Home / జన సేన / ఆసిఫాకు జ‌న‌సైన్యం కొవ్వొత్తుల నివాళి.. క‌థువా బాధితురాలికి న్యాయం కోసం శాంతిపోరు..

ఆసిఫాకు జ‌న‌సైన్యం కొవ్వొత్తుల నివాళి.. క‌థువా బాధితురాలికి న్యాయం కోసం శాంతిపోరు..

ఆడ బిడ్డ‌ల ర‌క్ష‌ణ కోసం, వారిని కాపాడే చ‌ట్టాల కోసం జ‌న‌సేన పోరాటం చేస్తుంది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఈ మాట చెప్పిన కొద్ది సేప‌టికే రోడ్డెక్కి ఉద్య‌మం మొద‌లు పెట్టారు.. క‌థువా ఘోరం క‌ళ్ల ముందు క‌దులుతుండ‌గా, ద్ర‌వించిన హృద‌యంతో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్ర‌హం ఎదుట నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు.. నింధితుల్ని బ‌హిరంగంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.. ఇలాంటి సంద‌ర్బాల్లో అహంస కంటే హింసే ఎక్కువ మేలు చేస్తుంద‌న్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.. మాన‌వ మృగాల చేతిలో చిదిమేయ‌బ‌డ్డ‌ ఆసిఫా భానుకి అండ‌గా నిల‌బ‌డాల‌ని యావ‌త్ భార‌త జాతికి పిలుపునిచ్చారు..

జ‌న‌సేన అధినేత పిలుపుతో క‌దిలిన జ‌న‌సైనికులు ఆదివారం ఆసిఫాకు ఘ‌నంగా నివాళులు అర్పించారు .. రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీల‌తో ఆసిఫాకు నివాళులు అర్పించారు.. క‌థువా బాధితురాలికి న్యాయం చేయాలనీ, దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు..హైద‌రాబాద్‌లో జ‌న‌సేన వీర మ‌హిళ‌లు రేప్ క‌ల్చ‌ర్‌ని అంత‌మొందించాలంటూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించ‌గా., రాష్ట్ర వ్యాప్తంగా కూడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఆసిఫా ఫోటోతో కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌లు, శాంతి ర్యాలీలు చేశారు..

ఎక్క‌డో జ‌మ్మూ కాశ్మీర్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న అయినా.. ఓ ఆడిబిడ్డ‌కి జ‌రిగిన అన్యాయం.. ఓ మ‌నిషిగా ప్ర‌తి ఒక్క‌రూ దీన్ని ప్ర‌తిఘ‌టించాలి.. ఢిల్లీలో నిర్భ‌య ఘ‌ట‌న చోటు చేసుకున్న నాడు యావ‌త్ భార‌త జాతి ఒక్క తాటిపైకి వ‌చ్చి ఎలా అయితే బాధితురాలికి అండ‌గా నిలిచారో., ఈ క్రూర మృగాల‌ను బ‌హిరంగంగా శిక్షించే వ‌ర‌కు అదే స్ఫూర్తితో ఉద్య‌మించాల‌న్న‌ది జ‌న‌సేన అధినేత అభిప్రాయం.. ఒంట‌రి మ‌హిళ‌ల‌పై టీజింగ్‌, అత్యాచారాల‌కు పాల్ప‌డే వారికి సింగ‌పూర్ త‌ర‌హా శిక్ష‌లు అమ‌లు చేస్తే గానీ, అలాంటి నేరాలు చేయాలంటే భ‌యం పుడుతుంది.. ఏదో సంఘ‌ట‌న జ‌రిగాక హ‌డావిడిగా నష్ట నివార‌ణా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం అల‌వాటుగా మారిపోయింది.. పాల‌కుల ఈ అల‌వాటుని మార్చే వ‌ర‌కు జ‌న‌సేన మ‌హిళ‌ల త‌రుపున పోరాటం చేస్తుంది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన మాట ఇది.. మాట మేర‌కు తొలి రోజు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, రెండో రోజు ఆయ‌న సైన్యం రోడ్డెక్కి క‌థువా బాధితురాలికి న్యాయం చేయాలంటూ శాంతియుత నిర‌స‌న‌లు చేప‌ట్టారు.. ఈ ఉద్య‌మాన్ని తారా స్థాయికి తీసుకువెళ్లేందుకు కూడా జ‌న‌సేన పార్టీ సిద్ధ‌మ‌వుతోంది..

ఓ చ‌ట్టం కావాలి.. అది నింధితుల్ని నిర్భ‌యుల్ని చేస్తున్న నిర్భ‌య చ‌ట్టం కంటే మించింది అయి ఉండాలి.. కామాంధుల‌కి కామం పేరు గుర్తుకొస్తేనే వెన్నులో వ‌ణుకు పుట్టాలి.. అదే జ‌న‌సేన అధినేత కోరిక‌..

Share This:

1,042 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three + three =