Home / సేన సేవ / ఇదేరా నిజ‌మ‌యిన‌ ప‌వ‌నిజం.. స‌ర్వ‌దా స్ఫూర్తి ప్ర‌ధాయ‌కం..

ఇదేరా నిజ‌మ‌యిన‌ ప‌వ‌నిజం.. స‌ర్వ‌దా స్ఫూర్తి ప్ర‌ధాయ‌కం..

img-20161230-wa0001 img-20161230-wa0006

ఏ దిక్కులు లేని వాళ్ల‌కు ఆ దేవుడే దిక్కు అన్న‌ది ఒక‌ప్ప‌టిమాట‌.. ఏ దిక్కులేని వాళ్ల‌కు జ‌న‌సేనాని., ఆయన‌ సైన్యం దిక్కు అన్న‌ది నేటి మాట‌.. మ‌న ప్ర‌భుత్వాలు పాల‌కుల‌కు ఆమ్ ఆద్మీ అన్న ప‌దం కేవ‌లం ఓట్లు వేయించుకునేప్పుడు మిన‌హా క‌న‌బ‌డ‌దు., వారి నోటి వెంట విన‌బ‌డ‌దు.. క‌నీసం కూడూ, గూడూ లేనివారంటే క‌నిరం కూడా ఉండ‌దు.. వారిని ఆదుకోవాల‌న్న ఆలోచ‌న అస‌లే ఉండ‌దు.. అయితే చేతిలో ఎలాంటి అధికారం లేక‌పోయినా., ప్ర‌తి ఒక్క‌డి స‌మ‌స్య తీర్చాల‌న్న త‌ప‌న జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఉంది.. అదే ప‌వ‌నిజంగా మారి., ఆయ‌న సైన్యానికి స్ఫూర్తినిచ్చింది.. ఎక్క‌డ ఎవ‌రు బాధ‌లో ఉన్నా మ‌న కన్ను చ‌మ‌ర్చాలి.. ఎదుటివాడు ప‌డే క‌ష్టాన్ని మ‌నం అనుభ‌విస్తే అని ఫీల‌వ్వాలి.. వారి క‌ష్టాన్ని తొల‌గించే ప్ర‌య‌త్నం చేయాలి.. ఓ జ‌న‌సైనికుడు అదే చేశాడు..

img-20161230-wa0005 img-20161230-wa0012

ఓ అర్ధ‌రాత్రి వేళ ఏదో ఊరు వెళ్లి వ‌స్తున్న స‌మ‌యంలో రాజ‌ధాని న‌గ‌రం బెజ‌వాడ‌లో ఫుట్ పాత్ల మీద‌, రోడ్ల ప‌క్క‌న చెట్ల కింద చ‌లిలో వ‌ణుకుతూ ప‌డుకున్న నిర్భాగ్యులు అత‌ని కంట‌ప‌డ్డారు.. పొట్ట‌కూటి కోసం ప‌గ‌లంతా రోడ్ల వెంట అడుక్కోవ‌డ‌మో., రిక్షాలు లాగుతూ క‌ష్ట‌ప‌డ‌ట‌మో చేసే వీరు., రాత్రిళ్లు చ‌లి పులి దాడికి గుర‌వుతూ ఉండ‌డాన్ని చూసి త‌ట్టుకోలేక పోయాడు.. ఇంటికి వెళ్లాక కూడా నిద్ర ప‌ట్ట‌లేద‌త‌నికి.. కార‌ణం అత‌ను ప‌వ‌న్ అభిమాని, ప‌వ‌నిజ‌మే స్వాస‌గా బ‌తికే ఓ జ‌న‌సైనికుడు.. వారి క‌ష్టాన్ని తీర్చేందుకు ఏదో ఒక‌టి చేయాల‌నుకున్నాడు.. త‌న‌కు ఉన్న ఓపిక‌లో ఓ 200 దుప్ప‌ట్లు కొన్నాడు.. మ‌రునాడు అదే అర్ధ‌రాత్రి స‌మ‌యంలో త‌న బృందంతో క‌ల‌సి రోడ్డెక్కాడు.. రోడ్లు, ఫుట్‌పాత్లే ఆవాసంగా, శీతాకాల‌పు చ‌లికి బ‌ల‌వుతున్న వారిని గుర్తించి త‌న వంతుగా వారికి దుప్పుట్లు పంచాడు మండ‌లి రాజేష్‌.. త‌న‌కు న‌చ్చిన‌., తాను ఎంచుకున్న ప‌వ‌నిజం ఇదే అని చాటి., న‌లుగురికీ స్ఫూర్తిగా నిలిచాడు..

