Home / జన సేన / అనంత క‌థ‌న‌రంగానికి సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సైన్యం.. సేనాని గ‌ర్జ‌న‌కి భారీ ఏర్పాట్లు..

అనంత క‌థ‌న‌రంగానికి సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సైన్యం.. సేనాని గ‌ర్జ‌న‌కి భారీ ఏర్పాట్లు..

14708211_334993623547730_492536841818731781_n 14595659_334997640213995_4063043274388367130_n 14633568_1767868613430080_269065916358164548_o

అనంత‌పురం వేదిక‌గా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోగించిన స‌మ‌ర‌నాధానికి జ‌న‌సైన్యం స‌మాయ‌త్త‌మ‌వుతోంది.. ఛ‌లో అనంత‌పురం, అంటూ రాష్ట్ర ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాన సంఘాలు గ‌ర్జిస్తున్నాయి.. ప‌వ‌ర్‌స్టార్ స్టామినా చాటేందుకు ఎవ‌రికి వారుగా స్వ‌త‌హాగా సిద్ధ‌మ‌వుతున్నారు.. ఓపిక ఉన్న మేర‌కు సొంత వాహ‌నాల్లో కొంద‌రు అభిమానులు అనంత ప‌య‌న‌మ‌వుతుంటే., మ‌రికొంద‌రు ఏకంగా త‌మ వాహ‌నాల‌ను ప‌వన్ ఇజానికి అంకితం మిచ్చేశారు.. ఎంత మంది వ‌స్తే.., అంత‌మందిని స‌భకు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఇక అనంత‌పురం జిల్లా అభిమానులు, వివిధ జిల్లాల నుంచి., స‌రిహ‌ద్దు జిల్లాల నుంచి సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ‌కు వ‌చ్చే జ‌న‌సైన్యానికి గ్రాండ్ వెల్క‌మ్ ప‌లికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే అంద‌రికీ ఆహ్వానం ప‌లుకుతూ అనంత ప‌వ‌న్ అభిమానులు పోస్ట‌ర్లు విడుద‌ల చేశారు.. ఇక రాష్ట్ర ప‌వ‌న్ క‌ళ్యాణ్ యువ‌త కూడా న‌వంబ‌ర్ 10 ఛ‌లో అనంత‌పురం పేరుతో పోస్ట‌ర్లు విడుద‌ల చేశారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కోసం ప‌వ‌ర్‌స్టార్ చేస్తున్న పోరాటానికి త‌మ వంతు స్వ‌చ్చందంగా మ‌ద్ద‌తు తెల‌ప‌డం ద్వారా., త‌మ స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.. స‌భ‌ను విజ‌య‌వంతం చేయ‌డం ద్వారా., కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టించాల‌ని భావిస్తున్నారు.. త‌మ ఓట్ల‌తో గెలిచి, త‌మ‌కు ఇచ్చిన హామీల‌ని గాలికి వ‌దిలేసిన పాల‌కుల‌కు., ప‌వ‌న్ గొంతుతో గొంతు క‌ల‌ప‌డం ద్వారా హెచ్చ‌రిక‌లు జారీ చేసేందుకు రెఢీ అవుతున్నారు..

అటు అనంత సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ‌కు ల‌క్ష‌లాధిగా త‌ర‌లివ‌చ్చే జ‌న‌సైన్యానికి ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా ఏర్పాట్లు చేసే ప‌నిలో పార్టీ శ్రేణులు ఉన్నాయి.. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని., రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి ప‌వ‌న్ స‌భ‌కు వ‌చ్చే అభిమానులు సేఫ్‌గా తిరిగి వారి వారి ఇళ్ల‌కు చేరేలా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.. ఓ రాజ‌కీయ నాయ‌కుడు ఓ బ‌హిరంగ స‌భ పెట్టాలంటే స్థానిక నేత‌ల నుంచి అంతా హ‌డావిడి చేయాలి, జ‌న‌స‌మీక‌ర‌ణ‌కు జేబుల‌కి చిల్లు పెట్టుకోవాలి.. అదే ఓ లీడ‌ర్ బ‌య‌టికి వ‌స్తే., ఎలా ఉంటుందో తెలియ‌డానికి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌భ‌లే నిద‌ర్శ‌న‌మ‌ని ఇప్ప‌టికే రాజ‌కీయ విమ‌ర్శ‌కులు సైతం ఒప్పుకుంటున్నారు. ప్ర‌త్య‌ర్ధి మీడియాలో ప‌నిచేస్తున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు సైతం ఆఫ్ ద రికార్డ్ ప‌వ‌న్ మేనియాకి స‌లాం కొడుతున్నారు.. మ‌రి హామీలు మ‌ర‌చిన పాల‌కుల్లారా కాచుకోండి., మా జ‌న‌సైన్యం దాడిని త‌ట్టుకుని నిల‌బ‌డండి..

Share This:

1,373 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 4 =