Home / జన సేన / అభివృద్దికీ, సంక్షేమానికీ స‌మ‌న్వ‌యం లేదు.. బుగ్గ‌న బ‌డ్జెట్‌పై జ‌న‌సేన పెద‌వి విరుపు..

అభివృద్దికీ, సంక్షేమానికీ స‌మ‌న్వ‌యం లేదు.. బుగ్గ‌న బ‌డ్జెట్‌పై జ‌న‌సేన పెద‌వి విరుపు..

పోల‌వ‌రంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి
సున్నా వ‌డ్డీ రుణాల‌కు రూ. 5 వేల కోట్లు కేటాయించాలి
కేంద్రం నుంచి రావల్సిన నిధుల మాటేంటి.?
ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నింటికీ మీ పేర్లేనా.?
ప్ర‌భుత్వ విద్యా, వైద్యానికి పెద్ద‌పీట వేయాలి


వైసీపీ స‌ర్కారు ప్ర‌వేశ‌పెట్టిన తాజా వార్షిక బ‌డ్జెట్‌పై జ‌న‌సేన పార్టీ పెద‌వి విరిచింది.. ఆర్ధిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో అభివృద్దికి, సంక్షేమానికి మ‌ధ్య స‌మ‌తుల్య‌త కొర‌వ‌డింద‌ని ఆ పార్టీ అభిప్రాయ‌ప‌డింది.. సంక్షేమ ప‌థ‌కాల కేటాయింపుల‌తో పాటు రాష్ట్ర ఆర్ధిక ప్ర‌గ‌తి అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేస్తే బాగుండేద‌ని జ‌న‌సేన సూచించింది.. ఎన్నిక‌ల హామీ న‌వ‌ర‌త్నాల అమ‌లుకు బ‌డ్జెట్‌లో కేటాయింపులు అయితే చేశారు గానీ, అందుకు అవ‌స‌ర‌మైన నిధులు ఎక్క‌డి నుంచి వ‌స్తాయ‌నే అంశంలోనూ స్ప‌ష్ట‌త కొర‌వ‌డిందంటూ విమ‌ర్శించింది.. హైద‌రాబాద్ ప్ర‌శాస‌న్‌న‌గ‌ర్ లోని పార్టీ కార్యాల‌యంలో పార్టీ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది.. పార్టీ త‌రుఫున మాట్లాడిన సీనియ‌ర్ నేత చింత‌ల పార్ధ‌సార‌ధి ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడిగా భావిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టుకు రూ. 5 వేల కోట్లు కేటాయించార‌నీ., వైసిపి చెబుతున్న‌ట్టు 2021 నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఇంకా రూ. 32 వేల కోట్లు అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. ఆ నిధులు ఎక్క‌డి నుంచి తీసుకువ‌స్తారు.? కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్ని ఏ విధంగా తీసుకువ‌స్తారు.? అనే అంశాల‌పై వైసిపి స‌ర్కారు స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.. ఇప్ప‌టికే గుత్తేదార్తు పోల‌వ‌రం ఖాళీ చేసి పోతున్న అంశాన్ని ప్ర‌స్థావించిన ఆయ‌న‌., ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ సెటిల్‌మెంట్‌కి సంబంధించి స్ప‌ష్ట‌త లేదన్న విష‌యాన్ని గుర్తు చేశారు.. నిర్వాసితుల‌కి ఇప్పటి వ‌ర‌కు ఎంత ఇచ్చారు. ఇంకా ఎంత ఇవ్వాలి. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఎంత వ‌స్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని తీసుకురావ‌డం కోసం వైసిపి స‌ర్కారు ద‌గ్గ‌ర ఉన్న ప్ర‌ణాళిక‌లు ఏంటి.? త‌దిత‌ర అంశాల‌ను ప్రస్థావిస్తూ పోల‌వ‌రంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని జ‌న‌సేన పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసింది. మిగిలిన నీటిపారుద‌ల ప్రాజెక్టుల‌కు కూడా అర‌కొర నిధులే కేటాయించార‌న్న అభిప్రాయాన్ని పార్ధ‌సార‌ధి వ్య‌క్తం చేశారు..

