Home / పోరు బాట / ఈ చీక‌ట్లు ఈ ఏటితో వీడాలి.. వ‌చ్చే దీపావ‌ళికి హోదా వెలుగులు నిండాలి- జ‌న‌సేనాని ఆకాంక్ష‌.

ఈ చీక‌ట్లు ఈ ఏటితో వీడాలి.. వ‌చ్చే దీపావ‌ళికి హోదా వెలుగులు నిండాలి- జ‌న‌సేనాని ఆకాంక్ష‌.

ggstills10-jan6

చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్ర‌తీక‌గా జ‌రుపుకునే వెలుగుల పండుగ దీపావ‌ళి.. అప్ప‌ట్లో న‌ర‌కాసుర సంహారంతో శ్రీకృష్ణుడు ప్ర‌జ‌ల బ‌తుకుల్లో వెలుగులు నింపింది చ‌రిత్ర‌.. అయితే వ‌ర్త‌మానంలో కూడా అసురులు లేక‌పోయానా., అలాంటి వారి చేతిలో చిక్కి జ‌నం నానా వెత‌లు ప‌డుతున్నారు.. ప్ర‌జ‌ల్ని ఎన్నిర‌కాల క‌ష్టాలకు గురిచేయోచ్చో వారికి తెలిసినంత‌గా., ఆ అసురుల‌కి కూడా తెలియ‌దు.. వ్య‌వ‌హారం అంతా చెప్పేది ఒక‌టి చేసేది మ‌రొక‌టిగా ఉంటుంది.. వారి గురించి పేరు, పేరు విడ‌మ‌ర్చి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. ప్ర‌తి చోటా ప్ర‌జాసంక్షేమ‌మ‌న్న మాటే చెబుతారు., కానీ జ‌నాన్ని క్షామంలోకి నెట్టేస్తారు..

ఇప్పుడు గ‌త పాల‌కులు తెలుగు రాష్ట్రాన్ని అడ్డంగా విడ‌గొట్టేశారు.. విభ‌జ‌న స‌మ‌యంలో పోనీ స‌మ‌న్యాయం పాటించారా అంటే., ఒక‌రికి మూడొంతుల వాటా., మ‌రొక‌రికి ఒక వంతు ఇచ్చారు.. అదేంట‌ని అడిగితే ఆ న‌ష్టాన్ని తామే పూడుస్తామ‌న్నారు. అందుకోసం రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే దాన్ని చ‌ట్టం చేయ‌డం మ‌రిచారు..

అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేటి పాల‌కులు., ఐదేళ్లకు మ‌రో ఐదేళ్లు క‌లిపి మొత్తం ఏపీకి ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని అదే చ‌ట్ట స‌భ‌లో బ‌ల్ల‌లు గుద్ది మ‌రీ పోరాడారు.. ఎలా జ‌రిగిందో., ఏం జ‌రిగిందో ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉన్న అధికార‌, విప‌క్షాల‌తో స‌హా అంతా స‌ల‌హాలు, సూచ‌న‌లు అన్నారు త‌లాడించారు..

విభ‌జ‌న తంతు పూర్త‌య్యి మూడేళ్లు కావ‌స్తోంది.. కానీ హోదా ఎక్క‌డ అంటే పైన చెప్పిన ఎవ‌రి వ‌ద్దా స‌మాధానం లేదు.. సిఎం గారు ప్ర‌తి మీటింగ్‌లో డ‌బ్బుల్లేవు అయినా అభివృద్ధి చేసేస్తున్నాం అంటారు. కేంద్ర ఇప్ప‌టికే భారీగా డ‌బ్బు ఇచ్చాం అంటుంది.. ఇక్క‌డ అభివృద్ది, అక్క‌డ డ‌బ్బు రెండూ జ‌నానికి నేత‌ల మాట‌ల్లో మాత్ర‌మే విన‌బ‌డ‌తాయి. పైకి మాత్రం అడ్డ‌దిడ్డంగా విడ‌గొట్టిన వారు, దానికి ఓకే అన్న‌వారు, బిల్లు కాపీల‌పై సంత‌కాలు పెట్టిన వారు, అంతా రాష్ట్రానికి తమ పార్టీయే న్యాయం చేసేసిందంటూ మైకులు విర‌గ్గొట్టి మ‌రీ చెప్పేసుకుంటున్నారు.. జ‌నం మాత్రం వీరు చెప్పేది అర్దం కాక‌., ఎవ‌రేం చేశార‌బ్బా అన్న క్వ‌శ్చన్ మార్క్ ముఖాలేసుకుని చూస్తున్నారు..

ఆ క‌న్వ్ఫూష‌న్ నుంచి జ‌నాన్ని బ‌య‌టికి తీసేందుకు రంగంలోకి దిగారు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌జ‌ల త‌రుపున నిల‌బ‌డి ప్ర‌త్యేక హోదా ఎక్క‌డ అంటూ పాల‌కుల్ని ప్ర‌శ్నిస్తున్నారు.. క‌హానీలు మాని కార్య‌క్ర‌మం చూడ‌మంటూ నడిరోడ్డుపై నిల‌దీస్తున్నారు.. దీపావ‌ళి రోజున ఆంధ్రుల హ‌క్కు ప్ర‌త్యేక హోదా ఆకాంక్ష సిద్ధించాల‌ని ఆయ‌న కోరారు.. ఈ చీక‌టిని పార‌ద్రోలేందుకే తాను ఉన్నానని ప‌వ‌ర్‌స్టార్ అంటున్నారు.. ప్ర‌త్యేక హోదా కోసం మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేస్తాన‌ని., వ‌చ్చే దీపావ‌ళి నాటికి ప్ర‌జ‌ల జీవితాల్లో హోదా వెలుగులు నింప‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని జ‌న‌సేనాని ఉద్ఘాటించారు.. ఈ పోరాటంలో త‌ల‌ప‌డేందుకు త‌న సైన్యం సైతం రెఢీగా ఉంద‌ని తెలిపారు.. మ‌రి మ‌న హ‌క్క‌యిన హోదా సాధ‌న పోరులో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అండ‌గా ఉండేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా..? ఉంటే మీ సత్తా ఏంటో అనంతపురం వేదిక‌గా జ‌రిగే సీమాంధ్ర హ‌క్కుల చైత‌న్య స‌భ‌లో చాటండి..

Share This:

1,461 views

About Syamkumar Lebaka

Check Also

పార్టీలుగా పోటీప‌డ‌దాం.. ప్ర‌జాస‌మ‌స్య‌ల విష‌యంలో ఒక్క‌ట‌వుదాం-జ‌న‌సేన‌

జ‌న‌సేన పార్టీ పుట్టుక ల‌క్ష్యం ఏంటి అనే విష‌యం ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం చేసిన ప్ర‌తి సారీ బ‌హిర్గ‌త‌మ‌వుతూనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − six =