Home / జన సేన / ఇచ్చాపురం నుంచి జ‌న‌సేన పోరాట‌యాత్ర‌.. క‌వాతులు, రోడ్ షోలు, నిర‌స‌న‌ల స‌మాహారం..

ఇచ్చాపురం నుంచి జ‌న‌సేన పోరాట‌యాత్ర‌.. క‌వాతులు, రోడ్ షోలు, నిర‌స‌న‌ల స‌మాహారం..

ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకోవాలంటే ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలి.. సామాన్యుల స‌మ‌స్య‌లు తెలుసుకోవాలంటే సామ‌న్య జీవితాన్నే గ‌డ‌పాలి.. జ‌నం స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం, ప్ర‌త్యేక హోదా, పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చ‌న హామీల సాధ‌న కోసం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎంచుకున్న మార్గం ఇదే.. మాటలు చెప్ప‌డం తేలికే, చేత‌ల్లో చూప‌డ‌మే క‌ష్టం.. నేను రైతు బిడ్డ‌నే అని చెప్పుకునే నాయ‌కులు., ఫోటోల‌కి ఫోజులివ్వ‌డానికి మిన‌హా పంట చేలో దిగిన దాఖ‌లాలు కాన‌రావు.. కానీ జ‌న‌సేనాని మాత్రం ఇలాంటి నీతిమాలిన రాజ‌కీయాల‌కి చాలా దూరం.. విఐపీ కోటాలో దైవ ద‌ర్శ‌నానికి అవ‌కాశం ఉన్నా., దేవుడి ముందు అంతా సమాన‌మేన‌ని గ్ర‌హించిన ప‌వ‌న్‌., సాధార‌ణ క్యూ లైన్‌లో సామాన్యుల్లో సామాన్యుడిగా శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లారు.. ఇంద్ర‌లోకాన్ని త‌ల‌పించే స్టార్ హోట‌ళ్లు,ఏసీలు, కూల‌ర్లు, హంస‌తూలికా త‌ల్పాల‌ని ప‌క్క‌న‌పెట్టి., అతి సామాన్యుడి జీవితానికి త‌నంత‌ట తాను స్వాగ‌తం ప‌లికారు.. కాసేపు ఫోటోల‌కి ఫోజులిచ్చి వెంట‌నే ఏపీ కారుల్లో దూరితే, సామాన్యుడెలా అవుతాడు అన్న‌దే జ‌న‌సేనుడి పాయింటు.. త‌న‌తో న‌డిచేందుకు సిద్ధ‌మైన వారు కూడా., వారు ఎంత‌వారైనా అంద‌ర్నీ సామాన్యులుగా మార్చేశారు..

ఇక ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు, ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ముహుర్తం కూడా ఖ‌రారు చేసేశారు.. అత్యంత వెనుక‌బ‌డిన జిల్లాగా పేరున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 20 తేదీన త‌న పోరాట యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు.. ఇది కేవ‌లం బ‌స్సు యాత్ర మాత్ర‌మే కాదు.. ప‌ల్లె ప‌ల్లెకీ, ఇంటి ఇంటికీ వెళ్ల‌డం వారి కాష్టాలు తెలుసుకోవ‌డం, ప్ర‌జ‌ల త‌రుపున మాట్లాడాల్సిన ప‌రిస్థితులు ఉన్న చోట మాట్లాడ‌డం.. అవ‌స‌ర‌మ‌నుకుంటే న‌డ‌క‌., ప్ర‌భుత్వాల‌కి పోరాట స్ఫూర్తితో హెచ్చ‌రిక‌లు చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు భారీ క‌వాతులు.. ఇలా జ‌న‌సేన యాత్ర సాగ‌నుంది.. అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ యాత్ర ఎలా వుండ‌బోతోందో వివ‌రించారు..

పోరాటం ముఖ్య ఉద్ద‌శం పొలిటిక‌ల్ అకౌంట‌బులిజీ, జ‌వాబుదారీ త‌నాన్ని పాలిక‌ల‌కు గుర్తు చేయ‌డ‌మే.. విభ‌జ‌న హామీలు అమ‌లు నెర‌వేర్చ‌క‌పోవ‌డం, పార్ల‌మెంటు సాక్షిగా ఇచ్చిన మాట‌ను ప‌క్క‌న‌పెట్ట‌డం.. రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం., స్థానిక స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మాల పుట్టిన‌ల్లు స‌క్కోలు నుంచే పోరాటం ప్రారంభించ‌నున్న‌ట్టు జ‌న‌సేనుడు స్ప‌ష్టం చేశారు.. 2019 ఎన్నిక‌లు ల‌క్ష్యంగా ప‌ని చేయ‌నున్న‌ట్టు తెలిపిన ఆయ‌న‌., జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే జైఆంధ్రా ఉద్య‌మ‌లో అమ‌రులైన 350 మంది, ప్ర‌త్యేక హోదా పోరులో అమ‌రులైన వారి స్మార‌క చిహ్నాలు ప్ర‌తి జిల్లాలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు..

ప్ర‌త్యేక హోదా నినాదంతో 175నియోజ‌క వ‌ర్గాల్లో నిర‌స‌న‌లు , జిల్లా కేంద్రాల్లో ల‌క్ష మందితో క‌వాతులు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు.. జ‌న‌సేన పార్టీ నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంద‌ని, స‌మ‌స్య‌ను గుర్తించ‌డం., ప‌రిష్క‌రించ‌డ‌మే కాదు ., ఎలా ప‌రిష్క‌రిస్తే భాగుంటుంది అనే అంశంపై కూడా దృష్టి సారిస్తుంద‌ని ప‌వ‌న్ తెలిపారు..ప్ర‌జ‌ల వ‌ద్ద‌కి వెళ్ల‌డం, వారి మ‌ధ్య‌నే నివ‌సించ‌డం, వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం, ప్ర‌త్యేక హోదా ఉద్య‌మంతో పాటు జ‌న‌సేన పార్టీ రానున్న రోజుల్లో చేప‌ట్టే పాద‌యాత్ర‌లు రాష్ట్రంలోనొ ప్ర‌తి ఒక్క‌రికీ ఉప‌యోగం ఉంటాయ‌ని తెలిపారు.. క్షేత్ర‌స్థాయి నుంచి స‌మ‌స్య‌ల్ని అధ్య‌య‌నం చేప‌డుతోంది..

Share This:

2,462 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − fifteen =