Home / ఎడిటోరియల్స్ / అనంత టూర్‌లో ఆవిష్కృత‌మైన ప‌వ‌న్ ”ఇజం’.. ‘విజన్‌’.. ‘నైజం”..

అనంత టూర్‌లో ఆవిష్కృత‌మైన ప‌వ‌న్ ”ఇజం’.. ‘విజన్‌’.. ‘నైజం”..

11brk-pawana స‌మ‌స్య ఎక్క‌డుంటే.. తాను అక్క‌డే.. ఎందుకంటే ఆ స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌టం అంటే ఆయ‌న‌కి ఇష్టం.. ప‌రిష్కార మార్గాలు వెత‌క‌డంలోనే ఆయ‌న‌కు ఆనందం ఉంది.. ఇది జ‌న‌సేనాని ప‌వ‌న్ పంధా.. మ‌రి ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న ఎంచుకున్న మార్గం ఏంటి..? గాంధీగిరా..  బోస్ బాటా..? లేక ప‌టేల్ పంధానా..? రెండో రోజు అనంత ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గేట్స్ విద్యార్ధులతో జ‌రిగిన ముఖాముఖిలో ఎదురైన ఓ ప్ర‌శ్న ప‌వ‌న్ ఇజాన్ని.. విజ‌న్‌ని ఆవిష్క‌రించింది.. ప్ర‌త్యేక హోదా కోసం అవ‌స‌ర‌మైతే నిరాహార దీక్ష చేస్తాన‌న్నారుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు చేయ‌లేదు అన్న‌దే ఆ ప్ర‌శ్న‌.. క‌ష్ట‌మైనా పోరాడ‌టం ఇష్టం.. ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని పార‌ద్రోల‌డం ఇష్టం.. అయితే ఆ పోరాటం ఎలా ఉండాల‌న్న‌దే కీల‌కం.. గాంధీయిజం ఇష్ట‌మే.. కానీ ప్ర‌తి స‌మ‌స్య‌కు అది ప‌రిష్కారం చూప‌లేద‌న్న‌ది ప‌వ‌న్ ఉద్దేశం.. నిరాహార‌దీక్ష‌ల‌తో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయిపోతే., దేశంలో అస‌లు స‌మ‌స్య‌లే ఉండేవి కావు.. దారిద్ర్యమూ ఉండేది కాదు.. స‌మ‌స్య‌కు ముందుగా ప‌రిష్కార మార్గం ఆలోచించాలి.. అవ‌స‌ర‌మ‌నుకుంటే ఆవేశ‌ప‌డాలి.. అవ‌స‌రం లేద‌నుకుంటే శాంతిమంత్రం జ‌పించాలి.. ప్ర‌తి మాట‌., ప్ర‌తి ప‌ని ఆలోచించి ప్ర‌ణాళికా బ‌ద్దంగా చేయాలి.. ఈ పోరాటంలో మిత్రుల కంటే శ‌త్రువులే ఎక్కువ‌.. ముందుగా వారి వ్యూహాలు ప‌సిగ‌ట్టాలి.. ఫైన‌ల్‌గా రావాల్సింది ఫ‌లితం.. అదే ప‌వ‌నిజం..

