Home / పవన్ టుడే / ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల‌కు జ‌న‌సేన బృందం.. ప్ర‌స్తుత ప‌రిస్థితిపై నివేదిక కోరిన సేనాని..

ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల‌కు జ‌న‌సేన బృందం.. ప్ర‌స్తుత ప‌రిస్థితిపై నివేదిక కోరిన సేనాని..

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో జ‌న‌సేన బృందం మంగ‌ళ‌వారం  ప‌ర్య‌టించ‌నుంది.. అక్క‌డ వాస్త‌విక ప‌రిస్థితుల‌పై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌మ‌గ్ర నివేదిక కోర‌డంతో., తుందుర్రు, ప‌రిస‌ర గ్రామాల్లో రాఘ‌వ‌య్య‌గారి నేతృత్వంలోని ఈ బృందం అధ్య‌య‌నానికి వెళ్ల‌నుంది.. గ‌తంలో ఫుడ్ పార్క్ వ‌ల్ల తాము న‌ష్ట‌పోతున్నామంటూ బాధిత గ్రామాల ప్ర‌జ‌లు జ‌న‌సేనానిని క‌లిశారు.. పలు అంశాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ దృష్టికి తీసుకువ‌చ్చారు.. 30 గ్రామాలు కాలుష్యం కోర‌ల్లో చిక్కుకుంటాయ‌నే అంశంతో పాటు., ప్రాజెక్టుతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతున్న విష‌యాన్ని అయ‌న ముందుంచారు.. బాధితుల స‌మ‌స్య‌ల‌పై సానుకూలంగా స్పందించిన జ‌న‌సేనాని., వారి త‌రుపున ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌లు చేశారు.. ఆ వెంట‌నే జన‌సేనాని ఇచ్చిన సూచ‌న‌ల‌పై సానుకూలంగా స్పందించిన స‌ర్కారు., ప్ర‌జల‌ను ఒప్పించే ప్రాజెక్టు ప‌నులు చేప‌డ‌తామ‌ని హామీ ఇచ్చింది..

జ‌న‌సేనానిని బాధిత గ్రామాల ప్ర‌జ‌లు క‌లిశాక స‌ర్కాను నుంచి సానుకూల స్పంద‌న రావ‌డంతో., ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త‌త‌లు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి.. అయితే ఓ స‌మ‌స్య త‌న వ‌ద్ద‌కు వ‌చ్చాక‌., అది పూర్తిగా ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు పోరాడాల‌న్న‌ది జ‌న‌సేనాని ల‌క్ష్యం.. ఆ ఉద్దేశంతోనే ప్ర‌భుత్వానికి ఓ స‌ల‌హా ఇచ్చాం.., మ‌న ప‌ని అయిపోయింది అన్న‌ట్టు కూర్చోకుండా.., అక్క‌డ తాజా ప‌రిస్థితులు ఏంటి..? ప‌్ర‌భుత్వం నుంచి బాధితుల‌కి ప‌క్కా హామీ వ‌చ్చిందా..? ప్ర‌భుత్వ తీరు ప‌ట్ల ప్ర‌జ‌లు ఏ మేర‌కు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు..? బాధితులు త‌న దృష్టికి తీసుకువ‌చ్చిన స‌మ‌స్య‌లు ఇంకా ఉన్నాయా..? త‌దిత‌ర వాస్త‌విక ప‌రిస్థితుల‌పై అధ్య‌య‌నం చేయాలంటూ పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు.. ప‌వ‌న్ ఆదేశాల మేర‌కు ఈ బృందం తుందుర్రుతో పాటు అక్వా ఫుడ్ ప్రాజెక్ట్ ప్ర‌భావం ఉన్న ప‌లు గ్రామాల్లో మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించ‌నుంది.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మాట్లాడి వారు ఎదుర్కొనున్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌నుంది..

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేన పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభం.. ఇక్క‌డి నుంచే పాల‌నా వ్య‌వ‌హారాలు..

జ‌న‌సేన పార్టీ ప‌రిపాల‌నా కార్యాల‌యం కొత్త భ‌వ‌నానికి మారింది.. హైద‌రాబాద్ మాదాపూర్‌లోని ఓ భ‌వంతిలో నూత‌న కార్యాల‌యం ప్రారంభ‌మైంది.. శుక్ర‌వారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen + twenty =

%d bloggers like this: