Home / జన సేన / అమ‌రావ‌తిలో జ‌న‌సేనుడి నూత‌న‌గృహం.. భూమి పూజ నిర్వ‌హించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తులు..

అమ‌రావ‌తిలో జ‌న‌సేనుడి నూత‌న‌గృహం.. భూమి పూజ నిర్వ‌హించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తులు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నివాసానికి పునాదిరాయి ప‌డింది.. రాజ‌ధాని అమ‌రావ‌తిలో విజ‌య‌వాడ‌-గుంటూరు మ‌ధ్య రెండెక‌రాల సువిశాల ప్రాంగ‌ణంలో జ‌న‌సేనాని గృహ‌నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు.. అందుకు సంబంధించి భూమిపూజ కార్య‌క్ర‌మం సోమ‌వారం శాస్త్రోక్తంగా జ‌రింగింది.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తులు సంప్ర‌దాయ బ‌ద్దంగా ఈ క్ర‌తువుని నిర్వ‌హించారు.. వేద‌పండితులు నిర్ణ‌యించిన ముహుర్తానికి ఉద‌యం స‌రిగ్గా 8 గంట‌ల 26 నిమిషాల‌కి హోమంతో జ‌న‌సేనుడు త‌న ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ ప్రారంభించారు.. వేద పండితుల మంత్రోచ్చ‌ర‌ణ‌ల మ‌ధ్య., అతి స‌న్నిహితుల స‌మ‌క్షంలో ప‌వ‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు..

హోమం అనంత‌రం ప‌వ‌న్‌, ఆయ‌న భార్య అన్నా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇద్ద‌రు పూర్ణాహుతి స‌మ‌ర్పించి., శంకుస్థాప‌న చేశారు.. అనంత‌రం ప్ర‌ధాన గృహానికి సంబంధించి పునాది కూడా నిర్ణ‌యించిన ముహుర్తానికి పూర్తి చేశారు.. ఇక ప్ర‌ధాన గృహ‌స‌ముదాయానికి ఈశాన్యంలో ఉద‌యం 9 గంట‌ల 42 నిమిషాల‌కి జ‌న‌సేనాని వ్య‌క్తిగ‌త కార్యాల‌య భ‌వ‌నానికి భూమి పూజ నిర్వ‌హించారు.. అనంత‌రం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దంప‌తుల‌కి నూత‌న వ‌స్త్రాల‌ను స్థానికులు బ‌హూక‌రించారు.. వేద పండితుల ఆశీర్వ‌చనాల అనంత‌రం., ప‌వ‌న్ దంప‌తులు శాస్త్రోక్తంగా గోపూజ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు..

ఇక మీద‌ట జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ ఇంటి నుంచే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి సంబంధించి పార్టీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తారు.. ఏపీ ప్ర‌జ‌ల‌కి సాధ్య‌మైనంత ఎక్కువ స‌మ‌యం అందుబాటులో ఉండ‌డంతో పాటు స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి జ‌న‌సేనాని ఇక్క‌డ నివాసం ఏర్పాటు చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో స‌మ‌స్య‌ల ప‌రిష్కార కేంద్రంగా మారిన జ‌న‌సేనాని., ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి హైద‌రాబాద్ పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చే స‌మ‌స్య‌ల సంఖ్య భారీగా ఉండ‌డంతో., ఆయ‌న ఎక్కువ స‌మ‌యం ఇక్క‌డ అందుబాటులో ఉండాలన్న నిర్ణ‌యానికి వ‌చ్చారు.. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేయ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి..

ఈ ఇంటి నిర్మాణం కోసం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల ఖాజా టోల్‌గేట్ స‌మీపంలో రెండెక‌రాల స్థ‌లాన్ఇ కొనుగోలు చేశారు..

Share This:

4,989 views

About Syamkumar Lebaka

Check Also

ఓట్ల మాయంపై రోడ్డెక్కిన జ‌నసేన‌.. మా ఓటు-మా హ‌క్కు అంటూ నిర‌స‌న‌..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఓ వైపు ఎన్నిక‌ల సంఘం ప్ర‌తి నెలా డ్రైవ్‌లు పెట్టి మరీ 18 సంవ‌త్స‌రాలు నిండిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − one =