Home / జన సేన / అర్ధ‌రాత్రి అల‌జ‌డి.. తిప్పికొట్టిన జ‌న‌సైన్యం.. రాత్రంతా ప‌హారా..

అర్ధ‌రాత్రి అల‌జ‌డి.. తిప్పికొట్టిన జ‌న‌సైన్యం.. రాత్రంతా ప‌హారా..

చిల్ల‌ర చేష్ట‌లు.. వీధి రౌడీ వేషాలు.. క‌న‌క‌పు సింహాస‌న‌మున సున‌క‌మును కూర్చుండ బెట్టినా వెనుక‌టి గుణ‌మేల పోవు.. అన్న చందంగా.. ఓ వీధి రౌడీ, జ‌న‌సేన అధినేత మాటల్లో గాలి రౌడీని తీసుకొచ్చి ఓ రెండు ల‌క్ష‌ల మందిని పాలంచ‌మంటూ శాస‌న‌స‌భ‌కి పంపినంతే.. అత‌ను మాత్రం ఏం చేస్తాడు.. ఉన్న ప‌ద‌విని అడ్డుపెట్టుకుని ఊరంతా ఊడ్చిపెడ‌తాడు.. దెందులూరు ఎమ్మెల్యే చింత‌మనేని తీరు అలాగే ఉంది.. జ‌నాన్ని భ‌య‌భ్రాంతుల‌కి గురిచేసి ఎలాగో శాస‌న‌స‌భ‌లో అడుగుపెట్టిన ఇత‌గాడి ఆగ‌డాల‌కి అంతూపొంతూ లేదు.. మీడియా మొత్తం ఈ కాల‌కేయుడి చ‌రిత్ర‌ను వినుడు వినుడు రామాయ‌ణ‌గాధ అంటూ చెప్పినా., ప‌ట్టించుకునే నాధుడు లేడు.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఇత‌నికి చ‌ట్టం అనే ప‌దం వ‌ర్తించ‌దు.. ఓ రౌడీ షీట‌ర్‌, 30 కేసులున్న ఓ రౌడీ షీట‌ర్‌ని నిస్సిగ్గుగా అసెంబ్లీకి పంపడ‌మే కాదు అత‌న్ని అడ్డంగా స‌మ‌ర్ధిస్తోంది కూడా.. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల పైకి అత‌న్ని ఓ ఆయుధంలా ప్ర‌యోగిస్తోంది.. ఇత‌ని ఆడ‌గాలు జ‌నం వెళ్లి జ‌న‌సేన అధినేత వ‌ద్ద మొర‌పెట్టుకోగా., జ‌నానికి జ‌రుగుతున్న ఆన్యాయాన్ని చూసి ఆయ‌న‌లో ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంది.. అందుకే దెందులూరు వెళ్లి మ‌రీ చింత‌మ‌నేని చిట్టా విప్పారు.. రౌడీ చింత‌మ‌నేని వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం, పాల‌నా వ్య‌వ‌స్థ‌ల వైఫ‌ల్యాన్ని ఎత్తిచూపారు.. ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల్ని ఎలుగెత్త‌డంతో పాటు అత‌నిపై చ‌ర్య‌ల‌కి డిమాండ్ చేశారు..

అస‌లే ఆకు రౌడీ.. ప‌ద‌వి వ‌చ్చినంత మాత్రాన బుద్ది మారుతుందా..? జ‌న‌సేన అధినేత త‌న బ‌తుకుని న‌డిరోడ్డు మీద ఎండేస్తుండ‌డంతో ఉక్రోషం క‌ట్ట‌లు తెచ్చుకుంది. ప‌గ‌లు ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌డం.. రాత్రిళ్లు దొంగ దాడులు చేయ‌డానికి అల‌వాటు ప‌డిన ఈ వీధి రౌడీ.. ప్ర‌భుత్వ స‌హాయం తీసుకుని మ‌రీ., జ‌న‌సేన అధినేత‌ని భ‌య‌పెట్టేందుకు విఫ‌ల‌య‌త్నం చేశాడు.. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో పోలీసుల్ని క‌ళ్యాణ మంట‌పం ద‌గ్గ‌ర్నుంచి ఖాళీ చేయించాడు.. న‌లుగురు అల్ల‌రి మూక‌ల్ని పంపి హ‌డావిడి చేయించే ప్ర‌య‌త్నం చేశాడు.. విష‌యం తెలుసుకున్న జ‌న‌సైనికులు క్ష‌ణాల్లో జ‌న‌సేనాని బ‌స వ‌ద్ద‌కి చేరుకుని, చింత‌మ‌నేని బ్యాచ్ ప్ర‌య‌త్నాల్ని తిప్పికొట్టారు..                                    Advertisement.

క్రాంతి క‌ళ్యాణ వేదిక వ‌ద్ద ఏదో జ‌రుగుతుంద‌న్న విష‌యం తెలియ‌గానే., ఏలూరు నుంచి పెద్ద సంఖ్య‌లో జ‌న‌సైనికులు అక్క‌డికి చేరుకున్నారు.. ఏలూరు నుంచి మాత్ర‌మే కాదు.. కృష్ణా జిల్లా విజ‌య‌వాడ‌, మ‌చిలీప‌ట్నం, పెడ‌న లాంటి సుధూర ప్రాంతాల నుంచి కూడా ఆఘ‌మేఘాల మేద జ‌న‌సైనికులు త‌మ సేనానికి ర‌క్ష‌ణ వ‌ల‌యంగా కాపు కాసేందుకు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు.. జ‌న‌సైన్యం నుంచి స‌డ‌న్ రియాక్ష‌న్ చూసిన చింత‌మనేని మూక‌లు తోక ముడిచాయి.. ప‌రిస్థితి చేయిదాట‌బోతోంద‌ని తెలుసుకున్న ఖాకీలు, వ‌చ్చిన అల్ల‌రి మూక‌ల్లో ఒక‌రిద్ద‌ర్ని అదుపులోకి తీసుకుని మ‌మ అనిపించాయి..

అయితే ఈ ఘ‌ట‌న ద్వారా ప్ర‌త్య‌ర్ధుల‌కి జ‌న‌సైనికుల ఓ పాఠం మాత్రం నేర్పారు.. చీమ చిట్టుక్కు మ‌న్నా., ఏ స‌మ‌యం అయినా., పార్టీ అధినేత కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధం అన్న హెచ్చ‌రిక‌లు పంపారు.. వాస్త‌వంగా ఒక చెడు., ఒక మంచి కోస‌మే అని., పోరాట యాత్ర అధ్యంతం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అల‌ర్ట్‌గా ఉండ‌డానికి ఈ ఘ‌ట‌న దోహ‌ద ప‌ర్చింది..

Advertisement.

Share This:

4,412 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 − three =