Home / జన సేన / ఆయ‌న చెప్తే అయిపోద్ది ఇది జ‌నం న‌మ్మ‌కం.. ఏ స‌మ‌స్య‌యినా ఆయ‌న దృష్టికి వ‌స్తే తీరిపోద్ది.. ఇది జ‌న‌సేనుడి స‌త్తా..

ఆయ‌న చెప్తే అయిపోద్ది ఇది జ‌నం న‌మ్మ‌కం.. ఏ స‌మ‌స్య‌యినా ఆయ‌న దృష్టికి వ‌స్తే తీరిపోద్ది.. ఇది జ‌న‌సేనుడి స‌త్తా..

తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇప్పుడో ట్రెండ్ న‌డుస్తోంది.. అదేంటంటే ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా., దాని ప‌రిష్కారం జ‌న‌సేన గ్యారేజ్‌లో దొరుకుతుంద‌న్న న‌మ్మ‌కం.. పాల‌కుల వ‌ద్ద‌కి వెళ్లినా., స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌లేని ప్ర‌తిప‌క్షం ద‌గ్గ‌రికి వెళ్లినా ఉప‌యోగం ఉండ‌ద‌న్న న‌మ్మ‌కానికి వ‌చ్చేశారు జ‌నం.. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల్లో ఈ న‌మ్మ‌కం గ‌ట్టిగా పాతుకుపోయింది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న నోటివెంట ఓ స‌మ‌స్య‌ను అడ్ర‌స్ చేశారంటే..; ప‌రిష్క‌రించ‌మంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారంటే.., అది ఎంత జ‌ఠిల‌మైన‌దైనా.., ఎన్నేళ్లుగా వేళ్లూనుకున్న‌దైనా.., ప‌లాయ‌నం చిత్త‌గించాల్సిందే.. ప్ర‌జ‌ల్లో ఎలాంటి ప‌రిస్థితి క‌న‌బ‌డుతోందంటే., ప‌వ‌న‌న్నా నువ్వు చెబితే అయిపోద్ది.. అది సిఎం కైనా., పిఎం కైనా.. ఒక్క‌సారి నువ్వు చెబితే చాలు అన్నంత న‌మ్మ‌కం ఏర్ప‌డిపోయింది..

ఇటీవ‌ల ఛ‌లోరే ఛ‌లోరే ఛ‌ల్ యాత్ర‌లో భాగంగా అనంత‌పురం జిల్లా ప‌ర్య‌ట‌న‌కి జ‌న‌సేన అధినేత వెళ్లిన‌ప్పుడు., ఆయ‌న‌కి సెక్యూరిటీ ఇచ్చేందుకు వ‌చ్చిన ఓ హోంగార్డు., ప‌వ‌న్‌కళ్యాణ్‌తో త‌మ స‌మ‌స్య‌లు ఎక‌రువు పెట్టాడు.. అదీ మీడియా ముఖంగా.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారూ., నేను మీకు ఎలాంటి విన‌తిప‌త్రం ఇవ్వ‌ను.. కేవ‌లం నోటి ద్వారా మాత్ర‌మే విజ్ఞ‌ప్తి చేస్తున్నా.. ఇదే మా విజ్ఞాప‌న ప‌త్రంగా స్వీక‌రించి మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి.. ప‌క్క‌రాష్ట్రంలో జీతాలు పెంచారు.. ఇక్క‌డ మాత్రం మా శ్ర‌మ‌ని దోచుకుంటున్నారు.. మీరు గ‌ట్టిగా అనుకుంటే మా స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోతుంది.. అంటూ మొర‌పెట్టుకున్నాడు.. ఇక కొద్ది రోజుల క్రితం హోంగార్డుల అసోసియేష‌న్ త‌రుపున కూడా ఓ విన‌తిప‌త్రం జ‌న‌సేన గ్యారేజ్‌(పార్టీ కార్యాల‌యం)కి చేరింది..

వ‌రాలిచ్చే దేవుడి చెంత‌కి అర్జీ ఇలా వెళ్లిందో లేదో., వారి స‌మ‌స్యకి ప‌రిష్కారం అలా వ‌చ్చేసింది.. శాస‌న‌స‌భ సాక్షిగా ఏపీ హోంమంత్రి హోంగార్డుల జీతాలు పెంచ‌నున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు.. ఏంటి.. ఏదైనా స‌మ‌స్య ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి వెళ్లీ వెళ్ల‌గానే ఇట్టే ప‌రిష్కారం అయిపోతుంది.. ఆయ‌న చేతుల్లో ఏమైనా మంత్ర‌దండం ఉందా..? అవును ఆయ‌న చేతుల్లో ఓ పెద్ద మంత్ర‌దండం ఉంది.. అదే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల నిబ‌ద్ద‌త అనే మంత్ర‌దండం.. ఏ స‌మ‌స్య త‌న దృష్టికి వ‌చ్చినా దాని ప‌రిష్కార మూలాలు క‌నుగొన‌డంలో నిజాయితీతో ప‌నిచేసే మంత్ర‌దండం ఉంది.. ఆ మంత్ర‌దండానికి చేత‌న‌వ్వ‌ని., చేయ‌లేని ప‌ని అంటూ ఉండ‌దు మ‌రి..

జ‌న‌సేన గ్యారేజ్‌లో మ‌రో స‌మ‌స్య‌కి ప‌రిష్కార‌మార్గం ల‌భించగా., ఇప్పుడు దాన్ని గ్రాబ్ చేసుకునేందుకు ప్ర‌త్య‌ర్ధి కోట‌రీలు వ్యూహాల‌కి ప‌ద‌నుపెట్టాయి.. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఎవ‌డో పాతిన‌చెట్టుకి త‌మ బోర్డు త‌గిలించుకునే బ్యాచ్‌లు ఎక్కువైపోయాయి మ‌రి.. అయితే చూసే జ‌నానికి తెలుయ‌దా దాని య‌జ‌మాని ఎవ‌ర‌న్న విష‌యం..

Share This:

7,502 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 − one =