Home / పోరు బాట / అనంత‌కోటి స‌మ‌స్య‌లతో జ‌న‌సేనానికి క‌రువుసీమ స్వాగ‌తం..

అనంత‌కోటి స‌మ‌స్య‌లతో జ‌న‌సేనానికి క‌రువుసీమ స్వాగ‌తం..

images ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా పోరుబాట ప‌ట్టిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ముచ్చ‌ట‌గా మూడో స‌భ‌కి క‌రువుసీమ‌గా పేరున్న అనంత‌ని వేదిక‌గా ఎంచుకున్నారు.. స‌భ‌కు అనంత‌పురాన్ని సేనాని వేదిక‌గా ఎంచుకోవ‌డం వెనుక చాలా కార‌ణాలే ఉన్నాయి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఆవ‌శ్య‌క‌త ఏంటి అనే విష‌యాన్ని చాటి చెప్ప‌డం ఒక అంశం.. రాయ‌ల‌సీమ‌లో అత్యంత వెనుక‌బ‌డిన జిల్లా అనంత‌, రాయ‌ల‌వారి హ‌యాంలో ర‌త‌నాల సీమ‌గా వెలుగొందిన ఆ ప్రాంతం., మ‌న పాల‌కుల దెబ్బ‌కి క‌రువుసీమ అయ్యింది.. ఓ వైపు రైతులు, మ‌రో వైపు నేత‌న్న‌ల ఆక‌లి కేక‌లు నిత్య‌కృత్యం.. అప్ప‌ల‌బాద‌లు తాడ‌లేని వారి ఆత్మ‌హ‌త్య‌లూ నిత్య‌కృత్య‌మే.. అనంత అన్న‌దాత చూపు ఏడాది పొడుగునా ఆకాశం వైపే ఉంటుంది.. వ‌రుణుడు క‌రుణిస్తేనే., అక్క‌డ విత్తు మొలుస్తుంది మ‌రి.. నేత‌లు ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా హంద్రినీవా పేరు చెప్పి ప‌బ్బం గ‌డిపేసుకుంటారు.. అది పూర్త‌యితే ఆ ఎర్ర‌నేల‌లు కాస్త ప‌చ్చ‌రంగు  పులుముకుంటాయ‌న్న‌ది అనంత రైత‌న్న‌ల ఆశ‌.. ఆ ఆశ తీరి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తే జ‌నం ఎక్క‌డ త‌మ‌ను లెక్క‌చేయ‌రోన‌ని., నేత‌లు ఎప్ప‌టిక‌ప్పుడు దాన్ని పూర్తి చేస్తామ‌నే క‌బురే చెబుతారు.. తాజా అంచ‌నా వ‌చ్చే ఏడాదికి ప్రాజెక్టు పూర్త‌చేయాలి.. అప్ప‌టికి పూర్త‌యినా., ప్రాజెక్టులోకి ఎగువ నుంచి క‌నీసం తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిప‌డా నీరైనా వ‌స్తుందా అన్న‌ది సందేహాస్ప‌దం.. దీనికి తోడు ఇక్క‌డ న‌కిలీ విత్త‌నాలు, ద‌ళారుల రాజ్యం.. వెర‌సి అన్న‌దాత‌ల అప్పుల ఊభి, ఆత్మ‌హ‌త్య‌లు..

31river download-copy

ఇక నేత‌న్న‌ల ప‌రిస్థితి చూస్తే., ధ‌ర్మ‌వ‌రం ప‌ట్టు చీర‌ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న పేరు, డిమాండ్ ఎవ‌రూ చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. అయితే ముడి స‌రుకు విష‌యంలో వ‌చ్చే స‌బ్సిడి ద‌గ్గ‌ర నుంచి, మార్కెట్‌కి త‌ర‌లించే వ‌ర‌కు ఎక్క‌డా వీరికి గిట్టుబాటు ఉండ‌దు.. మూలిగే న‌క్క‌పై తాటిపండు ప‌డిన‌ట్టు ఇప్పుడు దేశీ మార్కెట్‌లోకి దూసుకువ‌చ్చిన చైనా సిల్కుధారాలు., నేత కార్మికుల‌ని మ‌రింత ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.. దీంతో ఏ వార్తా ప‌త్రిక చూసినా నిత్యం జిల్లాలో ఏదో ఒక మూల నేత‌న్న‌ల ఆత్మ‌హ‌త్య‌ల వార్త‌లే..

ప్ర‌త్యేక హోదా ఇచ్చే విష‌యంలో ఇలా ఆర్ధికంగా అనిశ్చితి ఉన్న‌., నిత్యం క‌రువు కాట‌కాల ప్ర‌త్యేక ప‌రిస్థితులు ఉన్నా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌చ్చు.. అయితే మ‌న కుహ‌నా రాజ‌కీయ నాయ‌కులు., ఇలాంటి ప్రాంతాల‌కు ప్ర‌త్యేక హోదా అవ‌స‌రాన్ని చాటి చెప్ప‌కుండా., రాజ‌కీయ ల‌బ్ధి, ఆర్ధిక ల‌బ్ది కోసం ప్యాకేజీలు అంటూ బొంకుతున్నారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌మృద్ధిగా పంట‌లు పండే ప్రాంతాలే కాదు., ఇలా నిత్యం క‌రువు కాట‌కాల మ‌ధ్య మ‌గ్గే ప్రాంతాలు కూడా ఉన్నాయ‌న్న విష‌యాన్ని కేంద్రం ముందు ఉంచాల్సిన అవ‌స‌రం ఉంది.. పాల‌కులు చేయ‌లేని ఆ ప‌నిని తాను చేస్తానిని ముందుకు వ‌చ్చారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇక్క‌డ ప్ర‌జ‌ల వెత‌లు ఢిల్లీ పాల‌కుల‌కు విన‌బ‌డేలా గ‌ర్జించేందుకే సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య వేదిక‌కు అనంత‌ని ఎంచుకున్నారు.. ఇలాంటి లీడ‌ర్‌కి రాజ‌కీయానుభ‌వం లేదంటూ విమ‌ర్శ‌లు చేసే నేత‌ల్ని ఏమ‌నాలో..

Share This:

1,597 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × three =