Home / జన సేన / ఆయ‌న‌(జ‌న‌సేనాని) ఆశ ఆశ‌యం మీదే.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీద కాదు..

ఆయ‌న‌(జ‌న‌సేనాని) ఆశ ఆశ‌యం మీదే.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీద కాదు..

ఆశ‌..ఆశ‌యం.. రెండు ప‌దాలు రైలు ప‌ట్టాల లాంటివి.. ఆశ వేరు.. ఆశ‌యం వేరు.. ఆశ‌.. మ‌నిషిని స్వార్ధ‌ప‌రుణ్ణి చేస్తుంది.. ఆశయం స‌మాజ‌హితాన్ని కోరుతుంది.. ఈ రెండు ప‌దాల‌నీ ఓ చోట‌కి చేర్చి స్వారీ చేయాలంటే చేసే ప‌నేదైనా ఖ‌చ్చితంగా నిక్క‌చ్చిగా ఉండాలి.. చేత‌ల్లో నిబ‌ద్ధ‌త ఉండాలి.. సాటి మ‌నిషి క‌ష్టం చూసి., మ‌న క‌ళ్ల‌లో నీళ్లు తిరిగితే అది మాన‌వ‌త్వం.. నిబ‌ద్ద‌త‌-మాన‌వ‌త్వం ఈ రెండు ప‌దాలు ఒక్క చోట చేరితే.. అది మ‌హాత్మ ల‌క్ష‌ణం.. ఇలాంటి ల‌క్ష‌ణాల్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుణికిపుచ్చుకున్నాడు.. ఆయ‌న మాట‌ల్లో ఒక్క‌సారి దెబ్బ తిన్న త‌ర్వాత రాజ‌కీయాల్లోకి రావాలి అంటే గుండె ధైర్యం వుండాలి.. ఆ ధైర్యం ఏ స్థాయిలో వుండాలంటే అన్యాయాన్ని ఎదిరించాలి.. దోపిడిని తిప్పికొట్టాలి.. అస‌మాన‌త‌ల్ని స‌మాజం చివ‌రి అంచుల వ‌ర‌కు త‌రిమి కొట్టాలి.. దీంతో పాటు పీడిత వ‌ర్గాల‌కి న్యాయం చేయాల‌న్న బ‌ల‌మైన ఆకాంక్ష‌తో ముందుకి క‌ద‌లాలి.. ఇవ‌న్నీ జ‌న‌సేన చేసి చూపెడుతోంది.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ల‌క్ష్యంగా రాజ‌కీయాల్లోకి వ‌స్తే., ఆ రాజ‌కీయం వేరుగా వుంటుంది.. వెనుక‌బ‌డిన వ‌ర్గాల కోసం నిల‌బ‌డాలంటే మాత్రం ఎలాంటి ఆకాంక్ష‌లు లేకుండా రాజ‌కీయాలు చేయాలి.. తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి వ‌రుస‌గా రెండో రోజు చేరిక‌ల సంద‌ర్బంగా జ‌న‌సేనుడి మాట‌లు ఇవి.. ఇంత‌టి లోతైన ఆలోచ‌నా విధానంతో జ‌న‌సేన ముంద‌డుగు వేస్తోంది..

