ప‌ల్లి బ‌న్ని, అతని అనుచ‌రుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. శాంతియుత ఆందోళ‌న కోసం రోడ్డుపైకి వ‌చ్చిన బ‌న్ని అత‌ని అనుచ‌రుల్ని అడ్డుకున్న పోలీసులు., అరెస్ట్ చేసి స్టేష‌న్‌కి త‌ర‌లించారు.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విగ్ర‌హానికి పాలాభిషేకం చేసి., అక్క‌డే బైఠాయించారు.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కుల అంటూ నిన‌దించారు.. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల సంఘం అధ్య‌క్షులు రావూరి బుజ్జితో పాటు ప‌లువురు జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని పోలీసులు అరెస్టు చేశారు.. ఉద‌యం నుంచే హౌస్ అరెస్ట్ పేరుతో ఇంట్లోనే బంధించిన పోలీసులు ఆ త‌ర్వాత అరెస్ట్ చేసి స్టేష‌న్‌కి త‌ర‌లించారు..

క‌డ‌ప‌, క‌ర్నులు, అనంత‌పురం, నెల్లూరు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వ‌ర‌కు ఒక్క జిల్లా కాదు అన్ని జిల్లాల్లో యువ‌త క‌దిలారు.. జ‌న‌సేన పార్టీ శ్రేణులు శాంతియుత నిర‌స‌న కోసం మౌన‌ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ రోడ్ల‌పైకి వ‌చ్చాయి.. ప్ర‌తి సెంట‌ర్‌లో ఒక‌టే బాట‌.. ఒక‌టే మాట‌.. ఒక‌టే నినాదం.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు.. జై జ‌న‌సేన‌.. పోలీసుల యాక్ష‌న్ కూడా ఒక‌టే మాదిరి ఉంది.. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేష‌న్ల‌న్నీ యువ‌త‌, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు., ప్ర‌త్యేక హోదాకి మ‌ద్ద‌తిస్తున్న పార్టీల కార్య‌క‌ర్త‌ల‌తో నిండిపోయాయి.. విజ‌య‌వాడ‌, విశాఖ లాంటి ప్రాంతాల్లో పోలీస్ స్టేష‌న్లు చాల‌క‌., రూమ్‌లు అద్దెకు తీసుకుని మ‌రీ పోలీసులు కొన‌సాగించారు.. అయితే ఇలాంటి తాటాకు చ‌ప్పుళ్ల‌క భ‌య‌ప‌డేది లేద‌ని జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు.. హోదా ఇచ్చే వ‌ర‌కు పోరాటం ఆగ‌ద‌ని హెచ్చ‌రించారు…

 

Share This:

965 views

About Syamkumar Lebaka

Check Also

దుబాయ్‌లో జ‌న‌సేన త‌రంగం జోరు.. సినీ అతిధులు గెస్ట్‌లుగా అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు..

కోటికి పైగా గ‌డ‌ప‌లకి జ‌న‌సేన పార్టీని తీసుకెళ్లిన జ‌న‌సేన త‌రంగం కార్య‌క్ర‌మం.. అదే ఉత్సాహంతో ముందుకి సాగుతూ ఉంది.. జ‌న‌సేనాని, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + seven =