ప్ర‌జా సంక్షేమం అవ‌స‌ర‌మే గానీ అదే స‌మ‌యంలో రాష్ట్ర ఆర్ధిక పురోగ‌తి కూడా అవ‌స‌రమ‌ని తెలిపారు.. ఈ రెండింటికీ మ‌ధ్య సమ‌తుల్య‌త అవ‌స‌ర‌మ‌న్నారు.. ఆర్ధికంగా పురోగ‌తి సాధిస్తేనే అభివృద్దిలో రాష్ట్రం ముందుకు వెళ్తుంద‌న్నారు. ఆరోగ్య శ్రీ విష‌యానికి వ‌స్తే మ‌ధ్య‌త‌ర‌గతికి వ‌ర్తింప చేయ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మ‌న్నారు. అయితే ఆరోగ్య శ్రీకి ఇచ్చే బ‌డ్జెట్‌లో అంతా ప్ర‌యివేటు ఆసుప‌త్రుల ప‌రం అవుతోంద‌నీ, వేల కోట్లు ప్ర‌యివేటుకు దోచిపెట్టే కంటే ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో వైద్య సౌక‌ర్యాలు మెరుగుప‌రిస్తే బాగుంటుంద‌ని తెలిపారు.. జిల్లా స్థాయి ఆసుప‌త్రుల్లో మౌలిక స‌దుపాయాలు మెరుగుప‌ర్చాల‌ని డిమాండ్ చేశారు.. అవ‌స‌రం మేర‌కు డాక్ట‌ర్ల నియామ‌కం చేప‌ట్టాల‌ని కోరారు. వైద్య క‌ళాశాల‌ల‌ను ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌కు అనుసంధానం చేస్తే మ‌రిన్ని క‌ళాశాల‌లకు అనుమ‌తులు తెచ్చుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.. ప్ర‌భుత్వం రంగంలో వైద్యానికి మ‌రింత కేటాయింపులు చేస్తే బాగుండేద‌న్నారు. ప్ర‌భుత్వాలు మారిన ప్ర‌తిసారీ సంక్షేమ ప‌థ‌కాల పేర్లు మారిపోతున్నాయన్న పార్ధ‌సార‌ధి., టీడీపీ హ‌యాంలో ఎన్టీఆర్ చంద్ర‌న్న ప‌థ‌కాలు అంటూ ఉద‌ర‌గొడితే, వైసిపి స‌ర్కారు అన్ని ప‌థ‌కాల‌కు వైఎస్ఆర్ పేరుని త‌గిలించిందన్నారు.. అధికారంలో ఉన్న వారు మాత్ర‌మే రాష్ట్ర అభివృద్ది కోసం త్యాగాలు చేశారా.? అంటూ ప్ర‌శ్నించిన ఆయ‌న‌., దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారు ఎంతో మంది ఉన్నార‌ని గుర్తు చేశారు.. కొన్ని ప‌థ‌కాల‌కు అయినా ఆ త్యాగ మూర్తుల పేర్లు పెట్టాల‌ని జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున విజ్ఞ‌ప్తి చేశారు..

అటు సంక్షేమ ప‌థ‌కాల‌కు పెద్ద‌పీఠ అన్నారు. రైతుల‌కు సున్నా వ‌డ్డీ రుణాలు అన్నారు. తీరా ఆ సున్నా వ‌డ్డీ రుణాల‌కు కేటాయించింది రూ. 100 కోట్లేన‌ని., అది ఎటూ స‌రిపోద‌ని ఎద్దేవా చేశారు.. మ‌న‌ది వ్య‌వ‌సాయ ఆధారిత రాష్ట్రం. ప్ర‌స్తుతం తీవ్ర‌మైన క‌రువు ప‌రిస్థితులు నెల‌కొని ఉన్నాయి. వీటికి తోడు విత్త‌నాల కొర‌త‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో రూ. 100 కోట్లు ఎలా స‌రిపోతాయ‌ని ప్ర‌శ్నించారు.. సున్నా వ‌డ్డీ రుణాల‌కు క‌నీసం రూ. 5 వేల కోట్లు కేటాయిస్తే రైతుల‌కి ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌నీ., బ‌డ్జెట్ ఆమోదానికి ముందు జ‌న‌సేన పార్టీ చేసిన ఈ సూచ‌న‌ను స్వీక‌రించాల‌ని కోరారు.. ఓవ‌రాల్‌గా బ‌డ్జెట్ చూస్తే అప్పులు, ఆదాయం మ‌ధ్య భారీగా తేడా క‌న‌బ‌డుతోంది. గ‌తం ప్ర‌భుత్వం కూడా కేంద్రం నుంచి రూ. 50 వేల కోట్లు తెస్తామ‌ని చెప్పింది. తీరా వ‌చ్చింది రూ. 20 వేల కోట్టు మాత్ర‌మే. బ‌డ్జెట్‌కి సంబంధించి ఏ విష‌యంలోనూ స్ప‌ష్ట‌త లేదు. ప్ర‌స్తుతం రాష్ట్రానికి ఉన్న రాబ‌డి ఎంత‌, కేంద్రం నుంచి ఎంత వ‌స్తుంది. అప్పుల రూపంలో ఎంత తీసుకువ‌స్తున్నాం అనే అంశాల మ‌ధ్య స‌మ‌తుల్య‌త పాటిస్తేనే అభివృద్ది సాధ్య‌ప‌డుతుంద‌న్నారు.. జ‌న‌సేన సూచ‌న‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని సుప‌రిపాల‌న అందించాల‌ని పార్ధ‌సార‌ధి ఆకాంక్షించారు..

Share This:

319 views

About Syamkumar Lebaka

Check Also

విలువ‌ల‌తో కూడిన పోరాటం చేశాం.. ఓడినా త‌లెత్తుకు తిరుగుతున్నాం- తానాలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

విలువ‌ల‌తో కూడిర రాజ‌కీయాలు చేశాం.. అందుకే ఓడినా గ‌ర్వంగా ఉంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.. తాను రాజ‌కీయాల్లోకి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × 4 =