Home / జన సేన / ఆంధ్ర‌జ్యోతీ అంత అత్యుత్సాహ‌మా..? మితిమీరిన వ‌క్రీక‌ర‌ణ‌ల‌పై జ‌న‌సేన ఫైర్‌..

ఆంధ్ర‌జ్యోతీ అంత అత్యుత్సాహ‌మా..? మితిమీరిన వ‌క్రీక‌ర‌ణ‌ల‌పై జ‌న‌సేన ఫైర్‌..

వైష్ణ‌వాల‌యంలో వేకువజాము పూజ‌ల‌కి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది.. తిరుమ‌లలో కూడా వేకువ‌జామున చేసుకునే తొలి ద‌ర్శ‌నానికి ఎంతో ప్ర‌త్యేక‌త ఉంది. అలాగే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా జంగారెడ్డిగూడెం స‌మీపంలోని ఐఎస్ జ‌గ‌న్నాధ‌పురంలోని ప్ర‌ఖ్యాత న‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి వెళ్లారు.. వేకువజామునే స్వామి వారిని ద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.. జ‌న‌సేనాని వేకువ‌జాము ద‌ర్శ‌నంపై ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు.. కార‌ణం తొలి పూజ శ్రేష్టం అనే ఉద్దేశంతో ఉద‌య‌మే పూజ‌ల‌కి వెళ్లారు.. రెండోది తెల్ల‌వారాక అభిమానుల తాకిడి నేప‌ధ్యంలో, ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా జ‌న‌సేనాని ఆల‌యానికి వెళ్ళి పూజ‌లు నిర్వ‌హించారు..

అయితే దైవ‌ద‌ర్శ‌నంలో కూడా బూతులు వెతికే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది ప‌చ్చ ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతి.. ర‌హ‌స్య పూజ‌లు అంటూ సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌చారాలు మొద‌లు పెట్టింది.. ర‌హ‌స్య పూజ‌లు ఎందుకు అంటూ..? అంటూ ప్ర‌జ‌ల్లో లేని పోని అనుమానాలు రేపే ప్ర‌య‌త్నం చేస్తోంది.. ఆంధ్ర‌జ్యోతి తీరుపై జ‌న‌సేన పార్టీ మీడియా హెడ్‌, రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ(ప్యాక్‌) స‌భ్యుడు పి.హ‌రిప్ర‌సాద్ మండిప‌డ్డారు.. వేకువ‌జాము ద‌ర్శ‌నం శుభాన్నిస్తుంద‌నే ఉద్దేశంతో మా అధినేత ఉద‌య‌మే ఆల‌యానికి వెళ్తే., దాన్ని కూడా త‌ప్పుబ‌ట్ట‌డం వెనుక అర్ధం ఏంటో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.. తాంత్రిక పూజ‌లు అంటూ చేస్తున్న ప్ర‌చారాన్ని ఖండించిన హ‌రిప్ర‌సాద్‌., ఎవ‌రికో ల‌బ్ది చేకూర్చ‌డం కోసం ఆంధ్ర‌జ్యోతి ఉద్దేశ‌పూర్వ‌కంగా చెత్త వార్త‌లు ప్ర‌చారం చేస్తోందంటూ దుయ్య‌బ‌ట్టారు..

మీడియా అంటే ప్ర‌తిప‌క్షంగా వ్య‌వ‌హ‌రించాలి.. ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల్ని , ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ఎత్తి చూపాలి.. ప్ర‌జ‌ల‌కి అవ‌స‌ర‌మైన వార్త‌లు ప్ర‌చారం చేయాలి.. జ‌న‌సేన పోరాట యాత్ర‌లో భాగంగా ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వ‌ర‌కు ఎన్నో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి వ‌చ్చాయి.. వాటికి ప‌రిష్కార మార్గాల‌ను కూడా జ‌న‌సేన అధినేత హామీల రూపంలో ఆయా వ‌ర్గాల ముందు ఉంచారు.. జ‌న‌సేనానిని క‌లిసిన ప్ర‌తి వ‌ర్గం ఆయ‌న ఇచ్చిన భ‌రోసాకి సంతృప్తి చెందాయి.. గ‌డ‌చిన వారం రోజుల పోరాట యాత్ర‌లో ఆంధ్ర‌జ్యోతి ఎన్ని వార్త‌ల‌కి త‌న ప‌త్రిక‌లో, ఇంట‌ర్నెట్ ఎడిష‌న్‌లో చోటిచ్చింది..? అంతెందుకు సోమ‌వారం కుక్కునూరు వెళ్లి పోల‌వ‌రం ముంపు ప్రాంతాల్లో జ‌న‌సేన అధినేత ప‌ర్య‌టించి, నిర్వాసితుల క‌ష్టాలు స్వ‌యంగా అడిగి తెలుసుకున్నారు.. దైవ ధ్యానాన్ని వ‌క్రీక‌రించి వార్త‌లు వేసినంత వేగంగా., కుక్కునూరు ప‌ర్య‌ట‌న వార్త ఎందుకు వేయ‌లేక‌పోయారు..? వీట‌న్నింటికీ స‌ద‌రు వార్తా సంస్థ ద‌గ్గ‌ర బ‌దులుందా..? ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌దిలో విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే., కిటికీ బొక్క‌ల్లోంచి తొంగి చూడాల‌న్న త‌త్వం పాత్రికేయ విలువ‌ల్ని నాశ‌నం చేయ‌డం కాదా.. నిత్యం మీ ప‌చ్చ పురాణం పాఠ‌కుల‌కి వెగ‌టు పుట్టిస్తున్నా., మీ రాత‌లు మార్చండి అని ఏ నాడైనా జ‌న‌సేన చెప్పిందా..? జ‌న‌సేన గురించి మంచిని ప్ర‌చారం చేయ‌లేని మీరు., చెడుని ఆపాదించి మ‌రీ ప్ర‌చారం చేస్తుంటే.. ఎందుకు చూస్తూ ఊరుకోవాలి.. మీ ఎందుకు చ‌ర్య‌ల‌కి దిగ‌కూడ‌దు..?

Advertisement.

Advertisement.

Share This:

13,829 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − ten =