Home / జన సేన / ఆనం వివేకాకు జ‌న‌సేనుడి ఘ‌న నివాళి.. అంతిమ‌యాత్ర‌కు పార్టీ ప్ర‌తినిధి, కార్య‌క‌ర్త‌లు..

ఆనం వివేకాకు జ‌న‌సేనుడి ఘ‌న నివాళి.. అంతిమ‌యాత్ర‌కు పార్టీ ప్ర‌తినిధి, కార్య‌క‌ర్త‌లు..

అనారోగ్యంతో మృతి చెందిన నెల్లూరు జిల్లాకి చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద‌రెడ్డికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నివాళులు అర్పించారు.. పార్టీ కార్యాల‌యం నుంచి విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో ఆనంతో త‌మ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.. త‌మ కుటుంబానికి ఆత్మీయుడైన వివేకానంద‌రెడ్డి మృతి., త‌న‌తో పాటు త‌న కుటుంబానికి తీవ్ర ఆవేద‌న క‌లిగించిన‌ట్టు తెలిపారు.. మూడు సార్లు ఎమ్మెల్యేగా నెల్లూరుకి ఆయ‌న చేసిన సేవ‌ల్ని జ‌న‌సేన అధినేత కొనియాడారు.. వివేకానంద‌రెడ్డి పేద , బ‌డుగు వ‌ర్గాల నేత‌గా ఖ్యాతి పొందార‌ని ప‌వ‌న్‌కళ్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు.. నెల్లూరుతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఆయ‌న చేసిన సేవ‌లు శ్లాఘ‌నీయ‌మ‌న్నారు..

త‌న త‌ల్లిగారి పుట్టినిల్లు కూడా నెల్లూరే కావ‌డంతో ఆనం కుటుంబం ఆమెను త‌మ ఆడ‌ప‌డుచుగా భావించేవార‌ని జ‌న‌సేనాని తెలిపారు.. అంత‌టి ఆత్మీయ అనుబంధం ఉన్న ఆనం కుటుంబానికి చెందిన వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణించ‌డం త‌న‌కు చాలా బాద‌ను క‌లిగించింద‌న్నారు.. ఆనం వివేకానంద‌రెడ్డికి నివాళి అర్పిస్తూ , ఆయ‌న ఆత్మ‌కు ఆ భ‌గ‌వంతుడు శాంతి చేకూర్చాల‌ని ప్రార్ధిస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.. వివేకానంద‌రెడ్డి కుటుంబానికి త‌న త‌రుపున జ‌న‌సేన పార్టీ త‌రుపున ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్నామ‌న్నారు..

ఆనం వివేకా అంతిమ‌న సంస్కార కార్య‌క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ ప్ర‌తినిధిగా, పార్టీ రాజ‌కీయ స‌ల‌హా సంఘం క‌న్విన‌ర్‌, సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త మాదాసు గంగాధ‌రం పాల్గొన‌నున్న‌ట్టు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేర్కొన్నారు.. వివేకానంద‌రెడ్డి అంతిమ‌యాత్ర‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌కు నివాళులు అర్పించ‌నున్న‌ట్టు తెలిపారు..

Share This:

2,558 views

About Syamkumar Lebaka

Check Also

12 అంశాల‌తో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట్‌.. సాహ‌సోపేత నిర్ణ‌యాలే సాధ్య‌మేన‌న్న జ‌న‌సేనుడు..

జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో ఎలా వుండోబోతోంది.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప్ర‌జా సంక్షేమం మేళ‌వింపుగా జ‌న‌సేనుడు చేప‌ట్ట‌నున్న విజ‌న్ ఎలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 − 3 =

%d bloggers like this: