Home / జన సేన / అణ‌చివేత‌తో అధికారం నిల‌వ‌దు.. విష‌బీజాలు అమృత‌ఫ‌లాల‌నివ్వ‌వు.. ప‌వ‌న్ న్యూ పంచ్..

అణ‌చివేత‌తో అధికారం నిల‌వ‌దు.. విష‌బీజాలు అమృత‌ఫ‌లాల‌నివ్వ‌వు.. ప‌వ‌న్ న్యూ పంచ్..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ వేదికగా పార్టీ సిద్ధాంతాలు, వ‌ర్థ‌మాన రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ప‌రోక్ష విశ్లేష‌ణ‌ను త‌న ప‌వ‌ర్‌ఫుల్ ప్ర‌జెంటేష‌న్ రూపంలో సంధిస్తూ., ప్ర‌త్య‌ర్ధుల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నారు.. మీడియా మ‌ద్ద‌తు లేకున్నా., త‌న వాయిస్‌ని ల‌క్ష‌లాది మందికి చేరుస్తూనే ఉన్నారు.. ప్ర‌స్తుతం త‌న బ్ర‌హ్మాస్త్రం ట్విట్ట‌ర్ ద్వారా సంధిస్తున్న బాణాలు, నిత్యం 28 ల‌క్ష‌ల మందికి పైగా అభిమానుల‌కి నేరుగా చేరుతుండ‌గా., ఆయ‌న ఫాలోవ‌ర్లు మొత్తం చేసే షేర్ల‌తో., ఓ పేరొందిన మీడియాకి మించి రీచ్ అవుతున్నాయి.. ఈ అంశం ప్ర‌త్య‌ర్ధుల్ని క‌ల‌వ‌ర‌పాటుకి గురిచేసేదే..

చ‌ల్ల‌ని సాయం సంధ్య వేళ‌.. కాస్త కొన్ని నిత్య స‌త్యాలు., కొన్ని అధికార పార్టీ భుజాలు త‌డుముకునే వ్యాఖ్యానాల‌తో కూడిన ట్వీట్స్ సంధించారు.. తాను చ‌దివిన పుస్త‌కాల్లో త‌న‌కు బాగా న‌చ్చిన‌వి., తాను ఫాలో అయ్యేవి.. కొన్నొ పోస్ట్ చేశారు.. చెడ్డ మ‌నుషుల‌కి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌ని ప్ర‌జ‌లంతా అనుకుంటారు.. కానీ, మ‌నం పోరాడాల్సింది వారిలో ఉన్న చెడుపై అంటూ ఓ ట్వీట్ పెట్టారు.. కాసేప‌టికి స‌త్యం అనేది ఎల్ల‌ప్పుడూ బ‌ల‌మైన వాద‌న‌.. అని ఇంకో ట్వీట్ పోస్ట్ చేశారు.. యోధుడిలో లోప‌ల శ‌క్తి ఉంటుంది.. అత‌ని గుండెలో, మ‌న‌సులో, ఆత్మ‌లో శ‌క్తి ఉంటుంది అని ప‌వ‌న్ పేర్కొన్నారు..

విష బీజాల నుంచి అమృత‌ఫ‌లాలు పుట్ట‌వు.. విరోధం నుంచి స్నేహం పుట్ట‌దు..అణ‌చివేత కార్య‌క్ర‌మంతో ఆరంభ‌మైన అధికారం నిల‌వ‌దు.. మా లెక్క‌ల ప్ర‌కారం విరోధం రాజుల మ‌ధ్య‌న ఉంది గానీ., వివిధ ప్రాంతాల ప్ర‌జ‌ల మ‌ధ్య లేదు. వీరు తామంద‌రూ భార‌తీయులం అని అనుకుంటున్నారు. మ‌న స్వార్ధాల‌కు మ‌న‌మే వారిని ర‌క‌ర‌కాలుగా విడ‌కొడుతున్నాము.. అంటూ ఖ‌ర‌వేలుడు అనే న‌వ‌ల నుంచి రాసుకున్న‌ ఓ సారాంశాన్ని పోస్ట్ చేశారు.. ఈ రైట‌ప్‌లో ప్ర‌తి ప‌దం, కుహ‌నా రాజ‌కీయ శ‌క్తుల భుజాలు త‌డుముకునేలా చేసేవే.. పైగా ప్ర‌తి వాఖ్యం అక్ష‌ర స‌త్యం కూడా..

ఇక త‌న‌కు స్ఫూర్తి ప్ర‌ధాత అయిన నాయ‌కుడు ఎవ‌రో కూడా చివ‌రి ట్వీట్‌లో ఫోటోతో స‌హా పోస్ట్ చేశారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. సింగపూర్ నిర్మాణంలో త‌న‌దైన ముద్ర వేసిన లీ క్వాన్ యూ నుంచి తాను ఎంతో స్ఫూర్తిని పొందిన‌ట్టు తెలిపారు.. ఆయ‌న ప్రస్ధానం, సింగ‌పూర్‌ని నిర్మించిన తీరు తెలుసుకోవాలంటే., లీ క్వాన్ జీవిత చ‌రిత్ర‌ను చ‌ద‌వ మంటూ ., ఆ పుస్త‌కం తాలూకు ముఖ‌చిత్రాన్ని పోస్ట్ చేశారు.. ప‌దే ప‌దే సింగ‌పూర్ నిర్మిస్తాం అంటూ చెప్పే ఏపీ సిఎంకి., సింగ‌పూర్ లాంటి రాజ‌ధాని కావాలంటే, ముందుగా సింగ‌పూర్ త‌ర‌హా అవినీతి ర‌హిత పాల‌న అవ‌స‌ర‌మ‌ని విమ‌ర్శించే జ‌న‌సేన అధినేత‌., అక్క‌డ ఆ ప‌రిస్థితులు ఎలాంటి పాల‌న వ‌ల్ల సాధ్య‌ప‌డ్డాయో చెప్పేందుకే ‘ఫ్రమ్ థర్డ్ వరల్డ్ టూ ఫస్ట్.. ది సింగపూర్ స్టోరీ :1965 -2000.. లీ క్వాన్ యూ’ పుస్త‌కాన్ని చ‌ద‌వ‌మంటూ సూచించారు..

గ‌డ‌చిన ఐదారు రోజులుగా కెమెరామెన్ ట్విట్ట‌ర్‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రంగంలోకి దిగిన ప్ర‌తిసారీ ., ఎవ‌రో ఒక‌రికి పంచ్‌లు ప‌డుతూనే ఉన్నాయి.. యుద్ధం కొన‌సాగుతూనే ఉంది.. స్టే ట్యూన్‌..

Share This:

1,699 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + seven =