Home / జన సేన / అభిమానానికి ఆంక్ష‌లు అడ్డుకాదు.. ఒమ‌న్‌లోనూ జ‌న‌సేన అధినేత జ‌న్మ‌దిన వేడుక‌లు..

అభిమానానికి ఆంక్ష‌లు అడ్డుకాదు.. ఒమ‌న్‌లోనూ జ‌న‌సేన అధినేత జ‌న్మ‌దిన వేడుక‌లు..

గుండెల్లో అభిమానం ఉండాలే గానీ., దాన్ని చాటుకోవ‌డానికి ఎలాంటి ఆంక్ష‌లు అడ్డురావు అని నిరూపించారు మ‌స్క‌ట్‌లోని ఎన్ఆర్ఐ జ‌న‌సైనికులు.. అర‌బ్ దేశాల్లోనే విప‌రీత‌మైన ఆంక్ష‌లు వుండే ప్ర‌దేశాల్లో ఒక‌టైన ఒమ‌న్‌లో జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులు., పార్టీ అధినేత జ‌న్మ‌దిన వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించారు.. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో నిషేదాజ్ఞ‌లు వున్నా., ఓ గ‌దిలో జ‌న‌స‌నాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిలువెత్తు బ్యాన‌ర్లు., గుండెల నిండా ఉన్న జెండాల్ని గ‌ది నిండుగా అలంక‌రించి మ‌రీ వేడుక‌లు నిర్వ‌హించారు.. జ‌న‌సేనుడికి జేజేలు ప‌లుకుతూ చిన్నారుల చేతుల మీదుగా కేక్‌లు క‌ట్ చేయించారు..

జ‌న్మ‌దినోత్స‌వ కానుక‌గా 35 కోత్త స‌భ్య‌త్వాలు..

ఒమ‌న్ లాంటి దేశంలో వుంటూ కూడా నిరంత‌రాయంగా పార్టీ గురించి ఆలోచిస్తున్న మ‌స్క‌ట్ వాలంట‌రీ జ‌న‌సేన విభాగం స‌భ్యులు., పార్టీ అధినేత పేరిట సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్టారు.. కార్య‌క‌ర్త‌లంతా ర‌క్త‌దానం చేసి సేవా స్ఫూర్తిని చాటుకున్నారు.. అందేకాదు దేశం కాని దేశంలో మ‌న వారి సంఖ్య అతి త‌క్కువ‌గా వుండే ప్రాంతంలో జ‌న‌సేన అధినేత‌కి ఆయ‌న కోరుకునే కానుక‌ని బ‌హుమ‌తిగా ఇవ్వాల‌ని భావించారు.. మ‌స్క‌ట్ జ‌న‌సేన టీం స‌భ్యులంతా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుట్టిన రోజు కోసం నెల రోజులుగా ప‌ని చేసి 35 మంది కొత్త వారికి పార్టీ స‌భ్య‌త్వం ఇచ్చారు.. కాలు క‌ద‌ప‌డ‌మే త‌ప్పు అన్న‌ట్టు ఆంక్ష‌లు వుండే ఒమ‌న్ లాంటి దేశాల్లో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతున్న ఈ జ‌న‌సైనికులు స్వ‌దేశంలోని జ‌న‌సైన కార్య‌క‌ర్త‌ల‌కి నిజ‌మైన స్ఫూర్తి ప్ర‌ధాత‌లు..                                                                                              Advertisement.

2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ముఖ్య‌మంత్రిని చేయ‌డ‌మే ల‌క్ష్యంగా స్వదేశంతో పాటు విదేశాల్లో వున్న జ‌న‌సైనికులు పని చేయాల‌ని మ‌స్క‌ల్ వాలంట‌రీ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పిలుపునిచ్చారు.. పార్టీకి ఇచ్చే డొనేష‌న్ల వ్య‌వ‌హారంలో మ‌ధ్య వ‌ర్తుల్ని న‌మ్మ‌వ‌ద్ద‌నీ., స్వ‌దేశంలో వున్న బంధువుల ద్వారా పార్టీకి నేరుగా డొనేష‌న్లు అంజేయాల‌ని నిర్ణ‌యించారు.. జ‌న్మ‌దిన వేడుక‌ల్లో త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్న ఎన్ఆర్ఐ జ‌న‌సైనికులు., మ‌ధ్వ‌వ‌ర్తుల ముసుగులో కొంద‌రు డొనేష‌న్ల‌ను దారి మ‌ళ్లిస్తున్న‌ట్టు త‌మ దృష్టికి వ‌చ్చిన విష‌యాన్ని ప్ర‌స్థావించారు.. విజ‌య్ సార‌ధి, బొత్స శ్రీధ‌ర్ త‌దిత‌ర కార్య‌క‌ర్త‌లు మ‌స్క‌ట్‌లో కార్య‌క్ర‌మాల‌ని ప‌ర్య‌వేక్షిస్తున్నారు..

Advertisement.

Share This:

1,397 views

About Syamkumar Lebaka

Check Also

ఓట్ల మాయంపై రోడ్డెక్కిన జ‌నసేన‌.. మా ఓటు-మా హ‌క్కు అంటూ నిర‌స‌న‌..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఓ వైపు ఎన్నిక‌ల సంఘం ప్ర‌తి నెలా డ్రైవ్‌లు పెట్టి మరీ 18 సంవ‌త్స‌రాలు నిండిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × one =