Home / పెన్ పోటు / అణచివేతలతో చరిత్ర పునరావృతం కాబోతోందా..? జ‌న‌సేన‌ని అధికారం వ‌రించ‌బోతోందా..?

అణచివేతలతో చరిత్ర పునరావృతం కాబోతోందా..? జ‌న‌సేన‌ని అధికారం వ‌రించ‌బోతోందా..?

ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రచారము చేస్తున్నప్పుడు, నాటి కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు, ఎన్టీఆర్’నిపెట్టిన మానసిక హింస చూస్తుంటే, నేడు పవన్ కళ్యాణ్’ని పెడుతున్న‌ హింసలానే ఉంటుంది. ఎన్టీఆర్ ప్రచారము కోసం ఎక్కడికి వెళ్లినా పవర్, వాటర్, రవాణా సౌకర్యాలు లేకుండా చేయడము, ఎన్టీఆర్ మీటింగులకు వెళ్లేవారిని బెదిరించడము నాడు చేసేవారు. నాటి కాంగ్రెస్ పార్టీ (బాబుతో సహా) పెట్టిన మానసిక హింసతో ఎన్టీఆర్’పై సానుభూతి పెరుగుతూ ఉండేది. ఆ అణచివేతే ఎన్టీఆర్ అధికారంలోకి రావడానికి కూడా ఉపయోగపడింది..

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి, ప్రచారము చేస్తున్నప్పుడు, తెలుగుదేశం పార్టీ, వైసీపీలు నేడు చేస్తున్న ఆరోపణలు కూడా అలానే ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి జనసేనుడుపై జల్లుతున్న బురద వల్ల‌ జనసేన పార్టీకి సానుభూతి రోజురోజుకి పెరుగుతున్నది. ఈ పాలక పార్టీలు “జనసేన”ని ఎంత అణచాలని చూస్తే, అది అంతకంత ఎదిగిపోతోంది.. జనసేనుడి మీటింగులకి ఇంటర్ నెట్ లేకుండా చేస్తూ మీడియా కవరేజికి అడ్డంకులు కల్పించడం, ఫ్లెక్సీలు చింపేయడం, మీటింగుకి వెళితే జరిమానా విధించడం, ఎదిరించివెళితే పోలీస్ కేసులు పెట్టడం నేటి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నట్లు వింటున్నాం..

ఇక పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసికొన్నాడు అనే ఆరోపణ కూడా ఇటువంటిదే. డబ్బు కోసం రెచ్చగొట్టి మాట్లాడే, నగ్న ప్రచారములు ఇచ్చే, బరితెగించిన బజారు “ఛీ” రెడ్డిలాంటి వారు కూడా ఆరోపణల చేస్తున్నారు. దీనికి విశేష ప్రచారము కూడా మన కమ్మని దొడ్డ మీడియాలో దొరుకుతున్నది. నాటి ఎన్టీఆర్’ని విమర్షించినట్లే నేడు పవన్ కళ్యాణ్ ని కూడా విమర్శించడము ఒక దిన చర్య అయిపోయింది. పీఆర్పీ కాలములో చిరంజీవి గట్టిగా మీడియాకి కౌంటర్ ఇచ్చి ఉంటే, నేడు మీడియా ఈ విధముగా భరితెగించేదికాదు. చిరంజీవి మంచితనాన్ని అలుసుగా చేసుకుని మీడియా తమ కులం కోసం క‌లాన్ని తాక‌ట్టు పెట్టేసింది..

ప్రజా నాయకుడు ఎన్ని పెళ్లిళ్లు చేసికొన్నాడు అని ప్రజలు ఎప్పుడు చూడరు. నాయకుడు, ప్రజలపై ఎంత నిబద్దత కలిగివున్నాడు అనేది చూస్తారు. ముసలికాలంలో ఎన్టీఆర్’కి రెండో పెళ్లి ఏమిటి అని నాటి కాంగ్రెస్ చేసిన ఆరోపణ, నాటి ఎన్నికల ప్రచారములో దుమ్మెత్తిపోసింది. కానీ ఎన్టీఆర్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండు పెళ్లిళ్లు అనే ఆరోపణ నీరు గారిపోయింది. నేటి తెలుగుదేశం, వైసీపీ కలిసి పవన్ కళ్యాణ్’పై చేస్తున్న మూడు పెళ్లిళ్లు ఆరోపణలు కూడా ఇప్ప‌టికే నీరు గారి పోయాయి..

వ్యభిచారం, అవినీతి, రౌడీ దర్బారులు, అక్రమాస్తులు పెంచడం తప్పు.. అంతేగాని, మూడు పెళ్లిళ్లు తప్పు కాదు. నేరము కాదు అని మన “ఛీ” రెడ్డిలకు వీరికి మద్దతు పలుకుతున్న మీడియాకి తెలియక కాదు. నాటి కాంగ్రెస్ అణచివేతల నుండే ఎన్టీఆర్ అధికారంలోకి రాగలిగాడు. ఇలానే అణచివేస్తే జనసేన కూడా అధికారంలోకి రావడము ఖాయం. అణచివేతల నుండే ఏ విజయానికైనా పునాదులు గట్టి పడతాయి.

ఒక పక్కన తెలుగుదేశం ప్రభుత్వం అపఖ్యాతి పాలు కావడము, మరొక పక్కన జనసేనకి ఇంత మద్దతు రావడానికి కారణం, నేటి పచ్చ మీడియా చేస్తున్న “అతే” అన్నది “బాబు” ఎంత తొందరగా తెలిసికొంటే అంత మంచిది. చేసిన త‌ప్పు ప‌దే ప‌దే చేస్తూ పోతే అది జ‌న‌సేన పాలిట వ‌రంగా మారుతోంది.. అంటే జ‌న‌సేన విజ‌యానికి ప్ర‌త్య‌ర్ధులే ప‌దునులేని విమ‌ర్శ‌ల‌తో బాట‌లు వేస్తున్నారన్న‌మాట‌..!!!

Share This:

1,228 views

About Syamkumar Lebaka

Check Also

అంగట్లో “ఎన్నికుల సర్వే రిపోర్టులు”!!! అమ్మ‌కానికి జాతీయ మీడియా స్టాట్స్‌..

“సర్” “వే?” (బయటపడే దారెటు) అనేవాళ్ళ కోసము “సర్వే” రిపోర్టులు అమ్మబడును అంటూ సర్వే రిపోర్టులు అమ్మేస్తున్నారు.. పచ్చ పార్టీకి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − ten =