Home / ఎడిటోరియల్స్ / ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక పోరులో జ‌న‌సేన ప్ర‌భావం ఎంత‌..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక పోరులో జ‌న‌సేన ప్ర‌భావం ఎంత‌..?

శ్రీకాకుళం జిల్లా:
ఎచ్చెర్ల‌- జ‌నార్ధ‌న్‌(ఉద్దండులైన ప్ర‌త్య‌ర్ధుల‌ను ఓట‌మి రుచి చూపారు. ఈ స్థానం జ‌న‌సేన పార్టీ విజ‌యానికి అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి)
ప‌లాస‌(శ్రీకాకుళం జిల్లాలో జ‌న‌సేన పార్టీ గెలుపుకు అవ‌కాశం ఉన్న రెండో నియోజ‌క‌వ‌ర్గం)
రాజాం,
ఇచ్చాపురం( ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధుల గెలుపుకు 50:50 ఛాన్సెన్ ఉన్నాయి. సైలెంట్ ఓటింగ్ ప్ర‌భావం చూపితే విజ‌యానికి అవ‌కాశాలు ఉన్నాయి)
శ్రీకాకుళం,
పాత‌ప‌ట్నం( ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా జ‌న‌సేన ప్ర‌భావం క‌న‌బ‌డింది)

విజ‌య‌న‌గ‌రం జిల్లా:
నెల్లిమ‌ర్ల‌( జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధి లోకం నాగ‌మాధ‌వి ప్ర‌త్య‌ర్ధుల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు)
ఎన్‌.కోట‌( ఇక్క‌డ జ‌న‌సేన పార్టీకి ఓటింగ్ బ‌లం మిత్ర‌ప‌క్షం అభ్య‌ర్ధిని గెలిపించే అవ‌కాశాలు ఉన్నాయి)
విజ‌య‌న‌గ‌రం( ఇక్క‌డ కూడా జ‌న‌సేన ప్ర‌భావం క‌న‌బ‌డింది. జ‌న‌సేన అభ్య‌ర్ధి పాల‌వ‌ల‌సి య‌శ‌స్వి చివ‌ర్లో సీటు ఖాయం చేసుకున్నా, పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లే క్ర‌మంలో శ‌క్తివంచ‌న లేకుండా క‌ష్ట‌ప‌డ్డారు..)

విశాఖ‌ప‌ట్నం జిల్లా:
గాజువాక‌( ఇక్క‌డ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ మెజారిటీ ఎంత సాధిస్తార‌న్న‌దే పాయింటు.. జ‌న‌సేనానిని నిలువ‌రించేందుకు వైసీపీ అభ్య‌ర్ధి చేయాల్సిన రాక్ష‌స ప్ర‌య‌త్నాలు మొత్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.)
విశాఖ సౌత్‌,
విశాఖ నార్త్‌,
పెందుర్తి,
పాడేరు( ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధులే ముందంజ‌లో ఉన్నారు. ప‌సుపులేటి ఉషాకిర‌ణ్ చేతిలో గంటాకి ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.)

భీమిలి( గ‌ట్టి పోటీ ఇచ్చారు. ట‌ఫ్ ఫైట్ జ‌రిగింది. డ‌బ్బు ప్ర‌భావితం చేయ‌కుంటే యువ అభ్య‌ర్ధి పంచ‌క‌ర్ల సందీప్‌ విజ‌యం ఖాయం)
అన‌కాప‌ల్లి(50:50 ఛాన్సెస్‌.)
చోడ‌వ‌రం( అభ్య‌ర్ధి రాజు గ‌ట్టి పోటీ ఇచ్చారు..)
విశాఖ తూర్పు,
పాయ‌క‌రావుపేట‌,
య‌ల‌మంచిలి( ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన ప్ర‌భావం గ‌ట్టిగా ఉంది)

