Home / పవన్ టుడే / అరెస్టైన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు, యువ‌త‌కి జ‌న‌సేనాని అభినంధ‌న‌లు.. శేషేంద్ర ప‌ద్యంతో విప్ల‌వ స‌మ‌ర‌శంఖారావం..

అరెస్టైన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు, యువ‌త‌కి జ‌న‌సేనాని అభినంధ‌న‌లు.. శేషేంద్ర ప‌ద్యంతో విప్ల‌వ స‌మ‌ర‌శంఖారావం..

ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా శాంతిప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు సిద్ధ‌మైన జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు., యువ‌త‌ని పోలీసులు అరెస్టుల‌తో అడ్డుకున్నారు.. అర్ధ‌రాత్రి నుంచి మొద‌లైన ఈ అరెస్టుల ప‌ర్వం రోజంతా కొన‌సాగ‌గా., రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కు కూడా ఖాకీలు ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌లేదు.. రూల్ ప్ర‌కారం సాయంత్రం 5 త‌ర్వాత స్టేష‌న్లో ఉంచే అవ‌కాశం లేక‌పోగా., రాజ్యాంగం ఇచ్చిన హ‌క్కునే కాల‌రాసిన పోలీసులు, పాల‌కుల ఆదేశాల మేరకు రాత్రి 10 గంట‌ల త‌ర్వాతే వ‌దిలారు.. విడుద‌ల త‌ర్వాత కూడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు., ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ పోలీస్ స్టేష‌న్ ఎదుట పెద్ద పెట్టున నినాదాలు చేశారు.


pkaffterpkafter1

ఈ అరెస్టు-విడుద‌ల‌ల‌పై జ‌న‌సేనాని, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పందించారు.. ఇవాళ అరెస్టు కాబ‌డి విడుద‌లైన జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ని., యువ‌త‌కి త‌న త‌రుపున హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు తెలిపారు.. అంతా ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లాల‌ని కోరారు..

అంతేకాదు యువ‌త‌లో ఉద్య‌మ స్ఫూర్తిని నింపేందుకు., పాల‌కుల‌కి ఇది మీకు తాత్కాలిక విజ‌య‌మే అని తెలియ‌జెప్పేందుకు శేషేంద్ర రాసిన ఓ క‌విత‌ని ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు.. రాహువు ప‌ట్టిన ప‌ట్టొక సెకండు అఖండ‌మైనా.. లోక‌భాంధ‌వుడు అస‌లే లేకుండా పోతాడా..
మూర్ఖుడు గ‌డియారంలో ముల్లు క‌ద‌ల‌నీకుంటే.. ధ‌ర‌గ‌మ‌న‌మంత‌టితో త‌ల్ల‌కిందులై పోతుందా..
పాల‌కుల కూట‌మికొక తృటికాలం జ‌య‌మొస్తే.. విశ్వ సృష్టి ప‌రిణామం విశ్చిన్నమౌతుందా..
ధ‌నుజ‌లోక మేకంగా దారిక‌డ్డంగా నిల్చుంటే.. న‌ర‌జాతి ప్ర‌స్తానం ప‌రిస‌మాప్త‌మ‌వుతుందా.. అనే ప‌ద్యంతో ఈ పోరాట‌పు తొలి మ‌జిలీలో సేద‌దీర‌మ‌ని కోరారు.. త‌ద్వారా., ఇది మీకు క్ష‌ణ‌కాల‌పు విజ‌యం మాత్ర‌మే., ముందుంది ముస‌ళ్ల పండుగ అంటూ ప్రభుత్వాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తూనే.., ఇది కేవ‌లం వారి తాత్కాలిక గెలుపు మాత్ర‌మేన‌ని యువ‌త‌కు సందేశ‌మిచ్చారు.. రాబోయే పోరాటానికి స‌మ‌ర‌శంఖం పూరించారు..

 

Share This:

About Syamkumar Lebaka

Check Also

భావిత‌రాల‌కి నిజాయితీతో కూడిన రాజ‌కీయాలు అందిద్దాం రండి.. జ‌న‌సేనుడి పిలుపు..

నీతి..నిజాయితీ..నిబ‌ద్ద‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేద్దాం ర‌మ్మంటూ జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., త‌న సేన జ‌న‌సైన్యాన్ని కార్యోన్ముఖుల్ని చేసే కార్య‌క్ర‌మానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 + 12 =

%d bloggers like this: