Home / పెన్ పోటు / అరెస్టుకి వారెంటు సిద్ధం.. ఆ సానుభూతితో చంద్ర‌న్న క‌ల‌ సాకారమ‌య్యేనా..???

అరెస్టుకి వారెంటు సిద్ధం.. ఆ సానుభూతితో చంద్ర‌న్న క‌ల‌ సాకారమ‌య్యేనా..???

గత కొన్నినెలలుగా జనసేనుడు దిన దినాభివృధి చెందుతున్నాడు. జగనన్న గుడ్డిలో మెల్ల అన్నట్లు పాదయాత్రలో నిమగ్నమైపోయినాడు. కానీ చంద్రలోకాధీశుని పాలన మాత్రము రోజు రోజుకి మసగబారిపోతున్నది.. ఓ ప‌క్క అవినీతి ఆరోపణలు, ఇసుక మాఫియా, కాల్ మనీ, పచ్చ పరివారపు రాక్షస పాలన లాంటి ఆరోపణలుమరొక పక్కన మన చంద్రలోకాధీశుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

భ్రమరావతేకాని కానరాని అమరావతి ఒక పక్కన, స్వార్ధం కోసం తీసుకొన్న పోలవరం కమ్మని వరము అయినదే తప్ప ప్రజలకు శాపముగా మిగిలినది అని ఉండవల్లి లాంటి వారు చేస్తున్న ఆరోపణలు మరొక పక్కన ప‌చ్చాధిప‌త్యాన్ని మింగేస్తూ వస్తున్నాయి..

హోదా గోదాలో ఒక పక్కన, ఓటుకు నోట ఇంకో పక్కన, కేంద్రము దగ్గర ఉన్న కేసుల ఫైల్స్ మరొక పక్కన మన చంద్రలోకాధీశునికి కంటిమీద కునుకు రానివ్వడము లేదు.. ప‌రిస్థితి రణమా..? మరణమే శ‌ర‌ణ‌మా అన్నట్టు ఉన్నది.. రణము చేయాలి అంటే ఆయుధము కావాలి.. త‌న అమ్ముల‌పొదిలోని అస్త్ర‌శ‌స్త్రాల‌న్నీ., జ‌న‌మేలుతున్న సోషల్ మీడియా పుణ్య‌మా అని శ‌క్తిహీన‌మైపోయాయి..

కిం..క‌ర్త‌వ్యం అని ఆలోచిస్తే.. ఆఖ‌రి అస్త్రంగా సానుభూతి అనే ఆయుధాన్ని సాధించక త‌ప్ప‌ని దుస్థితి.. ప్రాంతీయ వాదము తేవడానికి శతవిధాలా ప్రయత్నించిన‌ మన చంద్రలోకాధీశుడు బొక్క‌బోర్లా ప‌డ్డారు. మన చంద్రలోకాధీశుడు కేంద్రాన్ని కెలికి, కెలికి కయ్యానికి కాలు దువ్వుతున్నది అరెస్ట్ వారెంటు కోసమే.. గరుడాజీలను మేపుతున్నది కూడా అరెస్ట్ చేస్తే., త‌ద్వారా వ‌చ్చే సానుభూతి సాధ‌న ల‌క్ష్యంతోనే.. అనుకున్న‌ది అనుకున్న‌ట్టు జ‌రిగితే., మ‌రోసారి ప‌చ్చ‌ని తోర‌ణాల మ‌ధ్య కుర్చీఈ ఎక్కేయోచ్చ‌ని గంపెడాశ‌తో వున్నారు..

ఏదో పాత కేసులో వచ్చిన అరెస్ట్ వారంట్ తో, మన చంద్రలోకాధీశుని కోరిక చివరకు నెరవేరుతునట్లు కనపడుతున్నది.. అస‌లుకి మ‌సి పూజి అల‌జ‌డి రేపేందుకు మ‌న ప‌చ్చ ప‌రివారం త‌మ శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటోంది..ఇలాంటి స‌మ‌యంలోనే జ‌నం కాస్త జాగ‌రూక‌త వ‌హించాలి.. లేక‌పోతే పోయేది మ‌న బ్ర‌తుకులేన‌న్న‌ది గుర్తించాలి.. సానుభూతి మాత్రం ప‌చ్చలోకాధీశులు అప్ప‌ణంగా ప‌ట్టుకెళ్లి పోతారు.. కుర్చీకోసము ఎంతకైనా సిద్దమే అనే ఈ నాయకుల పట్ల తస్మాత్తు జాగ్రత్త!!!

Share This:

2,117 views

About Syamkumar Lebaka

Check Also

”అజ్ఞాత‌వాసి ర‌విప్ర‌కాష్‌”ది ఎంత క్రిమిన‌ల్ మైండో చూడండి..

వెనుక‌టికి ఒక సామెత ఉంది ”చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది —— గుడిసెలు” అని.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

six − 1 =