తూర్పు గోదావ‌రి జిల్లా:
కాకినాడ సిటీ,
కాకినాడ రూర‌ల్‌( రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో పంతం నానాజీ ప్ర‌త్య‌ర్ధికి చుక్క‌లు చూపారు.. దీనికి పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌హిరంగ స‌భ‌తో ప్ర‌జ‌లు డ‌బ్బును తిప్పికొట్టారు..)
పిఠాపురం,( మొద‌ట అభ్య‌ర్ధి నాన్ లోక‌ల్ అన్న వాద‌న తెరమీదికి తెచ్చినా., త‌ర్వాత జ‌న‌సైనికులు మొత్తం క‌లిసి గెలుపుకు బాట‌లు వేశారు..)
తుని,
రాజ‌మండ్రి రూర‌ల్‌,( రాజ‌మండ్రి పార్ల‌మెంట్ ప‌రిధిలో మొద‌టి నుంచి గెలుపు ఖాయం అన్న అంచ‌నాలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గం ఇదే)
పి.గ‌న్న‌వ‌రం
అమ‌లాపురం,
రాజోలు( తూర్పులోని 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధులు విజ‌యం ఖాయమ‌న్న సంకేతాలు ఉన్నాయి. కోన‌సీమ ప్రాంతంలో జ‌న‌సేన‌కు బీఎస్పీ క‌ల‌వ‌డం అగ్నికి ఆయువు తోడ‌యిన‌ట్ట‌య్యింది. )
ముమ్మిడివ‌రం,
మండ‌పేట‌,
పెద్దాపురం,
కొత్త‌పేట‌( నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన ట‌ఫ్ ఫైట్ ఇచ్చింది. విజ‌యానికి 50:50 ఛాన్సెస్ ఉన్నాయి. ముమ్మ‌డివ‌రం, మండ‌పేట‌ల్లో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధుల‌కే ప్ర‌త్య‌ర్ధుల‌తో పోలిస్తే 10 శాతం ఎక్కువ‌గా విజ‌యావ‌కాశాలు ఉన్నాయి..)
* ఓవ‌రాల్‌గా తూర్పు గోదావ‌రి జిల్లాల్లో ప్ర‌త్య‌ర్ధులు ఊహించ‌ని స్థాయి ఫ‌లితాలు రానున్నాయి

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా:

భీమ‌వ‌రం( ప్ర‌త్య‌ర్ధులు ఎన్నిక‌ల కుయుక్తులు ఎన్ని ర‌కాలుగా ప‌న్నాలో అన్ని ర‌కాలుగా ప‌న్నారు. జ‌న‌సేన అధినేత ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నార‌ని ప్ర‌చారం చేశారు. అయితే అది ఆసాధ్యం అని తేలిపోయింది. ఇక్క‌డ కూడా ప‌వ‌న్ మెజార్టీ ఎంత అన్న‌దే గ‌మ‌నార్హం)
న‌ర‌సాపురం,
తాడేప‌ల్లిగూడెం,
పాల‌కొల్లు( మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన జెండా ఎగ‌ర‌డం దాదాపు ఖాయం)

త‌ణుకు,
నిడ‌ద‌వోలు,
ఉండి
చింత‌ల‌పూడి( ఈ నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పార్టీ గ‌ట్టి పోటీ ఇచ్చింది. 50:50 ఛాన్సెస్‌)
ఏలూరు( ఇక్క‌డ కూడా జ‌న‌సేన అభ్య‌ర్ధి ఊహించ‌ని రీతిలో త‌ల‌ప‌డ్డారు)

