Home / ఎడిటోరియల్స్ / ఉత్త‌రాంధ్ర‌లో ‘వార్’ వ‌న్‌సైడే.. ఆత్మ‌ను ప‌ట్టేసిన జ‌న‌సేనుడు..

ఉత్త‌రాంధ్ర‌లో ‘వార్’ వ‌న్‌సైడే.. ఆత్మ‌ను ప‌ట్టేసిన జ‌న‌సేనుడు..

మేధావి మౌనం స‌మాజానికి ప్ర‌మాద‌క‌రం.. అదే మేధావి మ‌ద్ద‌తు బ‌లం.. మ‌హా బ‌లం.. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర లాంటి ఉద్య‌మాల గ‌డ్డ‌పై ఒక్కో మేధావి ల‌క్ష మందితో స‌మానం.. అదే మేధావుల స‌మూహం ముందుకి వ‌స్తే.. ఆత్మ చిక్కిన‌ట్టే.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే వార్ వ‌న్ సైడే.. ఓ ప్రాంత‌పు ఆత్మ చిక్క‌డం మాత్రం అంత తేలికైన విష‌యం కాదు.. ఆత్మ‌ను ప‌ట్ట‌డం అంటే న‌మ్మ‌కాన్ని పొంద‌డం.. ఓ వ్య‌క్తి న‌మ్మ‌కం పొంద‌డం కాదు.. ఓ వ్య‌వ‌స్థ‌, స‌మూహం.. ప్రాంతం మొత్తం న‌మ్మ‌కం పొంద‌డం.. ఆ న‌మ్మ‌కం ఓ గంట‌లో క‌లిగించ గ‌లిగేది కాదు.. ఓ రోజులో క‌లిగించేది కాదు.. క‌లిగిందీ కాదు.. కానీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆ న‌మ్మ‌కాన్ని సాధించారు.. ఆత్మ‌ను 100 శాతం ప‌ట్టేశారు..

ఉద్దానం నుంచి మొద‌లైన ప్ర‌స్థానం.. సోంపేట ఉద్య‌మానికి నేనున్నాన‌న్న భ‌రోసా, వంశ‌ధార నిర్వాసితుల స‌మ‌స్య ప్ర‌పంచానికి ఎలుగెత్తిన తీరు పెద‌పెంకి బోద‌కాలు వ్యాధి ప‌ట్ట‌దా అంటూ బాధితుల త‌రుపున విప్పిన గ‌ళం.. ఏజెన్సీ వాసుల క‌ష్టాలు తీర్చేందుకు ప్ర‌తిన‌బూనిన తెగువ‌., తుమ్మ‌పాల చ‌క్కెర క‌ర్మాగారం బాధిత రైతులు, కార్మికుల ప‌క్షాన పాల‌కులకి డెడ్‌లైన్ పెట్టిన ధైర్యం.. జ‌న‌సేన అధినేతకి ఉత్త‌రాంధ్ర ఆత్మ దాసోహం అన‌డానికి ఇవ‌న్నీ కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే.. ఏడాదిన్న‌ర క్రితం ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల కోసం తొలిసారి ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన నాడే.. ఆయ‌న ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.. ఉత్త‌రాంధ్ర వెనుక‌బ‌డిన ప్రాంతం కాదు.. వెన‌క్కినెట్ట‌బ‌డిన ప్రాంతం అని.. ఈ ప్రాంతాన్ని ముందుకి తీసుకెళ్లాల్సిన బాధ్య‌తని గుర్తెరిగిన ఆయ‌న‌, రాజ‌కీయ ప్ర‌స్థానంలో కీల‌క‌మైన అడుగు ఇక్క‌డి నుంచే మొద‌లు పెట్టారు.. కొంత దూరం ప్ర‌యాణం కూడా చేశారు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో ఆయ‌న‌కున్న నిబ‌ద్ద‌త ఆ ప్రాంత‌పు ఆత్మ‌(మేధావుల్ని)ని ఫిదా చేసేసింది..

ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుని త‌రిమేందుకు ఆయ‌న‌కున్న నిబ‌ద్ద‌త‌కి మ‌ద్ద‌తుగా ఆ ప్రాంత‌పు పోరాట యోధులు మేముసైతం అంటూ ముందుకి వ‌చ్చారు.. జ‌న‌సేన అధినేత పిల‌వ‌గానే ఒక్కొక్క‌రు ల‌క్ష మందితో స‌మానులైన మేధావులు ప‌దుల సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి ఉత్త‌రాంధ్ర ఉద్ద‌ర‌ణ‌కు ఉన్న అవ‌కాశాల‌ను ఆయ‌న ముందు ఉంచారు.. ఉత్త‌రాంధ్ర ఉద్ద‌ర‌ణ కోసం జ‌న‌సేన‌కి మ‌ద్దతు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చేశారు..

జ‌న‌సేన అధినేత ఎదుట జ‌రిగిన చ‌ర్చ త‌ర్వాత‌., మేధావులు త‌మ వ్యూహాల‌కి ప‌దును పెట్టారు.. చేప‌ట్టిన ప‌నిలో గెలుపు ఎలా అనే అంశంపై క‌స‌ర‌త్తులు చేస్తున్నారు.. అందులో భాగంగా రెండు కీల‌క అంశాల‌ను తెర‌పైకి తెచ్చారు.. వ‌న‌రులు మావా..? అభివృద్ది వాళ్ల‌కా..?( పాల‌క వ‌ర్గాల‌కా?).. పాయింట్ టూ కుటుంబాలు బాగుప‌డుతున్నాయి కానీ కులాలు బాగుప‌డ‌డం లేదు.. ఓ ప్రాంతం మొత్తాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌ల అంశాలు ఇవి.. వీటిని జ‌న‌సేన అధినేత ఎదుట ఉంచారు.. మేధావుల మ‌ద్ద‌తు ఎప్పుడైతే ప‌రిపూర్ణంగా ల‌భించిందో., అప్పుడు జ‌న‌సేనుడి ఆత్మ‌బ‌లం పెరిగింది.. ఆ ఆత్మ‌బ‌లం విలువ‌.. ఎంత అనే అంశానికి స‌మాధానం భ‌విష్య‌త్తు చెప్ప‌నుంది..

తాజాగా ఉత్త‌రాంధ్ర‌కి చెందిన KV Ramana(former VC of AU), KS.Chalam( Former VC Kuppam University) N.Prakas Rao( AVN college former principal, N.Kalyan Rao( Ambedkar Bhavan President), shiva Shankar( Senior Journalist)లు క‌లిసిన‌ప్పుడు.. అదే విష‌యాన్ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా వెల్ల‌డించారు.. వీరి మ‌ద్ద‌తు నా బాధ్య‌త‌ని మ‌రింత పెంచింది.. నాలోని నిబ‌ద్ద‌త‌ని కొన్ని రెట్లు పెంచింది.. ఈ విష‌యంలో జ‌న‌సేన అధినేత ఎలాంటి బాధ్య‌త‌ని ఫీల‌వుతున్నారో., ఉత్త‌రాంధ్ర వాసులు కూడా అదే బాధ్య‌త‌ని ఫీల‌వుతున్నారు.. అందుకే రాజ‌కీయ వాదులు వార్ వ‌న్ సైడే అంటున్నారు.. ప్ర‌త్య‌ర్ధులు జ‌నాన్ని రెచ్చ‌గొడుతున్నారు అంటున్నారు.. రెండు వాద‌న‌ల్లోనూ వాస్త‌వం ఉన్నా., ఆత్మ మాత్రం జ‌న‌సేనుడి చేతికి చిక్కేసింది..

Advertisement..

Share This:

3,145 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − sixteen =