Home / జన సేన / అమ‌ర‌వీరుడు వినోద్ రాయ‌ల్‌కు జ‌న‌సైన్యం ఘ‌న నివాళి..

అమ‌ర‌వీరుడు వినోద్ రాయ‌ల్‌కు జ‌న‌సైన్యం ఘ‌న నివాళి..

img-20170115-wa0061 img-20170116-wa0021

ప్ర‌త్య‌ర్ధుల కుట్ర‌కు బ‌లైపోయిన జ‌న‌సైనికుడు తిరుప‌తికి చెందిన వినోద్ రాయ‌ల్‌ను జ‌న‌సేన స్మ‌రించుకుంది.. వినోద్ రాయ‌ల్‌కి తిరుప‌తి, చిత్తూరు జిల్లాల‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సైనికులు ఘ‌నంగా నివాళులు అర్పించారు.. ఆయ‌న చిత్ర‌ప‌టాన్ని పూల‌మాల‌ల‌తో నింపేశారు.. నీ అడుగు జాడ‌ల్లో న‌డుస్తామంటూ ప్ర‌తిన‌బూనారు..

img-20170115-wa0050

తిరుప‌తిలో వినోద్ రాయ‌ల్ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో అత‌ని త‌ల్లిదండ్రులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.. స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో., పేద‌లైన పిల్ల‌ల న‌డుమ కేక్ క‌ట్ చేసి., వారికి మిటాయిలతో పాటు దుస్తులు పంపిణీ చేశారు.. ప‌వ‌ర్‌స్టార్ బాట‌లో వినోద్ రాయ‌ల్ చారిట‌బుట్ ట్ర‌స్ట్ త‌న‌వంతు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంద‌ని ఈ సంద‌ర్బంగా దివంగ‌త వినోద్‌రాయ‌ల్ త‌ల్లిదండ్రులు హామీ ఇచ్చారు.. ఏ ల‌క్ష్యాన్ని చేరే క్ర‌మంలో త‌మ కుమారుడు ప్రాణాలు విడిచారో., దాన్ని కాపాడుతామ‌న్నారు..

 

 

Share This:

About Syamkumar Lebaka

Check Also

భావిత‌రాల‌కి నిజాయితీతో కూడిన రాజ‌కీయాలు అందిద్దాం రండి.. జ‌న‌సేనుడి పిలుపు..

నీతి..నిజాయితీ..నిబ‌ద్ద‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేద్దాం ర‌మ్మంటూ జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., త‌న సేన జ‌న‌సైన్యాన్ని కార్యోన్ముఖుల్ని చేసే కార్య‌క్ర‌మానికి …

One comment

  1. Vinod rayal Aatma ki santhi kalagalani korukuntunnanu,jai janasena

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × three =

%d bloggers like this: