Home / పోరు బాట / ప్యాకేజీ అంతా వంచ‌న‌.. దానికే స‌న్మానాలు, స‌త్కారాలా..?

ప్యాకేజీ అంతా వంచ‌న‌.. దానికే స‌న్మానాలు, స‌త్కారాలా..?

అనంత వేదిక‌గా జ‌న‌సేనాని గ‌ర్జించారు.. ప్ర‌త్యేక ప్యాకేజీ ముసుగులో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల వంచ‌న‌ను జ‌నం ముందు ఎండ‌గ‌డ్డారు.. జ‌నాన్ని మ‌భ్య‌పెట్టే అంకెల గార‌డిపై ఎలుగెత్తారు.. ప్యాకేజీ తెచ్చేశామంటూ స‌న్మానాలు చేయించుకుంటున్న కేంద్ర మంత్రి వెంక‌య్య ద‌గ్గ‌ర నుంచి ఆ స‌న్మానాలు, స‌త్కారాలు చేస్తున్న టీడీపీ స‌ర్కారు వ‌ర‌కు ఎవ్వ‌రినీ వ‌దల్లేదు.. పార్ల‌మెంటు త‌లుపులు మూసి చీక‌ట్లో రాష్ట్రాన్ని చీల్చారు.. ఇప్పుడు అదే చీక‌ట్లో ప్యాకేజీ ఇచ్చారు.. చేసే ప‌నిలో నిజాయితీ ఉంటే ఈ చీక‌టి మాటు వ్య‌వ‌హారాలేందుకు అని ప్ర‌శ్నించారు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట్ల‌కు వ‌చ్చిన‌ప్పుడు అంద‌రికీ అర్ధ‌మ‌య్యేలా హామీ ఇచ్చిన మీరు., జ‌నానికి ఇచ్చేప్పుడు ఎందుకు అర్ధంకాని లెక్క‌ల‌తో గ‌జిబిజి చేస్తార‌ని నిల‌దీశారు..

ప్యాకేజీ ప్ర‌క‌టించిన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ.. 2.03 ల‌క్ష‌ల కోట్ల‌ని ప్ర‌క‌టించారు.. వెంక‌య్య‌నాయుడు గారు 2.25 ల‌క్ష‌ల కోట్లు అంటారు.. అస‌లు ప్యాకేజీ మొత్తం ఎందో మీకు స్ప‌ష్ట‌త ఉందా అని జ‌న‌సేనాని ప్ర‌శ్నించారు.. ఆ ప్యాకేజీకి కూడా చ‌ట్ట‌బ‌ద్ద‌త లేద‌ని., పాల‌కులు మ‌రోసారి మోసం చేసేందుకు రెడీ అయ్యార‌ని విమ‌ర్శించారు.. ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్ర‌కారం, ప‌న్నుల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావ‌ల్సిన వాటా ల‌క్షా 75 వేల కోట్ల‌ని, దాన్నే ప్ర‌త్యేక ప్యాకేజీగా బిల్డ‌ప్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.. దానికే ఆహా ఓహో అంటూ స‌న్మానాలు, స‌త్కారాలు ఏందుకు చేస్తున్నారో చెప్పాలంటూ టీడీపీ స‌ర్కారుని ప్ర‌శ్నించారు.. చ‌ట్ట‌ప‌రంగా రావాల్సింది వ‌స్తే.. దానికి ప్యాకేజీ తొడుగు ఎందుకు తొడిగారో చెప్పాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిల‌దీశారు.. ఇది ఖ‌చ్చితంగా వంచ‌నే అంటూ దుమ్మెత్తిపోశారు..

స్పెష‌ల్ స్టేట‌స్‌పై నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నారు.. హోదా మంత్ర‌దండం కాదంటారు.. గ‌డ‌చిన చ‌రిత్ర అని చెబుతున్నారు.. మీకు గ‌డ‌చిన చ‌రిత్ర అయితే అవ్వొచ్చుగాని., అనంత లాంటి జిల్లాకి అది అమృత‌పు చుక్క అన్నారు..

ఆ క‌ల్ల‌బొల్లి క‌బుర్ల కాల‌క్షేపం ఆపాల‌ని., అస‌లు ప్ర‌త్యేక హోదా ఇస్తారో..?  లేదో తేల్చి చెప్పేయాల‌ని జ‌న‌సేనాని డిమాండ్ చేశారు.. నాన్చుడు ధోర‌ణి వీడ‌కుంటే., నాని, నాని మెత్త‌బ‌డే రోజులు పోయాయ‌న్నారు.. నాన్చిన‌కొద్ద త‌మ మ‌న‌సులు మ‌రింత గ‌ట్టిప‌డ‌తాయ‌ని., ప్ర‌జ‌ల్లో భావావేశాలు తారాస్థాయికి చేరే వ‌ర‌కు వెయిట్ చేయోద్ద‌ని హెచ్చ‌రించారు.. హోదా ఎప్పుడు ఇస్తారు.. ఎప్పుడు తెస్తారు.. క్లారిటీ ఇవ్వండంటూ కేంద్ర, రాష్ట్రాల్ని డిమాండ్ చేశారు.. ఎంత‌టి స‌మ‌స్య అయినా ఎదురెల్లి పోరాడేందుకు తాను సిద్దంగా ఉన్నానంటూ వార్నింగ్ ఇచ్చారు..

Share This:

1,420 views

About Syamkumar Lebaka

Check Also

క‌డ‌ప‌ కోట‌లో పాగా వేసేదెవ‌రు.? జ‌న‌సేన చ‌రిత్ర సృష్టించ‌నుందా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు.. ఏలయినా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని క‌ల‌లు కంటున్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి, తిరిగి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 − 2 =