Home / జన సేన / ఈ చీప్‌ట్రిక్ వైఛీపీదా..? టీడీపీదా..? లేదా ఇద్ద‌రూ క‌ల‌సి ప‌న్నిన వ్యూహ‌మా..?

ఈ చీప్‌ట్రిక్ వైఛీపీదా..? టీడీపీదా..? లేదా ఇద్ద‌రూ క‌ల‌సి ప‌న్నిన వ్యూహ‌మా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన ప్ర‌భంజ‌నం రోజు రోజుకీ కొత్త అంచ‌నాల దిశ‌గా దూసుకుపోతోంది.. జ‌న‌సేన పోరాట యాత్ర‌కి అంచ‌నాల‌కి మించి స్పంద‌న ల‌భిస్తోంది.. ముఖ్యంగా అన్ని వ‌ర్గాలు ప్ర‌జ‌లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆశ‌యాల‌కి ఆక‌ర్షితుల‌వుతున్నారు.. ముఖ్యంగా నాగ‌రిక ప్ర‌పంచానికి దూరంగా ఉండే గిరిజ‌నానికి సైతం జ‌న‌సేనానిపై అపార‌మైన న‌మ్మ‌కం క‌న‌బ‌డుతోంది. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న ద‌గ్గ‌రికి వెళ్తే న్యాయం జ‌రుగుతుంద‌న్న భావ‌న అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డుతోంది. ఒక్కో వ‌ర్గం జ‌న‌సేన వైపు మొగ్గుతుంటే., ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌కి వెన్నులో వ‌ణుకు మొద‌లవ‌డం., జ‌న‌సేన ప్రాభ‌వాన్ని తగ్గించేందుకు కుయుక్తులు ప‌న్న‌డం మొద‌లైపోయింది.. ఎలాగైనా జ‌న‌సేన పార్టీకి జ‌న‌బ‌లం లేద‌ని ప్ర‌జ‌ల్ని న‌మ్మించాలి.. అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ రెండు పార్టీల ల‌క్ష్య‌మూ ఇదే.. కొన్ని నెల‌ల క్రితం ఆస్థాన సంస్థ ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతితో మ‌ళ్లీ బాబే వ‌స్తారంటూ స‌ర్వే రాయించుకుని జ‌నంతో న‌వ్వించుకున్నారు.. న‌వ్విపోదురుగాక నాకేంటి అన్న చందంగా., నెల రోజుల గ్యాప్‌తో మ‌రో స‌ర్వే డిజైన్డ్ బై బూతు కిట్టు.. ఆ త‌ర్వాత జ‌నాన్ని న‌మ్మించ‌డానికి ల‌గ‌డ‌పాటిని కూడా వాడేశారు.. త‌ర్వాత వంతు వైసీపీదీ.. వీరు ఏకంగా జాతీయ మీడియాతో అంకెల గార‌డీ చేయించారు.. ఇద్ద‌రి స‌ర్వేల ల‌క్ష్యం ఒక్క‌టే జ‌న‌సేన‌కి బ‌లం లేద‌ని జ‌నాన్ని న‌మ్మించ‌డం.. ఎక్క‌డ చేశారో తెలియ‌ని స‌ర్వేలు చూసి జ‌నం ఒక‌రి ముఖం ఒక‌రు చూసుకునే ప‌రిస్థితి..

ఆ ప్లాన్ కాస్తా అట్ట‌ర్ ఫ్లాప్ అవ‌డంతో.. ఇప్పుడు రెండు పార్టీలు క‌ల‌సి జ‌న‌సేన పార్టీ అడ్డంకి తొల‌గించుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాయి. జ‌న‌సేన పార్టీకి బ‌లం ఉన్న సామాజిక మాద్య‌మాల్లో, ఆ పార్టీపై బుర‌ద చ‌ల్ల‌డం.. దాన్ని విప‌రీతంగా స‌ర్క్యులేట్ చేయ‌డ‌మే ఇరు పార్టీల మ‌ధ్య ఉన్న ఆ తెర వెనుక ఒప్పందం.. ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు గెల‌వాలి.. మూడో శ‌క్తిని ఎంత‌కు తెగించైనా అడ్డుకోవాల‌న్న‌దే ఆ ఒప్పందం ల‌క్ష్యం.. మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ-జ‌న‌సేన ఒక్క‌టే అన్న ప్ర‌చారం చేసిన ప్ర‌త్య‌ర్ధులు.. ఇప్పుడు వైసీపీ నుంచి వ‌చ్చిన క‌బురుగా ఓ త‌ప్పుడు వార్త‌ని ప్ర‌చారం చేస్తున్నారు.. ఈ త‌ప్పుడు వార్త ప్ర‌ధాన ల‌క్ష్యం జ‌న‌సేన క‌వాతు.. జ‌న‌సేనాని తూర్పుగోదావ‌రి జిల్లాలో అడుగుపెట్ట‌బోయే సంద‌ర్బంలో ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల‌ను ముంచెత్త‌నున్న జ‌న‌ప్ర‌ళ‌యాన్ని ముందుగానే అంచ‌నా వేసిన వైసీపీ-టీడీపీ ఈ ఛీప్ ట్రిక్‌కి ప్రాణం పోశాయి.. ఆ వార్త‌లో బ‌లిప‌శువు.. కాకినాడ పార్ల‌మెంటు స‌భ్యులు తోట న‌ర్సింహం.. కాపు నేత‌లు.. ఆ బూతు వార్త వైసీపీ-జ‌న‌సేన మ‌ధ్య పొత్తు.. ఇంత‌కంటే హాస్యాస్ప‌ద‌మైన అంశం మ‌రొక‌టి ఉండ‌ద‌న్న‌ది జ‌నం అభిప్రాయం..

పైగా జ‌న‌సేన ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తిపాధ‌న వెళ్ల‌డం.. దాన్ని జ‌గ‌న్ తిర‌స్క‌రించ‌డం.. మ‌ళ్లీ ప్ర‌తిపాధ‌న పంప‌డం.. ఒప్పుకోవాల‌ని కాపు నేత‌లు జ‌గ‌న్‌పై ఒత్తిడి తేవ‌డం.. ఈ ప్ర‌పంచంలో మొండి వాడికంటే బ‌ల‌వంతుడు ఉండ‌డు.. అలా పోల్చుకుంటే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌గ‌మొండి. నీతి, నిజాయితీల‌కి నిలువెత్తురూపం.. ఆయ‌న‌కి పూర్తిగా వ్య‌తిరేక దృవం..నిలువెల్లా అవినీతి మ‌ర‌క‌లు అంటించుకున్న జ‌గన్‌.. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక సాధ్యమా..? అదీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వైపు నుంచి ప్ర‌తిపాధ‌న వెళ్ల‌డం సాధ్య‌మా..? పైగా వైసీపీకి టీడీపీ ఎంపితో ప్ర‌తిపాధ‌న పంప‌డం.. ఇలాంటి వార్త‌లు త‌యారు చేసేప్పుడు కొంచం బుర్ర‌లు వాడండ్రా బాబులు.. ఏ బొత్స‌నో, అంబ‌టి రాంబాబో ప్రతిపాధ‌న చేశారంటే మీరు చేసే విష‌ప్ర‌చారాన్ని జ‌నం ఎంతొకొంత న‌మ్మేవారు.. అభూత క‌ల్ప‌న చేసేప్పుడు కూడా., కాస్తో.. కూస్తో దార్శ‌నీక‌త ఏడ‌వాలి..

ఇక్క‌డ ప్లాన్ వైసీపీదా, టీడీపీదా.. లేక ఇద్ద‌రూ క‌ల‌సి వేసిందా.. అన్న‌ది తెలియ‌దు గానీ.. జ‌గ‌న్ నోటి దూల‌తో దూర‌మైపోయిన కాపులు ఇంకా త‌న‌తోనే ఉన్నార‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు క‌న‌బ‌డుతోంది.. పైగా ఇరు పార్టీల‌ని గెల‌వ‌నివ్వ‌నిని స‌వాల్ చేస్తున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., మాట త‌ప్పే మ‌నిషి కాద‌న్న న‌మ్మ‌కం జ‌నంలో ఉంది.. అలాంటిది తెలుగు దేశం పార్టీ నేత‌ల‌తో వైసీపీతో బ్రోక‌రేజ్ చేయిస్తున్నార‌న్న వార్త ఎంత నిజం అన్న‌ది ఆ జ‌నానికి బాగా తెలుసు.. పైగా ఇద్ద‌రు వేసిన స‌ర్వేల్లో 5 శాతం ఓట్లు కూడా రాని జ‌న‌సేన‌తో అస‌లు పొత్తు ఎందుకు.. అన్ని స్థానాలు ఆఫ‌ర్ చేయ‌డం ఎందుకు.. జ‌న‌సేన బ‌రిలోకి దిగిన‌ప్పుడే క‌దా..? ఎవ‌రి బ‌లం ఏంటో తెలిసేది.. అన్న‌ది జ‌న‌సైన్యం వాద‌న‌.. పైగా వైసీపీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం.. ఇంపార్టెంట్ అంటూ ప్ర‌చారం ఒక‌టి.. నిజంగా తెర వెనుక ఏదో జ‌రుగుతుంద‌న్న అనుమానాన్ని తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం.. దీంతో పాటు ఈ నెల 15న జ‌ర‌గ‌నున్న క‌వాతుకి సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సైన్యాన్ని గంద‌ర‌గోళానికి గురి చేసే ప్ర‌య‌త్నం కూడా.. రెండు ల‌క్ష‌ల మందికి పైగా జ‌న‌సైనికులు స్వ‌చ్చందంగా క‌వాతుకి క‌ద‌లిరానున్న‌ట్టు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన స‌మాచారం.. పాల‌క‌ప‌క్షాన్ని కంగారు పెట్టిందో., ప్ర‌తిప‌క్షాన్ని క‌ల‌వ‌ర‌పెట్టిందో తెలియ‌దు గానీ., చాలా ఛీప్ ట్రిక్ ప్లే చేసి.. జ‌నంతో మ‌రోసారి చీ కొట్టించుకునే ప‌రిస్థితి తెచ్చుకున్నారు..

జ‌న‌సేన అధినేత బ‌హిరంగంగా స‌వాలు విసురుతున్నారు.. వెనుక నుండి వ‌చ్చే విజ‌యం త‌న‌కి వ‌ద్ద‌ని చెబుతున్నారు.. అందుకు ప్ర‌త్య‌ర్ధులు కూడా సిద్ధంగా ఉంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎప్పుడో మానుకునే వారు..

Share This:

2,906 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four − one =