img-20161230-wa0003 img-20161230-wa0013

జ‌న‌సైనికులు అంతా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాల‌నే ఉద్దేశంతో మండ‌లి రాజేష్ ప‌వ‌న్‌టుడేకి త‌న సేవ‌కు సంబంధించిన ఫొటోలు పంస‌డంతో పాటు త‌న తోటి జ‌న‌సైనికుల‌కి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానుల‌కి., త‌న వైపు నుంచి ఓ విజ్ఞాప‌న చేస్తున్నాడు.. త‌న‌కు ఉన్న ఓపిక‌లో తాను 200 దుప్ప‌ట్లు ఇలా ఫుట్ పాత్ల‌పై చ‌లికి బ‌ల‌వుతున్న వారికి పంచాన‌ని., ఇలాంటి చ‌లిగాలుల‌కి ఎందో మంది అభాగ్యులు ప్రాణాలు సైతం కోల్పోతుండ‌టం త‌న‌ను క‌ల‌చివేసింద‌ని అంటున్నాడు.. ప్ర‌భుత్వాల‌కు, పాల‌కుల‌కు వీరి ప‌ట్ల బాధ్య‌త లేకున్నా., జ‌న‌సైనికులుగా మ‌న‌మంతా వీరి బాధ్య‌త తీసుకుందామంటూ రాజేష్ పిలుపునిస్తున్నారు.. శివ‌రాత్రి వ‌ర‌కు ఏపీలో ఈ చ‌లిగాలుల తీవ్ర‌త ఉంటుంద‌ని., జ‌న‌సైనికులంతా ఎవ‌రి ఓపిక మేర‌కు వారు క‌నీసం ఓ దుప్ప‌టి అయినా కొని., రోడ్ల ప‌క్క నివ‌సించే ఓ నిరుపేద‌కు సాయం చేయాల‌ని కోరుతున్నారు.. అంతా ముందుకి వ‌చ్చి త‌లో చేయి వేస్తే., జ‌న‌సేనాని ల‌క్ష్యం నెర‌వేరిన‌ట్టేన‌ని రాజేష్ భావిస్తున్నారు.. ప‌వ‌న్‌టుడే కూడా ఈ వార్త ప్ర‌చురించ‌డానికి కార‌ణం ల‌క్ష‌లాదిగా ఉన్న జ‌న‌సైనికుల్లో స్ఫూర్తి నింపాలనే.. ఈ మంచి ప‌నికి ముందుకి వ‌చ్చేవారంతా త‌మ ఫోటోలు మా వాట్స‌ప్‌కి పంపండి., సేవా కార్య‌క్ర‌మాల విష‌యంలో జ‌న‌సైనికుల స‌త్తా ఏంటో మేం ప్ర‌పంచానికి చాటుతాం..

Share This:

1,403 views

About Syamkumar Lebaka

Check Also

విజ‌యం వ‌రిస్తుందో.? లేదో.? తెలియ‌దు.. ప‌ని మాత్రం మొద‌లెట్టేశాడు.. ద‌టీజ్‌ జ‌న‌సేన‌..

సామాజిక మాధ్య‌మాల్లో మూడు లైన్ల పోస్టు ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.. తిరిగి అధికారంలోకి రాక‌పోతే టీడీపీ అధినేత చంద్ర‌బాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − twelve =