Home / పవన్ టుడే / న‌వంబ‌ర్ 10న‌ అనంత వేదిక‌గా జ‌న‌సేనాని గ‌ర్జ‌న‌..!

న‌వంబ‌ర్ 10న‌ అనంత వేదిక‌గా జ‌న‌సేనాని గ‌ర్జ‌న‌..!

pspkff
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌త్యేక హోదా సాధ‌న ల‌క్ష్యంతో ఉద్య‌మబాట ప‌ట్టిన‌ జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్., అదే అజెండాతో మ‌రో ప‌బ్లిక్ మీటింగ్‌కి సై అంటున్నారు.. విభ‌జ‌న హామీలు తుంగ‌లో తొక్కి, ప్యాకేజీ లంటూ జ‌నాన్ని మోసం చేస్తున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు విన‌బ‌డేలా మరోసారి స‌మ‌ర‌నాధం చేయ‌నున్నారు.. అందుకు వేదిక‌, డేట్ దాదాపు ఖ‌రార‌య్యాయి.. న‌వంబ‌ర్ 10వ తేదీన‌ అనంత‌పురం జిల్లా వేదిక‌గా జ‌న‌సేనాని ఓ బ‌హిరంగ‌స‌భ‌ నిర్వ‌హించ‌నున్నారు.. కాకినాడ స‌భ‌లో ఓ సైనికుడి మృతి త‌ర్వాత ప‌బ్లిక్ మీటింగ్‌ల‌కి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిర్ణ‌యించుకున్నా., అభిమానుల కోరిక మేర‌కు ఆ నిర్ణ‌యాన్ని పునఃస‌మీక్షించుకోవాల్సి వ‌చ్చింది.. సామాజిక మాధ్య‌మాల ద్వారా, నేరుగా, ఉత్త‌రాల ద్వారా అభిమానులు ఆయ‌న్ని ప్ర‌జ‌ల్లోకి రావాల‌ని, ప్ర‌త్యేక హోదా వ‌ల్ల వ‌చ్చే ఉప‌యోగాలు ఏంటో స్వ‌యంగా ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు.. ప్ర‌త్యేక హోదా రావ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభాలు ఏంటి, రాక‌పోతే వ‌చ్చే న‌ష్టాలు ఏంట‌నేది వివ‌రించ‌డంతో పాటు జిల్లాల వారీగా బ‌హిరంగ స‌భ‌లు ఏర్పాటు చేయ‌డం ఆయా ప్రాంతాల్లో స‌మ‌స్య‌ల్ని ఆక‌ళింపు చేసుకునే వీలుంటుంద‌ని జ‌న‌సేనాని సైతం భావిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్ కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా అనంత వేదిక‌గా రెండో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.. అందుకు సంబంధించి ఒక‌టి రెండు రోజుల్లో పార్టీ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు నినాదంతో నిర్వ‌హించ‌నున్న ఈ స‌భ‌లో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేస్తున్న మోసాన్ని వివ‌రించ‌డంతో పాటు కాకినాడ స‌భ అనంత‌రం వ‌చ్చిన విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్ట‌నున్నారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేన పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభం.. ఇక్క‌డి నుంచే పాల‌నా వ్య‌వ‌హారాలు..

జ‌న‌సేన పార్టీ ప‌రిపాల‌నా కార్యాల‌యం కొత్త భ‌వ‌నానికి మారింది.. హైద‌రాబాద్ మాదాపూర్‌లోని ఓ భ‌వంతిలో నూత‌న కార్యాల‌యం ప్రారంభ‌మైంది.. శుక్ర‌వారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − one =

%d bloggers like this: