Home / జన సేన / అసామాన్యుడే.. అతిసామాన్యుడు.. బ‌స్సు యాత్ర‌లో అతి సామాన్య జీవితం గ‌డ‌ప‌నున్న జ‌న‌సేనుడు..

అసామాన్యుడే.. అతిసామాన్యుడు.. బ‌స్సు యాత్ర‌లో అతి సామాన్య జీవితం గ‌డ‌ప‌నున్న జ‌న‌సేనుడు..

 

ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగి ఉండ‌మ‌న్నారు పెద్ద‌లు.. కానీ అది ఆచ‌ర‌ణ సాధ్య‌మా..? ఇంద్ర భోగాలు.. చ‌ల్ల‌టి ఏసీలు.. విలాస‌వంత‌మైన రాచ‌రికాన్ని వ‌దిలి.. మండే వేస‌విలో అత్యంత సామాన్య జీవితం.. దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి జీవ‌నం సాగించ‌డం సాధ్య‌మా..? జ‌నం క‌ష్టాలు తెలుసుకునేందుకు ప‌ల్లెబాట ప‌ట్ట‌నున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని చూస్తే అదేమీ అసాధ్యం అనిపించ‌దు.. ప‌ట్టాభిషేకానికి ముందు రాజులు ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు దేశాట‌న చేసేవారు.. స‌క‌ల సుఖాలు వ‌దిలి ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఉంటూ వారి క‌ష్టాలు తెలుసుకునే వారు.. దాదాపు రాజ్యంలో ఉన్న ప‌ల్లెలు మొత్తం చుట్టి వ‌చ్చేవారు.. కార‌ణం ప‌ల్లెలే అభివృద్దికి ప‌ట్టుకొమ్మ‌లు అని ఆనాటి నుంచే న‌మ్మేవారు.. ఇప్పుడు జ‌న‌సేనాని కూడా అదే బాట ప‌ట్ట‌నున్నారు..

అందుకోసం స‌క‌ల సుఖాలు త్య‌జించి అతి సామాన్య జీవితం గ‌డిపేందుకు జ‌న‌సేన అధినేత సిద్ధ‌మ‌య్యారు.. ఓ మంచి కార్యం మొద‌లు పెట్టే ముందు దైవ స‌హాయం కోసం తిరుమ‌ల కొండ‌కి వెళ్లి మొక్కులు తీర్చుకున్న జ‌న‌సేనాని, అక్క‌డి నుంచే త‌న‌ను తాను ఓ సామాన్యుడిగా మ‌ల‌చుకున్నారు.. భ‌క్తుల్లో భ‌క్తుడిగా కాలిన‌డ‌క‌న కొండెక్కిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., వివిఐపీ స్టేట‌స్‌ని ప‌క్క‌న పెట్టి సామాన్య భ‌క్తుల‌తో క‌ల‌సి క్యూ లైన్లో వెళ్లి వెంక‌న్న‌ని ద‌ర్శించుకున్నారు.. ఆ త‌ర్వాత తిరుమ‌ల తీర్ధాల్లో కొండ నీళ్లు తాగి తానేంటో చాటారు..

మాములు గానే అతి సామాన్య జీవితం గ‌డిపే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, బ‌స్సు యాత్ర ఏసీ, కుష‌న్ బెడ్లు లాంటి వాటికి దూరంగా దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవితాన్ని గ‌డ‌ప‌నున్నారు.. అందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం, విశాఖ‌లో ఆయ‌న బ‌స‌కు ఏర్పాటు చేసిన అంబేద్క‌ర్ భ‌వ‌న్‌.. బ‌స్సు యాత్ర కోసం తిరుప‌తి నుంచి విశాఖ‌ప‌ట్నం చేరుకోనున్న జ‌న‌సేనాని ఏ స్టార్ హోట‌ల్లో దిగుతారు..? అన్న చ‌ర్చ‌ల‌కి దూరంగా స్థానిక బుల్ల‌య్య కాలేజ్ ద‌గ్గ‌ర‌లోని అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో దిగ‌నున్నారు.. దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వాడే సాధార‌ణ మంచంపై ఆయ‌న శ‌య‌నించ‌నున్నారు.. త‌న ప‌డ‌క గ‌దిలో ఫ్యాన్ మిన‌హా కూల‌ర్ కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం..

ష‌వ‌ర్‌లు సైతం లేని సాధార‌ణ బాత్‌రూములని ఆయ‌న వినియోగించ‌నున్నారు.. ఇంకో విష‌యం ఏంటంటే ఆయ‌న‌తో పాటు ఆయ‌న ప‌రివారం సైతం ఇక్క‌డే బ‌స చేస్తారు.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్, ఆ పార్టీ నాయ‌కుల కోసం అంబేద్క‌ర్ భ‌వ‌న్ సిద్ధం చేస్తున్నార‌న్న వార్త తెలిసిన వారు.. దాన్ని న‌మ్మ‌లేక‌పోతున్నారు.. ఆయ‌నేంటి ఇక్క‌డ ఉండ‌డ‌మేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు.. కానీ ఆయ‌న పేరుకి అసామాన్యుడు అయినా, నిజంగా సామాన్యుల్లో సామాన్యుడే..

యావ‌త్ ఆంధ్ర‌దేశం బ‌స్సు యాత్ర చేప‌ట్ట‌నున్న ఆయ‌న‌, యాత్ర ఆధ్యంతం ఇటువంటి జీవ‌నాన్నే గ‌డ‌ప‌నున్నారు.. రాత్రిళ్లు గ్రామాల్లో ఉండే షెల్ట‌ర్లు, గుడారాల్లో జ‌న‌సేనుడు సేద‌తీర‌నున్నారు.. నిస్వార్ధ రాజ‌కీయాలు చేయాలంటే స‌ర్వసంఘ ప‌రిత్యాగుల్లా స‌ర్వం త్య‌జించాల‌ని చెప్పే జ‌న‌సేన అధినేత‌, అన్నింటినీ త్య‌జించి చూపిస్తున్నారు.. స‌మ‌స్య‌లు ఎక్క‌డుంటే అక్క‌డుంటాన‌నే ఆయ‌న‌, ఇత‌రుల క‌ష్టాలు తీర్చ‌డంలోనే త‌న ఇష్టాలు ఉంటాయ‌ని మ‌రోసారి చెప్ప‌క‌నే చెబుతున్నారు..

Share This:

26,515 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

One comment

  1. He is know about of common man situation status,he can understand the what expect from him.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + ten =