Home / జన సేన / అశోక‌గ‌జ‌ప‌తిరాజు గారు.. నా పేరే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. కోట ముందు పేలిన‌ ప‌వ‌ర్ పంచ్‌..

అశోక‌గ‌జ‌ప‌తిరాజు గారు.. నా పేరే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. కోట ముందు పేలిన‌ ప‌వ‌ర్ పంచ్‌..

2014 ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యంతో ప్ర‌చారం చేయించుకున్న చాలా మంది టీడీపీ నేత‌ల‌కి ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎవ‌రో కూడా గుర్తుకు రావ‌డం లేదు.. ఆ లిస్టులో మొద‌ట చెప్పుకోద‌గిన ప‌చ్చ చొక్కా.. విజ‌య‌న‌గ‌రం రాజావారు.. గ‌జ‌ప‌తిరాజుల వంశానికి చెందిన అశోక‌గ‌జ‌ప‌తిరాజు.. ఆ నాడు బొబ్బిలి యుద్ధంలో ఆంగ్లేయుల‌తో చేతులు క‌లిపిన గొప్ప చ‌రిత్ర ఉన్న వంశం నుంచి వ‌చ్చిన‌ ఈ రాజావారు.. పార్ల‌మెంటు స‌భ్యుడిగా పోటీ చేసిన‌ప్పుడు గెలుపు కోసం జ‌న‌సేనానితో ప్ర‌చారం కూడా చేయించుకున్నారు.. గ‌తంలో స్వ‌యానా స‌ద‌రు గ‌జ‌ప‌తి రాజావారి భార్యామ‌ణి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని ఇంటికి పిలిచి మ‌రీ ఆతిధ్యం ఇచ్చిన గుర్తు కూడా.. జ‌న‌సేన పార్టీ పూర్తి స్థాయి రాజ‌కీయం మొద‌లు పెట్టాక‌., ఈ మ‌ధ్య‌న ఈయ‌న‌గారు ద్వార‌కా తిరుమ‌ల వెళ్లారు.. రాజా వారికి వ‌య‌సు మీద ప‌డి మ‌తి మ‌రుపు వ‌చ్చిందో..? లేక నేను రాజుని అన్న అహం క‌ళ్ల‌కు క‌ప్పిందో..? తెలియ‌దు గానీ.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశం మీద విలేఖ‌రులు ప్ర‌శ్నిస్తే.. ఏకంగా చేసిన మేలు మ‌ర‌చి., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌దు అని చెప్పేశారు.. చిన‌వెంక‌న్న సాక్షిగా నాలుక మ‌డ‌తేసేశారు..

ఆయ‌న అన్న మాట‌ల‌కి చాలా సంద‌ర్భాల్లో బ‌దులిచ్చిన జ‌న‌సేన అధినేత‌., తాజాగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌రిగిన పోరాట యాత్ర‌లో ఆదే గ‌జ‌ప‌తి రాజావారి కోట ముందు, ఆయ‌న కోట‌కి బీట‌లు వారే శ‌బ్దంతో మ‌రోసారి బ‌దులిచ్చారు.. అయ్యా అశోక గ‌జ‌ప‌తి రాజుగారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటే ఎవ‌రో తెలియ‌ద‌న్నారుగా.. మీ ఊరొచ్చా.. మీ కోట ముందుకొచ్చా.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటే నేనే అంటూ గ‌ర్జించారు.. నేనే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. మై నేమ్ ఈజ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటూ తొడ చ‌రిచినంత ప‌ని చేశారు.. జోరు వాన‌లో ఇక్క‌డ నిల‌బ‌డిన ఈ విజ‌య‌న‌గ‌రం జ‌న‌మంతా నా అన్న‌ద‌మ్ములు, అక్క‌చెల్లెళ్లు.. తెలిసిందా..? అంటూ దిక్కులు పిక్క‌టిల్లేలా సింహ‌నాదం చేశారు..

జ‌న‌సేనుడు విసిరిన ప‌వ‌ర్ పంచ్‌కి జ‌నం జ‌య‌జ‌య‌ధ్వానాలు చేశారు.. అశోక‌గ‌జ‌ప‌తి రాజు కోట ముందు పేలిన మాట‌ల తాటాలు.. త‌ర్వాత సిఎంపైకీ ఎక్కుపెట్టారు.. ముఖ్య‌మంత్రి కూడా అంటున్నారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌భావం ఏముంద‌ని.. 2019లో చూపిద్దాం జ‌న‌సేన ప్ర‌భావం ఏంటో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో..? అంటూ స‌మ‌ర‌శంఖం పూరించారు.. 175 స్థానాల్లో పోటీ చేస్తామ‌న్న ఆయ‌న‌.. నాయ‌కుల్ని కూడా సామాన్యుల నుంచే తీసుకోస్తాన‌న్నారు.. ముఖ్యమంత్రి కూడా అంటున్నారు.. పవన్ కల్యాణ్ ప్రభావం ఏముంది అని. 2019లో చూపిద్దాం జనసేన ప్రభావం ఏమిటో? పవన్ కల్యాణ్ అంటే ఎవరో? 175 స్థానాల్లో పోటీ చేస్తాం. నాయకుల్ని మీలోంచే తీసుకొస్తాను. నాయకులంటే వేల కోట్లు ఆస్తులు అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న‌, అలాంటి వారిని తీసుకోస్తే ప‌ద‌వుల్లోకి వ‌చ్చాక బ్రాందీ షాపులు పెడ‌తారంటూ బొత్సాకి కూడా స్ట్రోక్ ఇచ్చారు.. జ‌న‌సేన సామాన్యుల నుంచే నాయ‌కుల్ని ఎంపిక చేస్తుందని పున‌రుద్ఘాటించారు..

Share This:

11,077 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − sixteen =