ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభల శక్తిగా మారిన జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి అడుగు సంచలనమే.. అందుకే ఆయన ఏ సమస్యపై వకాల్తా పుచ్చుకున్నా., పాలకులు వెంటనే దాని పరిష్కార మార్గాలు అన్వేషించేస్తారు.. ఒక్కదానికి మినహా.. అదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం.. ప్రత్యేక హోదా సిద్ధిస్తే., ప్రజలకు లాభం.. ప్యాకేజీ పుచ్చుకుంటే పాలకులకి లాభం.. అందుకే ఈ విషయంలో జనసేనాని నిర్ణయాన్ని ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. పవన్ పోరాటం ఏం తిప్పలు తెచ్చిపెడుతుందోనన్న కంగారు ఉన్నా., పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం కనబరుస్తున్నాయి.. ఈ విషయంలో పవన్ కూడా తాడో-పేడో తేల్చుకునేందుకే రెఢీ అయ్యారు.. అందుకోసం జిల్లాల్లో సభల ద్వారా ప్రజల్ని చైతన్య పర్చడంతో పాటు పాలకులకి హెచ్చరికలు జారీ చేయాలని భావిస్తున్నారు.. అయితే పవర్‌స్టార్‌కి పబ్లిక్‌లో ఉన్న క్రేజీ దృష్ట్యా సభల నిర్వహణలో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. పవన్ పిలుపు మేరకు లక్షలాధిగా తరలివచ్చే ఆయన భక్తులు., జాగ్రత్తగా తిరిగి ఇంటికి చేరతారా..? లేదా అన్నదే ఆ భయానికి కారణం.. కాకినాడ సభ సూపర్ డూపర్ హిట్ అయినా, చివర్లో ఓ జనసైనికుడు ప్రాణాలు కోల్పోవడం సేనానికి గుండె కోత మిగిల్చింది.. అనంత వేదికగా 10వ తేదీన జరిగే సభలో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా పార్టీ శ్రేణులు పకడ్బంధిగా ఏర్పాట్లు చేస్తున్నాయి..
ఇక ఇప్పటికే పోస్టర్లతో ప్రచారం షురూ చేసిన పవర్‌స్టార్ అభిమానులు., సభ నిర్విఘ్నంగా జరగాలంటూ సర్వమత ప్రార్ధనలు ప్రారంభించారు.. గురువారం నుంచి శనివారం వరకు ఈ ప్రార్ధనలు సాగనున్నాయి.. కుల,మత, ప్రాంతీయ విబేధాలు లేకుండా జనసేనాని భక్తులంతా సీమాంధ్ర హక్కుల చైతన్య సభ విజయం కోసం దేవుణ్ణి ప్రార్ధిస్తున్నారు.. తొలి రోజు కుల,మతాలకు అతీతంగా పవర్ ఫ్యాన్స్ దర్గాల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.. సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడమంటూ ఆ అల్లాని ప్రార్ధించారు.. శుక్ర, శని వారాల్లో చర్చిలు, ఆలయాల్లో ప్రత్యేక ప్రార్ధనలు, పూజలు నిర్వహించనున్నారు.. వారి దేవుడి విజయంలో ఆ దేవుడి సహాయం ఉండాలన్నదే వారి ఆకాంక్ష..