Home / పవన్ టుడే / అయ్యా ముఖ్య‌మంత్రి గారు.. సిక్కోలు రైతుల వ్య‌ధ ఇదిగో చూడండి..ఇట్లు మీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

అయ్యా ముఖ్య‌మంత్రి గారు.. సిక్కోలు రైతుల వ్య‌ధ ఇదిగో చూడండి..ఇట్లు మీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

వెనుక‌బాటుకి నెట్టేయ‌బ‌డిన సిక్కోలు జిల్లా మీద ఊహించ‌ని విధంగా విరుచుకుప‌డిన తిత్లీ తుపాను పెను విధ్వంసం సృష్టించింది.. గ్రామాల‌కి గ్రామాలు ఊడ్చేసింది.. ఇక్క‌డ రైతుల వ్య‌ధ‌, సామాన్యుడి గాధ‌.. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌డం లేదు.. చెట్టు కూలింది.. పుట్ట కూలింది.. ఇల్లు కూలింది.. బ‌తుకు భార‌మ‌య్యింది.. జ‌నాన్ని రోడ్డు పాలు చేసింది.. వేలాది మంది ప్ర‌జ‌లు ప‌ది రోజులుగా క‌ష్టాల క‌డ‌లిలో ఈదుతున్నారు.. వీరి వెత‌లు బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌వు.. మీడియా గొంతు వీరికి అండ‌గా నిల‌బ‌డ‌దు.. పచ్చ ప్ర‌భుత్వం అంతా భాగానే ఉంద‌ని చెబుతుంది.. అణు విధ్వంసాన్ని పోలిన విధ్వంసాన్ని, స‌ర్వ‌స్వం కోల్పోయిన వారి బ‌తుకుల‌నీ బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ చెప్పే నాధుడు లేడు.. ఆ బాధ్య‌త‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భుజాన వేసుకున్నారు.. అడుగ‌డుకొక్క‌టిగా క‌న‌బ‌డుతున్న క‌న్నీటి వ్య‌ధ‌ల్ని ప్ర‌పంచం దృష్టికి తీసుకువెళ్లి, వారిని సాయం అందే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు..

అయ్యా ముఖ్య‌మంత్రి గారు.. నేను ప‌వ‌న్‌క‌ళ్యాణ్.. తుపాను బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నాను. ఎం.సున్నిప‌ల్లి గ్రామంలో ఉన్నాను.. ఇక్క‌డ గ్రామ‌స్తులు చెబుతున్నారు.. సున్నిప‌ల్లికి ఇంకా క‌రెంటు రాలేదు.. మీ అధికారుల్ని పంపండి.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ల‌క్ష‌లాది మందికి తిత్లీ బాధితుల వెత‌లు తెలియ‌చేస్తూ పెట్టిన ట్వీట్ ఇది.. అయ్యా ముఖ్య‌మంత్రిగారు పాత మేఘ‌వ‌రం గ్రామంలో క‌నీసం తుపాను షల్ట‌ర్ లేదు.. అయ్యా ముఖ్య‌మంత్రి గారు.. ప‌ది రోజుల‌కి కుటుంబానికి రెండు కొవ్వొత్తులు ఇస్తున్నారంట‌.. ఇదేనా టీడీపీ పాల‌న‌..? అయ్యా ముఖ్య‌మంత్రి గారు.. ఇక్క‌డ రైతుల వెత‌లు చూడండి.. ఇక్క‌డ ఇళ్ల‌లోకి పాములు వ‌చ్చేస్తున్నాయంట‌.. సిక్కోలు యువ‌త మ‌నోవేధ‌న చూడండి.. అంటూ ప్ర‌తి ఐదు నిమిషాల‌కీ ఓ ట్వీట్‌తో ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిభిక్కిరి చేస్తున్నారు.. ముఖ్య‌మంత్రి విలాస‌వంతంగాఏసీలు పెట్టుకుని, బాధితుల ప‌రిభాష‌లో 20 కోట్ల రూపాయిల బ‌స్సులో వ‌చ్చి, న‌లుగురు తుపాను బాధితుల్ని ప‌క్క‌న కూర్చొబెట్టుకుని బాధితుల‌తో ద‌స‌రా అంటూ ఫోటోకి ఫోజు ఇస్తే ఆహా..ఓహో అంటూ క‌వ‌రేజ్ ఇచ్చే మీడియా.. బాధితుల వెత‌ల్ని గానీ, జ‌నంలో మ‌మేకం అవుతున్న జ‌న‌సేనుడి ప‌ర్య‌ట‌న‌కి గానీ క‌వ‌రేజ్ ఇవ్వ‌లేవు..

అందుకే కెమెరా మెన్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో.. జ‌న‌సేనాని.. ట్విట్ట‌ర్ వేదికగా తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌ల దుర్భ‌ర ప‌రిస్థితుల్ని క‌ళ్ల‌కి క‌డుతున్నారు.. సామాజిక మాధ్య‌మాల్లో ల‌క్ష‌ల మందికి వారి క‌ష్టాన్ని చేరుస్తున్నారు.. మూడో రోజు ప‌ర్య‌ట‌న ఆరంభంలో ఓ రైతు ఆవేద‌న‌.. త‌క్ష‌ణ రుణ‌మాఫీ అవ‌స‌రాన్ని చెబుతూ.. పాల‌కులు రుణ‌మాఫీ చేస్తామ‌ని చెబుతున్నారు.. నోరు చెబుతుంది గానీ ఇచ్చేందుకు చెయ్యి రావ‌డం లేదంటూ వాపోయారు.. కొవ్వొత్తుల పంపిణీ కొంద‌రికీ.. ఆహారం పంపిణీ కొంద‌రికే.. ఆఖ‌రికి కూలిన ఇళ్ల‌కి లెక్క‌లు క‌ట్టే విష‌యంలో కూడా అదే అస‌మాన‌త‌.. ఈ మొత్తం ప్ర‌జా నాడిని వీడియోలో బంధించి.. పాల‌కుల తీరుని దుయ్య‌బ‌డుతున్నారు..

బోట్లు కొట్టుకుపోయాయి.. తెప్ప‌లు కొట్టుకుపోయాయి.. వ‌ల‌లు కొట్టుపొయాయి.. కొడుకులాంటి కొబ్బరి కూలిపోయింది.. జీవితాన్నిచ్చే జీడి స‌ర్వ‌నాశ‌నం అయ్యింది.. విద్యార్ధుల భ‌విష్య‌త్తు పోయింది.. ఉద్యోగం లేదంటూ యువ‌త ఆవేద‌న‌..టీడీపీ యువ‌నేస్తం కొంద‌రికే హ‌స్తం అందిస్తోంది.. ప్ర‌తి ఒక్క‌రి ఆవేద‌ననీ ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకుంటున్నారు.. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టూర్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.. ఇప్ప‌టికే ఎన్‌.ఆర్‌.ఐలు తుపాను బాధితుల కోసం విరాళాల సేక‌ర‌ణ మొద‌లు పెట్టారు.. కొన్ని స్వ‌చ్చంద సంస్థ‌లు కూడా తుపాను బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకి క‌దులుతున్నాయి.. తుపాను బాధితుల కోసం తాను ఏం చేయ‌ద‌లుచుకున్నారో.. ఆ ల‌క్ష్యం దిశ‌గా అడుగులు వ‌డివ‌డిగా ప‌డుతున్నారు..

Share This:

1,194 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − 9 =