Home / జన సేన / ఆ జ‌న‌సేన అభ్య‌ర్ధి గెలిస్తే.. పుంగ‌నూరు ప్ర‌గ‌తి ప‌థ‌మే..

ఆ జ‌న‌సేన అభ్య‌ర్ధి గెలిస్తే.. పుంగ‌నూరు ప్ర‌గ‌తి ప‌థ‌మే..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీసుకురాబోతున్న మార్పు ఏ స్థాయిలో ఉంటుందంటే.., ఆ పార్టీ అభ్య‌ర్ధులు గెలుపు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్దికి మ‌లుపు కావ‌డం ఖాయమ‌ని రాజ‌కీయ విమ‌ర్శకుల నుంచి సైతం ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.. అందుకు కార‌ణాలు లేక‌పోలేదు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద చ‌ట్ట స‌భ‌ల్లో పోరాటం చేసేందుకు జ‌న‌సేన పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యే అభ్య‌ర్ధులుగా బ‌రిలోకి దిగిన ప‌లువురు., గెలుపు-ఓట‌మి అనే అంశాలు ప‌క్క‌న‌పెట్టి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల అమ‌లు మీద దృష్టి సారించ‌డం గ‌మ‌నార్హం.. మేం గెలిస్తే బోర్లు వేయిస్తాం.. నీరు ఇస్తాం.. రోడ్లు వేయిస్తాం అన్న హామీలు ఇప్ప‌టికే సొంత ఖ‌ర్చుల‌తో కొంద‌రు నెర‌వేర్చేస్తున్నారు.. వీరంతా ఒక ర‌కం అయితే., జ‌న‌సేన అభ్య‌ర్ధుల్లో మ‌రో ర‌కం కూడా ఉన్నారు..

గెలిచినా గెల‌వ‌కున్నా., తాము పోటీ చేసిన నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి ప‌థంలో దూసుకుపోవాలి..ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కూడ‌దు.. అందుకోసం బాట‌లు వేయాలి.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌కు ముందు ప్ర‌చారంలో బిజీ బిజీగా ఉన్న జ‌న‌సేన అభ్య‌ర్ధులు., పోలింగ్ ముగిసిన మ‌రుస‌టి క్ష‌ణం నుంచి త‌మ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారం.. అభివృద్ధి అనే అంశాల మీద సీరియ‌స్‌గా దృష్టి సారించారు.. ప్ర‌త్య‌ర్ధుల విమ‌ర్శ‌ల‌ను గాని, గెలుపు-ఓట‌మి అనే భ‌యాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.. ఈ కోవ‌లో ముందున్న వ్య‌క్తి పుంగ‌నూరు నుంచి జ‌న‌సేన అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగిన రామ‌చంద్ర‌యాద‌వ్‌.. రాజ‌కీయాల‌కు కొత్తే అయినా., ఉద్దండులైన ప్ర‌త్య‌ర్ధుల‌కు చుక్క‌లు చూపించారు యాద‌వ్‌.. అంతేకాదు పోలింగ్ ముగిసిన వెంట‌నే రైల్వే బోర్డు చైర్మ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి త‌మ నియోజ‌క‌వ‌ర్గం మీదుగా రైల్వే లైన్‌కు ప్ర‌తిపాధ‌న చేశారు..

తాజాగా పారిశ్రామిక ప్ర‌గ‌తి అనే అంశం మీద దృష్టి సారించిన రామ‌చంద్ర‌యాద‌వ్‌., దేశంలో టాప్ బ్రాండ్‌గా ఉన్న ప‌తంజిలి యూనిట్ కోసం త‌న వంతు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.. ప‌తంజిలి అధినేత రాందేవ్ బాబును క‌లిసి పుంగ‌నూరులో ప‌రిశ్ర‌మ ఏర్పాటుకు ఉన్న అనుకూల‌త‌ల‌ను వివ‌రించారు.. పుంగనూరు చింతపండు ప్రాముఖ్యతను గురించి వివరించారు.. పతంజలి ఆయుర్వేద పరిశ్రమ నెలకొల్పడానికి తగిన అనుకులతలను రాందేవ్‌కు వివ‌రించారు.. పుంగనూరులో టమోటా ఎగుమతులు మరియు ఇక్కడి అనుకూల వాతావరణ పరిస్థితులను వివరించారు.. చుట్టు పక్కల రాష్ట్రాలకు అతి తక్కువ దూరంలో ఉన్న పుంగనూరుకు గల వ్యాపార అనుకూలతలను క్షుణ్ణంగా వివరించారు.. ఇక్కడ పరిశ్రమను ఏర్పాటు చేయడం వేలమంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని, రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని, రైతు కుటుంబాలు భాగుపడ‌తాయన్న‌ది రామ‌చంద్ర‌యాద‌వ్ అభిప్రాయం..

సుమారు ఏడు ద‌శాబ్దాల భార‌త దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపిల‌లో ఎంత మంది త‌మ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి గురించి ఈ స్థాయిలో ఆలోచించి ఉంటారు.. జ‌న‌సేన పార్టీ ఓ ఖ‌చ్చిత‌మైన మార్పు తీసుకువ‌చ్చి తీరుతుంది అన‌డానికి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏముంటుంది..

Share This:

1,272 views

About Syamkumar Lebaka

Check Also

ధర్మవరంలో జనసైనికులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి-పవన్ డిమాండ్

తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా ఓ సాంఘీక నాటక ప్రదర్శనలో జనసేన పార్టీ జెండాలు ప్రదర్శించినందుకు దుర్గి ఎస్సై గ్రామస్తుల మీద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 6 =