Home / పవన్ టుడే / ‘అమ్మ‌’కు జ‌న‌సేనాని నీరాజ‌నం..

‘అమ్మ‌’కు జ‌న‌సేనాని నీరాజ‌నం..

_91539913_gettyimages-612864606-1

అమ్మ‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి ప‌ట్ల జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు.. త‌న త‌రుపున‌, పార్టీ శ్రేణుల త‌రుపున నీరాజ‌నాలు తెలుపుతూ., ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.. విప్ల‌వ‌నాయ‌కి, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప్రియ‌త‌మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌న‌ను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన‌ట్టు అందులో పేర్కొన్నారు.. ఆసుప‌త్రిలో చేరిన ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాల‌తో తిరిగి ఇంటికి చేరుకుంటార‌ని దేశ ప్ర‌జ‌ల‌తో పాటు తాను ఆశించిన‌ట్టు తెలిపారు.. అయితే ఆమె తిరిగిరాని లోకాల‌కు ప‌య‌న‌మై మ‌నంద‌ర్నీ తీవ్ర దుఃఖంలో వ‌దిలి వెళ్లార‌న్నారు.. మూడు ద‌శాబ్దాల‌కు పైగా జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడుతో పాటు దేశ రాజ‌కీయాల‌పై చెర‌గ‌ని ముద్ర వేశార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. త‌మిళ ప్ర‌జ‌లు అమ్మ‌గా కొలుచుకునే జ‌య‌ల‌లిత బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తే ఆశ‌గా, శ్వాస‌గా జీవించార‌ని కొనియాడారు.. పేద ప్ర‌జ‌ల కోనం త‌మిళ‌నాడు అంత‌టా ఆమె అమ‌లు జ‌రిపిన సంక్షేమ ప‌థ‌కాలు స‌దా అనుస‌ర‌ణీయమ‌న్నారు.. మ‌హిళా శ‌క్తికి ఆమె ప్ర‌భ‌ల నిద‌ర్శ‌నంగా నిలిచార‌ని కీర్తించారు.. అమ్మ మ‌ర‌ణం ఒక్క త‌మిళ‌నాడుకే కాక‌., యావ‌త్ భార‌తావ‌నికీ తీవ్ర లోట‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు.. ఆమెకు మ‌నఃపూర్వ‌క అంజ‌లి గ‌టిస్తూ., నా త‌రుపున‌, జ‌న‌సేన పార్టీ శ్రేణుల త‌రుపున సంతాపం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు..

షెడ్యూల్ ప్ర‌కారం జ‌న‌సేనాని ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ప‌ర్య‌టించి., అక్క‌డ కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల్ని ప‌లుక‌రించాల్సి ఉంది.. అయితే అమ్మ జ‌య‌ల‌లిత ప‌రిస్థితి విష‌మంచింద‌న్న వార్త‌ల నేప‌ధ్యంలో., ఆ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసుకున్న విష‌యం తెలిసిందే..

Share This:

457 views

About Syamkumar Lebaka

Check Also

12 అంశాల‌తో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట్‌.. సాహ‌సోపేత నిర్ణ‌యాలే సాధ్య‌మేన‌న్న జ‌న‌సేనుడు..

జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో ఎలా వుండోబోతోంది.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప్ర‌జా సంక్షేమం మేళ‌వింపుగా జ‌న‌సేనుడు చేప‌ట్ట‌నున్న విజ‌న్ ఎలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × two =

%d bloggers like this: