Home / జన సేన / ఇంట‌ర్ విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లపై అఖిల‌ప‌క్షం నిర‌న‌స దీక్ష‌కు జ‌న‌సేన మ‌ద్ద‌తు..

ఇంట‌ర్ విద్యార్ధుల ఆత్మ‌హ‌త్య‌లపై అఖిల‌ప‌క్షం నిర‌న‌స దీక్ష‌కు జ‌న‌సేన మ‌ద్ద‌తు..

తెలంగాణ‌లో ఇంట‌ర్ బోర్డు నిర్ల‌క్ష్యం, ప్ర‌భుత్వ అల‌స‌త్వం కార‌ణంగా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన ఇంట‌ర్ విద్యార్ధుల‌కు న్యాయం చేసేందుకు జ‌న‌సేన పార్టీ విడ‌త‌ల వారీగా పోరాటం చేస్తూ వ‌స్తోంది.. ఇప్ప‌టికే పార్టీ అకౌంట్ నుంచి ఉచిత రీ వాల్యూష‌న్‌కు అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ట్టుబ‌ట్ట‌గా., గ‌త నెల 28వ తేదీ నాంప‌ల్లిలో జ‌న‌సేన శ్రేణులు చేప‌ట్టిన నిర‌స‌న‌ల‌పై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.. 29వ తేదీ అఖిల‌ప‌క్షంతో క‌ల‌సి ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్ట‌గా., జ‌న‌సైనికుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే విద్యార్ధుల‌కు న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేయాల‌న్న ప‌వ‌న్ సూచ‌న‌తో., నిర‌స‌న‌లు కొన‌సాగించేందుకు పార్టీ తెలంగాణ విభాగం నిర్ణ‌యించింది.. అందులో భాగంగా11వ తేదీ ఉద‌యం ఇందిరా పార్క్‌లోని ధ‌ర్నా చౌక్ వ‌ద్ద చేప‌ట్ట‌నున్న అఖిల‌ప‌క్షం నిర‌స‌న దీక్ష‌ల‌కు జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తు తెలుపుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. విద్యార్ధుల హ‌క్క‌లు కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఈ నిర‌స‌న దీక్ష‌లో పాల్గొనాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.. తెలంగాణ వ్యాపితంగా జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బిజీగా ఉన్న జ‌న‌సేన శ్రేణులు, వ్య‌క్తిగ‌త ల‌బ్ది కంటే., ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాట‌మే ముద్దు అంటున్నాయి.. ఇందిరా పార్క్ నిర‌స‌న దీక్ష‌కు పెద్ద సంఖ్య‌లో హాజ‌రై త‌మ స‌త్తా చాటాల‌ని భావిస్తున్నాయి.. ఈ మేర‌కు ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాల్లో జ‌న‌సైనికులు స్వ‌చ్చందంగా క‌ద‌లి రావాలంటూ ప‌ర‌స్ప‌రం పిలుపు ఇచ్చుకుంటున్నారు.. ఇంట‌ర్ విద్యార్ధుల ఉసురు తీసిన అంశం ఇప్ప‌టికే కేసీఆర్ స‌ర్కారుకు త‌ల‌బొప్పిక‌ట్టించిన విష‌యం విధిత‌మే..

Share This:

340 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × one =