కులం పునాదుల్ని పెకిలించ‌డ‌మే ల‌క్ష్యం..
లండ‌న్‌లో ఎవ‌రో అవార్డు ఇస్తామంటే వెళ్లిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., విశ్వ‌విజ్ఞాన మందిరాన్ని సంద‌ర్శించారు.. అదే అంబేద్క‌ర్ స్మార‌క భ‌వ‌నాన్ని.. వేల పుస్త‌కాల్ని చ‌దివేసిన ఆయ‌న్ని జ‌న‌సేనాని చ‌దివేశారు.. అందుకే బాబా సాహెబ్ స్ఫూర్తిని తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు.. కులం పునాదుల మీద ఓ జాతిని, కానీ నీతిని కానీ నిర్మించ‌లేమ‌న్న అంబేద్క‌ర్ మాట‌ల్ని అర్ధం చేసుకున్నాన‌ని ఆయ‌న చెప్ప‌డం కాదు., జ‌న‌సేన సిద్ధాంతం.. అదే కులాల ఐక్య‌తారాగం చెబుతోంవ‌ది.. పార్టీ కార్యాల‌యంలో తూర్పు గోదావ‌రి జిల్లా కో క‌న్విన‌ర్ శెట్టిప‌ల్లి రాజుబాబు., వివిధ వ‌ర్గాల వారిని పార్టీలో చేర్చేందుకు తీసుకు వ‌చ్చిన సంద‌ర్బంలో., ప‌వ‌న్ నోట ఈ ప్ర‌స్థావ‌న వ‌చ్చింది.. బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌ల్ని రాజ‌కీయ పార్టీలు ఓ ఓటు బ్యాంకుగా మాత్ర‌మే వాడుకుంటున్నాయ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్త ప‌రిచిన జ‌న‌సేనాని., నాయ‌కుడికి దేనీ మీద ఆశ వుండ‌రాద‌న్నారు..

బ‌ల‌మైన నాయ‌క‌త్వంతోనే స‌మ‌స్య‌ల సాధ‌న‌..
రాజ‌మండ్రి మాజీ ఎంపి గిరిజాల వెంక‌ట‌స్వామినాయుడు, ద‌ళిత నాయ‌కులు పాకా శ్రీనివాస‌రావుతో పాటు వైసీపీ మాజీ చిన్న‌.. త‌దిత‌రులు హైద‌రాబాద్ జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో., పార్టీ అధినేత స‌మ‌క్షంలో జెండా భుజాన పెట్టుకున్నారు.. పార్టీ తీర్ధం పుచ్చుకున్న నాయ‌కుల‌ని ఉద్దేశించి మాట్లాడిన జ‌న‌సేనాని., బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోతే ఆశ‌యాల్ని ముందుకి తీసుకువెళ్ల‌లేమ‌న్నారు.. అన్యాయం, వెనుక‌బాటుల గురించి మాట్లాడేందుకు ఎవ్వ‌రూ ఉండ‌ర‌న్నారు.. ఇంత మంది బ‌లమైన వ్య‌క్తులు వ‌స్తే మిన‌హా తాను స‌మ‌స్య‌లకి ప‌రిష్కారాలు వెత‌క‌లేన‌న్నారు.. ఉద్య‌మాల ద్వారా కోన్నింటికీ, రాజ‌కీయ పోరాటాల ద్వారా మ‌రికొన్నింటికీ ప‌రిష్కారం దొర‌కొచ్చ‌న్న జ‌న‌సేనాని., అందుకే తాను సాధ్య‌మైనంత వ‌ర‌కు స‌యోధ్యాపూర్వ‌కంగానే మెలుగుతాన‌ని స్ప‌ష్టం చేశారు.. ఉద్దానం నుంచి తుమ్మ‌పాల షుగ‌ర్ ఫ్యాక్ట‌రీ వ‌ర‌కు జ‌న‌సేన ప‌రిష్క‌రించిన స‌మ‌స్య‌ల్ని ప్ర‌స్థావించిన ఆయ‌న‌.,దేని మీద ఆశ వున్నాఇంత చేయ‌గ‌లిగేవాణ్ణి కాదేమోన‌ని తేల్చారు.. ముఖ్య‌మంత్రి అయినా., కాక‌పోయినా ఏ సిద్ధాంతం కోసం పార్టీ పెట్టానో., ఆ సిద్ధాంతం కోసం తుది శ్వాస వ‌ర‌కు పోరాడుతూనే ఉంటాన‌ని తెలిపారు..

Advertisement.

Share This:

1,813 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + sixteen =