Home / జన సేన / ప‌వ‌న్ జోక్యంతోనే మాకు న్యాయం- జ‌న‌సేన ప్ర‌తినిధి బృందంతో అక్వా ఫుడ్ పార్క్ బాధితులు

ప‌వ‌న్ జోక్యంతోనే మాకు న్యాయం- జ‌న‌సేన ప్ర‌తినిధి బృందంతో అక్వా ఫుడ్ పార్క్ బాధితులు

img-20161122-wa0015

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం స‌మీపంలో నిర్మిత‌మ‌వుతున్న గోదావ‌రి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో ప‌రిస్థితి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది.. రాఘ‌వ‌య్య‌ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ ప్ర‌తినిధి బృందం వాస్త‌వాలు తెలుసుకునేందుకు ఆయా గ్రామాల్లో ప‌ర్య‌టించ‌గా., ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల్ని ఏక‌ర‌వు పెట్టారు.. ప్రాణాలైనా అర్పిస్తాం గాని., ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పూర్తి కానివ్వ‌మ‌ని బాధిత గ్రామాల ప్ర‌జ‌లు తేల్చి చెబుతున్నారు.. ముఖ్యంగా ఆక్వా ఫుడ్ పార్క్‌కి ఇరు వైపులా ఉన్న తుందుర్రు, కంపాలి బేత‌పూడి, జొన్న‌ల‌గ‌రువు గ్రామాల ప్ర‌జ‌ల్ని సేన బృందం ప‌లుక‌రించిన‌ప్పుడు., తాము ప‌డుతున్న ఇబ్బందుల్ని వారు ఏక‌రువు పెట్టారు.. ప్రాజెక్టు యాజ‌మాన్యం ఎంత ధౌర్జ‌న్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.. వారికి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న రాష్ట్ర ప్ర‌భుత్వం అడ్డుప‌డిన వారిని ఎన్ని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది అనే విష‌యాల‌ను ప‌వ‌న్ బృందానికి వివ‌రించారు..

images

ఈ మూడు గ్రామాల‌కి మ‌ధ్య‌లో 68 ఎక‌రాల్లో ఈ గోదావ‌రి ఫుడ్ పార్క్ నిర్మిత‌మ‌వుతుంది.. అది పూర్త‌యితే ప్రాజెక్టు నుంచి వెలువ‌డే వ్య‌ర్ధాలు త‌మ జీవితాల్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తాయ‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.. వ్య‌ర్ధాల‌ను త‌ర‌లించేందుకు ఇక్క‌డి నుంచి పైప్ లైన్ వేస్తామ‌ని సిఎం చంద్ర‌బాబు చెబుతున్నా., అది స‌ముద్రంలో క‌ల‌పాలంటే దాదాపు 22 కిలోమీట‌ర్ల మేర దాన్ని నిర్మించాలి.. అది సాధ్య‌ప‌డే ప‌ని కాదు.. తీరా పూర్త‌య్యాక అంతా చేతులెత్తేస్తే., మా బ‌తుకులు ఏం కావాల‌ని బాధిత గ్రామాల ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.. 160 కోట్ల‌కు పైగా వ్య‌యం., దీనికి భారీగా కేంద్రం నుంచి స‌బ్సిడీ కూడా ల‌భిస్తుండ‌డంతో., యాజ‌మాన్యం నిర్మాణం ప‌నులు మొద‌లు పెట్టేసింది.. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త ఉన్నా., పోలీసుల సాయంతో ఈ నిర్మాణం ప‌నులు కొన‌సాగుతున్నాయి.. అభివృద్ది అంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా వారికి స‌హ‌క‌రిస్తోంది..

img-20161122-wa0013

ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మిస్తున్న గోదావ‌రి యాజ‌మాన్యానికి తీర ప్రాంతంలో మ‌రో 200 ఎక‌రాల స్థ‌లం ఉంది.. ఫుడ్ పార్క్ అక్క‌డికి త‌ర‌లిస్తే., త‌మ గ్రామాలు కాలుష్యం కోర‌ల్నుంచి ర‌క్షించ‌బ‌డ‌తాయంటున్నారు బాధితులు.. క‌నీసం త‌మ‌తో మాట్లాడ‌టం గాని, ఎలాంటి ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌డంగాని చేయ‌కుండా., యాజ‌మాన్యం, ప్ర‌భుత్వం అత్యంత నిరంకుశ‌త్వంగా, క‌ర్క‌శంగా దీన్ని నిర్మిస్తున్నాయ‌ని ఆరోపించారు..

నిత్యం ఆందోళ‌న‌ల‌తో అట్టుడుకుతున్న తుందుర్రు, బేత‌పూడి, జొన్న‌ల‌గ‌రువుల్లో జ‌న‌సేన‌ బృందం అడుగు పెట్ట‌గానే., అక్క‌డ ప్ర‌జ‌ల ముఖాల్లో ఓ విధ‌మైన ధైర్యం క‌న‌బ‌డింది.. జ‌న‌సేనాని త‌మ‌కు అండ‌గా ఉంటాడ‌న్న న‌మ్మ‌కాన్ని వారు సేన‌ బృందం ఎదుట వెలిబుచ్చారు.. త‌మ స‌మ‌స్య‌లు ప‌వ‌న్ దృష్టికి తీసుకు వెళ్లాకే., కాస్త ప్ర‌శాంతంగా ఉండ‌గ‌లుగుతున్నామ‌ని., ఇంత‌కు ముందు ఎవ‌రి ఇంటికి వారు వెళ్ల‌డానికి కూడా ఆధార్ కార్డులు చూపాల్సి వ‌చ్చేద‌ని ., జ‌న‌సేనాని జోక్యం త‌ర్వాత ప‌రిస్థితులు కాస్త కుదుట ప‌డ్డాయ‌ని తెలిపారు.. బాధిత గ్రామాల ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు విని., అక్క‌డ వాస్త‌వ ప‌రిస్థితులు అధ్య‌య‌నం చేసిన జ‌న‌సేన కోశాధికారి రాఘ‌వ‌య్య‌, మీడియా విభాగం అధిప‌తి హ‌రిప్ర‌సాద్‌, పార్టీ ఉపాధ్య‌క్షులు మ‌హేంద‌ర్‌రెడ్డిల‌తో కూడిన టీమ్‌.. పూర్తి నిజాల‌తో కూడిన నివేదిక‌ను జ‌న‌సేనాని ముందుంచుతామ‌ని హామీ ఇచ్చారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌ల్పించుకుంటే త‌మ స‌మ‌స్య  ప‌రిష్కారం అయిపోతుంద‌న్న న‌మ్మ‌కాన్ని అటు బాధితులు వెలిబుచ్చారు..

Share This:

1,279 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + 5 =