కృష్ణాజిల్లా:
అవ‌నిగ‌డ్డ‌,( అవ‌నిగ‌డ్డ అభ్య‌ర్ధిత్వం పార్టీ అధికారికంగా ప్ర‌క‌టించ‌క ముందే ముత్తంశెట్టి కృష్ణారావు నాన్‌లోక‌ల్ అన్న ముద్ర చెరిపేసుకున్నారు.. మొద‌టి రోజు నుంచి రోజుకు 20 గంట‌ల చొప్పున క‌ష్ట‌ప‌డ్డారు.. చివ‌ర్లో ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా, వెన‌క్కి త‌గ్గ‌లేదు. విజ‌యం కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి త‌న ప్ర‌య‌త్నం తాను చేశారు. కుటుంబం, స్థానిక కార్య‌క‌ర్త‌ల నుంచి కూడా ఊహించ‌ని స్థాయి మ‌ద్ద‌తు ముత్తంశెట్టికి ల‌భించింది.)
మ‌చిలీప‌ట్నం,
పెడ‌న‌,( అంకెం శ్రీనివాస్ గెలుపు కోసం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు 10 మంది ఎమ్మెల్యే స్థాయి నాయ‌కులు పూర్తి స్థాయిలో ప‌ని చేశారు. నిత్యం ప్ర‌చారం చేశారు.)
విజ‌య‌వాడ వెస్ట్‌( నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన గెలుపు ఖాయం)
విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌( ఇక్క‌డ కూడా మిత్ర‌ప‌క్షం సిపిఎం అభ్య‌ర్ధి బాబు రావు గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి)
విజ‌య‌వాడ ఈస్ట్‌( ఇక్క‌డ కూడా 50:50 ఛాన్సెస్ ఉన్నాయి)
నూజివీడు( ఇక్క‌డ కూడా జ‌న‌సేన ప్ర‌భావం క‌న‌బ‌డింది)

గుంటూరు జిల్లా:
గుంటూరు వెస్ట్‌,
తెనాలి,( పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు ఉన్నా, నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నాదెండ్ల రెండు ర‌కాల బాధ్య‌త‌లు త‌న‌దైన శైలిలో నిర్వ‌ర్తించారు.)
ప‌త్తిపాడు,( ఆది నుంచి విజ‌యం త‌న వైపు తిప్పుకుని రావెల తిరిగారు.)
స‌త్తెన‌ప‌ల్లి( ఇక్క‌డ జ‌న‌సేన అభ్య‌ర్థులే ఆది నుంచి ముందంజ‌లో ఉన్నారు)
గుంటూరు ఈస్ట్‌( మైనారిటీ అభ్య‌ర్ధి అనూహ్యంగా రేస్‌లోకి వ‌చ్చారు)
వేమూరు( ఎస్‌సీతో పాటు సామాజిక స‌మీక‌ర‌ణాలు అనూహ్య ఫ‌లితాన్ని ఆశించ‌వ‌చ్చు)

ప్ర‌కాశం జిల్లా:
మ‌ర్కాపురం,
గిద్ద‌లూరు( రెండు స్థానాల్లో జ‌న‌సేన పార్టీ విజ‌యానికి అవ‌స‌ర‌మైన ఓట్లు ప‌డిన‌ట్టు తెలుస్తోంది. పార్టీ బ‌లం, అభ్య‌ర్ధి బ‌లం, సామాజిక స‌మీక‌ర‌ణాల ప్ర‌భావం ఇక్క‌డ ఉంది)
ఒంగోలు( జ‌న‌సేన అభ్య‌ర్ధి రియాజ్ ఊహించ‌ని స్థాయిలో ఓట్లు సాధించార‌ని తెలుస్తోంది. 50 వేల‌కు పైగా ఓట్లు సాధించిన‌ట్టు తెలుస్తోంది. ఇక్క‌డ అనూహ్య ఫ‌లితాన్ని ఆశించ‌వ‌చ్చు)

నెల్లూరు జిల్లా:
కావ‌లి,
నెల్లూరు రూర‌ల్‌( రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన గ‌ట్టి పోటీ ఇచ్చింది)

చిత్తూరు జిల్లా:
తిరుప‌తి,
పుంగ‌నూరు( రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన గెలుపు దిశ‌గా ప‌య‌నిస్తోంది)
న‌గ‌రి( ఇక్క‌డ మిత్ర ప‌క్షం బీఎస్పీ అభ్య‌ర్ధి రోజాపై విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది)
మ‌ద‌న‌ప‌ల్లి( ఇక్క‌డ కూడా జ‌న‌సేన ప్ర‌భావం క‌న‌బ‌డింది)

