Home / పవన్ టుడే / అయ్య‌న్న‌పాత్రుడికి ప‌వ‌ర్‌ఫుల్ పంచ్‌తో అప్ అండ్ డౌన్ అదిరింది..

అయ్య‌న్న‌పాత్రుడికి ప‌వ‌ర్‌ఫుల్ పంచ్‌తో అప్ అండ్ డౌన్ అదిరింది..

16142376_409409479405709_6462923252815183413_n

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా అంశంపై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మిన‌హా ఏ ఒక్క‌రికీ స్ప‌ష్ట‌త లేన‌ట్టుంది.. అంతేకాదు హోదా సాధించాల‌న్న కోరిక కూడా పాల‌కుల‌కి ఉన్న‌ట్టు క‌న‌బ‌డ‌డం లేదు.. అందుకే ఓట్లేయించుకునేందుకు చెప్పిన క‌బుర్లు., గెలిచాక మ‌ర్చిపోయి మాట్లాడుతున్నారు.. ప్ర‌త్యేక హోదా విష‌యంపై జ‌న‌సేనాని మోడీతో మాట్లాడాలంట‌.. టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడుగారు సెల‌విచ్చిన మేట‌ర్ ఇది.. ఇక్క‌డే మాలో మేట‌ర్ లేద‌ని ఒప్పేసుకున్నారు…

pktwitpktwit-jpg2

అయితే అయ్య‌న్న సల‌హాపై జ‌న‌సేనుడు కూడా ఘాటుగానే స్పందించారు.. పెద్ద‌లు అయ్య‌న్న పాత్రుడుగారు తాను మోడీతో మాట్లాడితే బాగుంటుంద‌న్నార‌న్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., నేను వారికి చెప్పద‌లుచుకున్న విష‌యం ఏంటంటే అంటూ మొద‌లుపెట్టి., ఏకేశారు.. నేను మోడీగారితో ప్ర‌చార‌స‌భ‌ల్లో మాత్ర‌మే కూర్చున్నాన‌ని., కానీ నిత్యం పార్ల‌మెంటులో ఆయ‌న ప‌క్క‌నే కూర్చునే మీ ఏంపిలు ఏం చేస్తున్నారు..? మీడియా ముందుకి వ‌చ్చి కేంద్రం స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వ‌ద‌ని చెప్ప‌డం మిన‌హా అంటూ ఎద్దేవా చేశారు.. కేంద్రంలో పాల‌కులు అస‌లు ప్ర‌త్యేక హోదా ఇస్తారో..ఇవ్వ‌రో త‌ర్వాత సంగ‌తి., ప్ర‌జ‌ల అసంతృప్తిని కేంద్రానికి చెప్ప‌డానికి కూడా మీరు భ‌య‌ప‌డితే ఎలా..? అంటూ నిల‌దీశారు..

మీరు చేయాల్సిన ప‌ని మీరు చేయ‌క‌పోబ‌ట్టే క‌దా., ఇవాళ యువ‌త రోడ్ల మీద‌కి వ‌స్తుంది.. అంటూ వాగ్భాణాలు సంధించారు.. మీరు ఏమీ చెయ్యొద్దు.. యువ‌త‌నూ ఏమీ చెయ్యనీయోద్దు.. మ‌రి ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఏంటి..? అంటూ జ‌వాబుని అయ్య‌న్న‌కే వ‌దిలేశారు.. మ‌రి జ‌న‌సేనుడి ప్ర‌శ్నాస్త్రాల‌కు., విమ‌ర్శ‌నాస్త్రాల‌కు అయ్య‌న్న‌గారు మీ వ‌ద్ద బ‌దులుందా..? ఉంటే..? అది జ‌నానికి ఉప‌యోగ‌ప‌డేదే అయితే..? మీరూ మాట్లాడొచ్చు.. స్ప‌ష్ట‌త లేకుండా మార్కుల కోస‌మో., మైలేజ్ కోస‌మో మాట్లాడితే., అడుగ‌డుగునా ఇలాంటి ప్ర‌శ్న‌లే ఎదుర‌వుతాయి.. అవ‌త‌ల ఉన్న‌తి జ‌న‌సేనాని., మాట్లాడే ముందు వెనుకా.. ముందు కాస్త ఆలోచిస్తే మంచిది..

Share This:

1,019 views

About Syamkumar Lebaka

Check Also

క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిక‌-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌వాతు సూప‌ర్ స‌క్సెస్‌తో ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతుంటే., జ‌న‌సేనాని మాత్రం త‌న బాధ్య‌త‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + 11 =