Home / ఎడిటోరియల్స్ / ఆయ‌న ప‌రిధి ఓ గ్రామం కాదు.. ఓ రాష్ట్రం..

ఆయ‌న ప‌రిధి ఓ గ్రామం కాదు.. ఓ రాష్ట్రం..

ఆయ‌న ప‌రిధి అనంతం.. ఆయ‌న ఆలోచ‌నా శ‌క్తి విసృతం.. అది ఏ ఒక్క‌రినో బాగుచేయ‌డంతో ఆగేది కాదు.. ప్ర‌తి ఒక్క‌రినీ బాగుచేయాల‌న్నది ఆయ‌న ల‌క్ష్యం.. ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని.. స‌మ‌స్య‌లు తీరిస్తే.. ఆయ‌న దాహం ఆగ‌దు.. ఓ రాష్ట్రాన్ని ద‌త్త‌త తీసుకుని ఉద్ద‌రించాల‌న్న‌దే టార్గెట్‌.. త‌న‌ను అభిమానించే, ఆరాధించే ప్ర‌తి ఒక్క‌ర్నీ ప‌లుక‌రించాలి.. వారి స‌మ‌స్య‌లు వినాలి.. అన‌ను వ్య‌తిరేకించే వారు స‌మ‌స్య‌ల్లో ఉన్నా., వాటిని తీర్చాలి.. ఒక్క‌రి క‌డుపు మంట చ‌ల్లారిస్తే.. ఆనందం రాదు.. ఇలాంటి క‌డుపు మంట ఇంకెంద‌రికి ఉంది.. వారి ఆక‌లి తీర్చ‌డం ఎలా అన్న ఆలోచ‌న‌లోనే ఆయ‌న‌కు ఆనందం ఉంది.. ఈ మొత్తం ఉపోద్ఘాతం ఒక్క‌రి గురించే ఆయ‌నే జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అనంత వేదిక‌గా జ‌రిగిన స‌భ‌లో జ‌న‌సేనాని ప్ర‌సంగంలో ఆయ‌న అంత‌రాత్మ‌దాగి ఉంది.. స‌భ‌కు అనంతే ఎందుకు అన్న అంశం వ‌చ్చిన‌ప్పుడు ప‌వ‌న్ చెప్పారు.. సీమ‌లో ఎన్ని జిల్లాలు ఉన్నా., అనంతలో ఉన్న‌న్ని స‌మ‌స్య‌లు ఎక్క‌డా లేవ‌ని.. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో త‌న‌కు ఆనందం ఉంద‌ని., స‌మ‌స్య‌ల‌తో పోరాడ‌టంలో త‌న‌కు ఆనందం ఉందంటూ ఆయ‌న చెప్పిన మాట‌., జిల్లాకు చెందిన ప్ర‌తి ఒక్క‌రి చెవిలో అలా మారుమ్రోగుతూనే ఉంది…

ఇక అనంత రెండో రోజు ప‌ర్య‌ట‌న‌లో మ‌రోసారి ఆయ‌న ఉద్దేశం ప్ర‌స్ఫుట‌మైంది.. గేట్స్‌లో విద్యార్ధులు జిల్లాలో ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటారా అంటూ ప్ర‌శ్నించగా.. త‌న మ‌న‌సులో మాట‌ని బ‌య‌ట‌పెట్టారు.. ఓ గ్రామం.. ఓ జిల్లా కాదు యావ‌త్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మొత్తాన్ని ద‌త్త‌త తీసుకోవాల‌ని ఉంద‌న్న ఆయ‌న‌., పాద‌యాత్ర చేయాల‌న్న త‌న కోరిక‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.. రాష్ట్రంలో ప్ర‌తి గ్రామానికీ వెళ్లాలి.., ప్ర‌తి ఒక్క‌రినీ ప‌లుక‌రించాలి.. త‌న‌ను ఇష్ట‌ప‌డే వారిని, వ్య‌తిరేకించే వారిని.. అభిమానించే వారిని., అక్కున చేర్చుకునే వారిని అంద‌రినీ క‌ల‌వాలి.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవాలి.. ఎన్నిక‌ల్లో గెలిస్తేనే కాదు.. ఓడినా.. ఆ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార‌మార్గం చూప‌డంలోనే త‌న ఆనందం ఉంద‌ని తెలిపారు.. అనంత‌లో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో జ‌న‌సేనాని రాజ‌కీయాల్లోకి ఎందుకు వ‌చ్చారు.. ఏం చేస్తారు..? ఎలా ముందుకు వెళ్తారు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా స‌మాధానాలు ఇచ్చేశారు..

ప్ర‌క్షాళ‌న‌.. ఈ రాజ‌కీయ వ్య‌వ‌స్థ ప్ర‌క్షాళ‌నే ఆయ‌న ల‌క్ష్యం.. అవినీతి ర‌హిత స‌మాజ స్థాపనే టార్గెట్‌.. అంద‌రికీ న్యాయం జ‌ర‌గాలంటే అవినీతిని కూక‌టివేళ్ల‌తో పెక‌లించాలి.. అది జ‌ర‌గాలంటే ఆ మార్పు త‌న నుంచి ప్రారంభం కావాలి.. ఓ నాయ‌కుడి నుంచి మొద‌లు కావాలి.. అప్పుడే స్వ‌తంత్ర ఫ‌లాలు అంద‌రికీ అందుతాయి.. అప్పుడే క‌డుపు మంట‌లు., ఆక‌లి కేక‌లు స‌మాజం నుంచి వెలివేయ‌బ‌డ‌తాయి.. అదే జ‌న‌సేనాని ల‌క్ష్యం.. గెలిచినా.. ఓడినా.. ఎవ‌రు ఇష్ట‌ప‌డినా.. ఇష్ట‌ప‌డ‌కున్నా.. స‌మ‌స్య‌ల‌పై పోరాటం.. అదే ఆయ‌న ఆరాటం.. ఆ ఉన్న‌త ల‌క్ష్యాన్ని నేర‌వేర్చే క్ర‌మంలో మ‌న‌మంతా సైనికులుగా మార‌దాం.. సేనానికి మ‌ద్ద‌తిద్దాం..

Share This:

1,398 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × three =