క‌డ‌ప జిల్లా:
క‌డ‌ప‌,
రైల్వే కోడూరు( ఈ రెండు నియోజ‌కవ‌ర్గాల్లో జ‌న‌సేన గెలుపుకు అవ‌కాశాలు ఉన్నాయి. క‌డప న‌గ‌రంలో జ‌న‌సేన అభ్య‌ర్ధిని ఎదుర్కొనేందుకు వైసీపీ అభ్య‌ర్ధి డ‌బ్బు కుమ్మ‌రించారు. ధ‌నం ప్ర‌భావం క‌న‌బ‌డ‌కుంటే క‌డ‌ప జిల్లాలో జ‌న‌సేన నుంచి అనూహ్య ఫ‌లితాలు అశించ‌వ‌చ్చు)

క‌ర్నూలు:
ఆధోని,
నంద్యాల‌( జ‌న‌సేన అభ్య‌ర్ధులు గ‌ట్టి పోటీ ఇచ్చారు. ఆధోనిలో మ‌ల్ల‌ప్ప‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌త్య‌ర్ధులు ఓట‌ర్ల‌ను తీవ్రంగా ప్ర‌లోభ ప‌రిచారు)

అనంత‌పురం జిల్లా:
గుంత‌క‌ల్లు
అనంత‌పురం అర్బ‌న్‌( ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన విజ‌యావ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి. గుంత‌క‌ల్లు అభ్య‌ర్ధి మ‌ధుసూద‌న్ గుప్తా, ప్ర‌త్య‌ర్ధుల‌తో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డ్డారు.)
ధ‌ర్మ‌వ‌రం,
రాయ‌దుర్గం( ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌కు 50:50 ఛాన్సెస్ ఉన్నాయి. అభ్య‌ర్ధులు గ‌ట్టిపోటీ ఇచ్చారు.)

పార్ల‌మెంట్‌:
విశాఖ‌ప‌ట్నం,( విశాఖ లోక్‌స‌భ స్థానంలో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఏకప‌క్షంగా ఓట్లు ప‌డ్డాయి. జేడీ రికార్డు స్థాయి మెజారిటీతో పార్ల‌మెంటులో అడుగుపెట్ట‌డం ఖాయం.)
అమ‌లాపురం,( ఇక్క‌డ కూడా డిఎంఆర్ శేఖ‌ర్‌ను ఢీ కొట్టేందుకు ప్ర‌త్య‌ర్ధులు భ‌య‌ప‌డ్డారు.)
న‌ర‌సాపురం,( నాగ‌బాబు పార్టీ అధినేత త‌న సోద‌రుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని కాపాడుకుంటూ గెలుపు కోసం శ‌క్తికి మించి శ్ర‌మించారు.)
నంద్యాల‌,( ఇక్క‌డ ఎస్పీవై రెడ్డికి ఎదురులేద‌నే చెప్పాలి.
మ‌చిలీప‌ట్నం( ఐదు స్థానాల్లో జ‌న‌సేన పార్టీ విజ‌యం దిశ‌గా అడుగులు వేశారు. మొద‌టి మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన అధినేత ప్రభావంతో పాటు అభ్య‌ర్ధుల ప్ర‌భావం కూడా ఉంది. వీరిని ఓడించేందుకు ప్ర‌త్య‌ర్ధులు గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేశారు. మచిలీప‌ట్నంలో అస‌లు ప్ర‌భావం ఉండ‌ద‌నుకున్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అనూహ్యంగా జ‌న‌సేన లోక్‌స‌భ అభ్య‌ర్ధి బండ్రెడ్డి రామ్‌కు క్రాస్ ఓటు పడిన‌ట్టు తెలుస్తోంది.)
అన‌కాపల్లి,
రాజ‌మండ్రి,
గుంటూరు( ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పార్టీ తీవ్ర ప్ర‌భావం చూపింది. ఇక్క‌డ అనూహ్య ఫ‌లితం ఆశించ‌వ‌చ్చు)
విజ‌య‌న‌గ‌రం( ఈ స్థానంలో కూడా ఎంపి ఓటు అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు జ‌న‌సేన వైపు మొగ్గిన‌ట్టు తెలుస్తోంది) ఈ రీసెర్చ్ గాలిలో మేడ‌లు కావు..
రీసెర్చ్‌( శ్యామ్‌కుమార్ లేబాక‌, ఎడిట‌ర్‌, ప‌వ‌న్‌టుడే)

Share This:

2,346 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − 8 =