Home / జన సేన / ఆడ‌బిడ్డ‌ల కోసం రోడ్డెక్కిన జ‌న‌సేనుడు.. మాన‌వ మృగాల్ని బ‌హిరంగంగా శిక్షించాల‌ని డిమాండ్‌..

ఆడ‌బిడ్డ‌ల కోసం రోడ్డెక్కిన జ‌న‌సేనుడు.. మాన‌వ మృగాల్ని బ‌హిరంగంగా శిక్షించాల‌ని డిమాండ్‌..

జ‌మ్మూకాశ్మీర్‌లోని క‌థువాలో మైన‌ర్ బాలిక‌పై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.. క‌థువా ఘ‌ట‌న‌ని ఖండించిన ఆయ‌న‌, ఆడ‌పిల్ల‌ల కోసం జ‌న‌సేన త‌రుపున పోరాటం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.. మొద‌ట పార్టీ కార్యాల‌యంలో త‌న‌ను క‌ల‌సిన జ‌న‌సేన వీర‌మ‌హిళా విభాగం ప్ర‌తినిధులు, విద్యార్ధుల‌తో మాట్లాడిన జ‌న‌సేనాని, ఎనిమిదేళ్ల బాలిక‌పై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న త‌న‌ను క‌ల‌చివేసింద‌న్నారు.. ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారిపై మాన‌వ మృగాలు చేసిన దాడి త‌న హృద‌యాన్ని ద్ర‌వింప చేసిందంటూ ఆవేధ‌న వ్య‌క్తం చేశారు..

అభం శుభం తెలియ‌ని చిన్నారు, ఏ ఆస‌రా లేని మ‌హిళ‌లు, ఉద్యోగాలు చేసే ఆడ‌బిడ్డ‌ల‌కి ర‌క్ష‌ణ లేని ప‌రిస్థితులు వ‌చ్చాయ‌న్నారు.. ఆడ పిల్ల‌లో జోలికి వ‌స్తే బ‌హిరంగంగా తొలు తీయాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారు. అహింసో ప‌ర‌మో ధ‌ర్మః అనే సూత్రాలు ఇక్క‌డ పాటించాల్సిన అవ‌స‌రం లేద‌న్న జ‌న‌సేనాని, మ‌హిళ‌ల్ని కాపాడుకునేందుకు హింస త‌ప్ప‌ద‌న్నారు.. మ‌న దేశంలో క‌థువా ఘ‌ట‌నే మొద‌టిది కాద‌న్న ఆయ‌న‌, ఏదైనా దారుణం జ‌రిగాక గానీ మ‌న‌లో చ‌ల‌నం రావ‌డం లేదంటూ ఎద్దేవా చేశారు.. ఢిల్లీ అత్యాచార ఘ‌ట‌న త‌ర్వాత నిర్భ‌య చట్టం వ‌చ్చింద‌న్న ఆయ‌న‌, క‌ళ్లు ముందు జ‌రిగితే గానీ ఎంపిలు స్పందించ‌రా అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు..

ఆడ‌పిల్ల‌ల్ని వేధించేవారిని, అత్యాచారాల‌కు ఒడిగ‌ట్టే వారిని బ‌హిరంగంగా శిక్షంచాల‌ని డిమాండ్ చేశారు.. అప్పుడే అంద‌ర్లో భ‌యంపుతుంద‌న్నారు.. సింగ‌పూర్ త‌ర‌హా శిక్ష‌ల అమ‌లుకి డిమాండ్ చేసిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ప‌శువుల‌కి కూడా ప్ర‌కృతి నియ‌మం ఉంటుంద‌ని., మాన‌వ మృగాల‌కు ఎలాంటి నియ‌మం లేకుండా పోయిందంటూ మండిప‌డ్డారు.. ఆడ‌పిల్ల‌ల్ని ర‌క్షించుకోవ‌డం ఎంత క‌ష్ట‌మో ఒక అన్న‌గా, త‌మ్ముడిగా త‌న‌కు తెలుస‌న్న జ‌న‌సేనాని, సినిమా షూటింగుల్లో బ‌య‌టివారు వ‌చ్చి అమ్మాయిల‌ను వేధించిన‌ప్పుడు క‌ర్ర ప‌ట్టుకోవాల్సిన సంద‌ర్బాల‌ను కూడా ఆయ‌న గుర్తు చేసుకున్నారు..

అమ్మాయిల ర‌క్ష‌ణ‌కు క‌ఠిన చ‌ట్టాల అమ‌లుకి డిమాండ్ చేస్తూ మ‌హిళ‌ల‌తో క‌ల‌సి హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్ర‌హం వ‌ద్ద మౌన దీక్ష చేప‌ట్టారు.. వ్య‌వ‌స్థ‌లో మార్పుల కోసం జ‌న‌సేన పోరాటం చేస్తుంద‌న్న ఆయ‌న‌., ఆడ‌బిడ్డ‌ల కోసం పోరాడుతామ‌ని హామీ ఇచ్చిన కొద్ది గంట‌ల్లోనే రోడ్డెక్కారు.. ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి తెచ్చే క్ర‌మంలో త‌న వంతు బాధ్య‌త‌కు పురుడు పోశారు..

Share This:

1,509 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − 10 =