_34a0283మాట చెప్పాక వెన‌క్కి తీసుకోను.. వెన్నుచూప‌ను.. మ‌డం తిప్ప‌ను.. ప‌బ్లిక్ మీటింగ్ అయినా.. ప్రయివేటు చిట్ చాట్ అయినా ప‌వ‌న్ చెప్పేమాట ఇది.. మాటే కాదు జ‌న‌సేనాని చేత కూడా అదే.. అందుకే ఎవ‌రేమ‌నుకున్నా ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారంలో అలుపెర‌గ‌ని పోరాటం చేస్తూనే ఉన్నారు.. ప‌వ‌న్ అండ‌తో ప‌వ‌ర్‌లోకి వ‌చ్చిన పాల‌కులు., హోదా అనే మాట‌నే మ‌రచిన స‌మ‌యంలో వారికి గుర్తు చేశారు.. ఇప్పుడు అదే అంశాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తుంటే., పోరుబాట ప‌ట్టారు.. తొలి స‌భ‌లో హోదా ఎక్క‌డ అంటూ ఆయ‌న సంధించిన ప్ర‌శ్నే.. కేంద్ర, రాష్ట్రాల్లో క‌ద‌లిక తెచ్చింది.. ప్యాకేజీ రూపంలో ప్ర‌త్యామ్నాయాలు వెతికేలా చేసింది.. విభ‌జ‌న హామీల్లో భాగంగా హోదా కావాల‌ని చాలా మంది అడుగుతున్నారు… మ‌రి ప‌వ‌న్ బ‌రిలోకి దిగిన‌ప్పుడే స్పంద‌న ఎందుకు అంటే..? ఆయ‌న పోరాటంలో నిబ‌ద్ధ‌త ఉంది.. నిజాయితీ ఉంది.. అలాంటి పోరాటాన్ని ఎదుర్కొనే శ‌క్తి ఏ ప్ర‌భుత్వానికీ లేదు.. అందుకే ప్ర‌తి విష‌యంలో జ‌న‌సేనానిని నొప్పింప‌క‌.. ఒప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.. ఇక్క‌డ నిబ‌ద్ద‌త ఆయ‌న నైజం..

_34a0300ఇప్ప‌టికీ హోదా సాధ‌న‌కే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌ట్టుబ‌డి ఉన్నారు.. అందుకే ప్యాకేజీ అంటూ పాల‌కులు క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెబుతున్నా., హోదా హ‌క్కు అంటూ పోరాటం చేస్తూనే ఉన్నారు.. చ‌ట్ట‌బ‌ద్ద‌త లేని ప్యాకేజీ ముసుగులో జ‌రుగుతున్న వంచ‌న‌ను ఎలుగెత్తారు.. ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూ అన్నందుకే ఎగిరెగిరి ప‌డిన ఆ నాటి నేత‌లు., ఇది అస‌లు ప్ర‌త్యేక ప్యాకేజీయే కాద‌ని ప‌వ‌న్ తేల్చిచెప్పిన‌ప్పుడు ఎందుకు బ‌దులివ్వ‌డం లేదు.. వారి నోళ్లు ఎందుకు మూత‌ప‌డ్డాయి.. కాగితాల మాటున ఉన్న వారి గుట్టు ర‌ట్ట‌య్యింద‌నా.. ఇంత దారుణ‌మై కుట్ర‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఎందుకు భాగ‌మైంది..? ఆ భాగోతం బ‌య‌ట‌ప‌డ‌టం వ‌ల్లే.. అనంత వేదిక‌గా చంద్ర‌బాబు అండ్ కోకి ఆయ‌న చుర‌క‌లు అంటించారు.. ఒక స‌మ‌స్య‌పై పోరాడేప్పుడు దాన్ని పూర్తిగా ఆక‌ళింపు చేసుకోవ‌డం., దాని వెనుకదాగి ఉన్న ర‌హ‌స్యాల్ని చేధించ‌డం.. వ్యూహాత్మ‌క పోరాటం చేయ‌డం.. ఇది ప‌వ‌న్ విజ‌న్‌.. అనంత టూర్‌లో ఆవిష్కృత‌మైంది అదే..

Share This:

2,592 views

About Syamkumar Lebaka

Check Also

మార్పు మొద‌లైంది..అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది- అభ్య‌ర్ధుల‌తో జ‌న‌సేనాని..

ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన వెంట‌నే నాలుగు రోజులు సీట్లు, ఓట్లు అంటూ హ‌డావిడి చేసిన రాజ‌కీయ పార్టీలు, ఆ పార్టీల …

One comment

  1. His words and vision giving some confidence still lot to plan to bring forward

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten − 3 =