Home / జన సేన / అర‌కు ఎమ్మెల్యే,మాజీల కుటుంబాల‌కి జ‌న‌సేన సానుభూతి.. అక్ర‌మ క్వారీల‌ను మూసేయాల‌ని డిమాండ్‌..

అర‌కు ఎమ్మెల్యే,మాజీల కుటుంబాల‌కి జ‌న‌సేన సానుభూతి.. అక్ర‌మ క్వారీల‌ను మూసేయాల‌ని డిమాండ్‌..

అర‌కు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో గూడ గ్రామంలో సాగుతున్న అక్ర‌మ క్వారీ త‌వ్వ‌కాల వ్య‌వ‌హారంపై రాష్ట్ర ప్ర‌భుత్వం స‌కాలంలో స్పందించి ఉంటే ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలు ప్రాణాలు పోగొట్టుకునేవారు కాద‌ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ అభిప్రాయ‌ప‌డింది.. అర‌కు ఘ‌ట‌న‌పై అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైన పొలిటిక‌ల్ అడ్వ‌జ‌రీ క‌మిటీ స‌ర్వేశ్వ‌ర‌రావు, సోమ‌ల మృతి ప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేసింది.. వారి కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతిని ప్ర‌క‌టించింది..

జనసేనాని పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అర‌కు నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లిన సంద‌ర్భంగా గూడ గ్రామస్తుల విజ్ణప్తి మేరకు ఆయ‌న అక్కడికి వెళ్ళిన విషయాన్ని ప్యాక్ గుర్తు చేసింది. అక్కడి క్వారీ తవ్వకాల మూలంగా తాగు నీటి వనరులు కలుషితమైన తీరుని అక్కడి గ్రామస్తులు జ‌న‌సేన అధినేత‌కి చూపించారు.. తమ ఇళ్ళు దెబ్బతింటున్న విషయాన్ని, తాము పడుతున్న ఇబ్బందుల్నీ ఆయ‌న‌కి వివ‌రించారు.. అలాగే కర్నూలు జిల్లా హత్తి బెళగల్ గ్రామంలోని క్వారీలో నిబంధనలకి విరుద్ధంగా ఉంచిన పేలుడు పదార్థాలు పేలి 12 మంది కార్మికులు మృత్యువాతపడ్డారు. ఆ దుర్ఘటన ప్రదేశాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించి అక్రమ క్వారీలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయాన్ని కూడా ప్యాక్ గుర్తుచేసింది..                                    Advertisement.

గూడ గ్రామస్తులు తమ దగ్గర సాగుతున్న అక్రమ మైనింగ్ ను నిలుపుదల చేయాలని పలుమార్లు డిమాండ్ చేశారు. అధికారులకి విజ్ఞాపనలు ఇచ్చారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ప్యాక్ తెలిపింది.. ఈ ఉదాసీన వైఖరి వల్లే స్థానిక ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమలు ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచింది.. ఇకనైనా ప్రభుత్వం స్పందించి అక్రమ మైనింగ్ వ్యవహారాలను నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాల‌ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ డిమాండ్ చేసింది..

Advertisement.

Share This:

2,409 views

About Syamkumar Lebaka

Check Also

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen + 6 =