Home / ఎడిటోరియల్స్ / ఉత్త‌రాంధ్ర నెత్తిన అణు”కుంప‌టి”.. కొవ్వాడ‌లో జ‌న‌సేన టీం ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌..

ఉత్త‌రాంధ్ర నెత్తిన అణు”కుంప‌టి”.. కొవ్వాడ‌లో జ‌న‌సేన టీం ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌..

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న‌ నిరంత‌ర రాజ‌కీయ యాత్ర షెడ్యూల్‌లో ప్ర‌క‌టించిన శ్రీకాకుళం కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టు బాధితుల స‌మ‌స్య‌లు., ఈ నెల 21న జ‌రిగే సిక్కోలు ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ముందుకి రానుంది.. త‌మ‌ను ఎస్టీల్లో చేర్చాల‌న్న డిమాండ్‌తో ఉద్య‌మిస్తున్న మ‌త్స్య‌కారుల్ని ప‌రామ‌ర్శించేందుకు జిల్లాకి వెళ్ల‌నున్న ఆయ‌న‌., వారి స‌మ‌స్య‌ల్ని స్వ‌యంగా ప‌రిశీలించ‌నున్నారు.. ఈ సంద‌ర్బంగా శ్రీకాకుళం జిల్లాకి చెందిన మ‌రికొన్ని స‌మ‌స్య‌ల్ని జ‌న‌సేన అధినేత ప‌రిశీలించ‌నున్నారు.. ముఖ్యంగా కొవ్వాడ అణువిద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అధ్య‌య‌నం చేసే అవ‌కాశాలు క‌న‌బ‌డుతున్నాయి.. ఇంత‌కీ అస‌లు ఈ కొవ్వాడ ప్రాజెక్టు గోల ఏంటి..? ప‌్ర‌జ‌ల‌కి వ‌చ్చే న‌ష్టం ఏంటి..? ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఓ రిపోర్టుని జ‌న‌సేన అధినేత కోసం సిద్ధం చేశారు..

1991లో దేశ‌వ్యాప్తంగా నిర్మించ‌త‌ల‌పెట్టిన అణు విద్యుత్ కేంద్రాల్లో కొవ్వాడ కూడా ఒక‌టి.. అణు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం అంటే ఆషామాషి వ్య‌వ‌హారం కాదు.. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే ఈ ప్రాజెక్టు ఉత్త‌రాంధ్ర నెత్తిన భ‌స్మాసుర హ‌స్తం లాంటిది.. 9 వేల 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పాద‌న శ‌క్తి అంచ‌నా గ‌ల ఈ ప్రాజెక్టు ప్ర‌పంచంలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రాల్లో ఒక‌టి.. దీని కోసం సుమారు ఐదు గ్రామాల్ని ఖాళీ చేయించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ప్ర‌తిపాధ‌న‌.. సుమారు 10 వేల మంది నిర్వాశితులు అవుతారు.. ఒక్క కొవ్వాడ గ్రామ పంచాయితీ ప‌రిధిలోనే సుమారు ఆరు వేల మంది రోడ్డున ప‌డ‌తారు.. పరిహారం కోసం క‌క్కుర్తి ప‌డినా., ప్రాజెక్టు పూర్త‌యితే ఉత్త‌రాంధ్ర నెత్తిన మృత్యు కుంప‌టి పెట్టుకున్న‌ట్టే.. అణు వ్య‌ర్ధాల నుంచి విడుద‌ల‌య్యే రేడియేష‌న్ మాన‌వ శ‌రీరంపై చూపే ప్ర‌భావం చాలా తీవ్రంగా ఉంటుంది.. కొత్త కొత్తరోగాలు పుట్టుకొస్తాయి.. ఈ ప్ర‌మాదం కేవ‌లం కొవ్వాడ ప‌రిస‌రాల్లో మాత్ర‌మే ఆగిపోదు.. విశాఖ న‌గ‌రం స‌హాం ఉత్త‌రాంధ్ర జిల్లాల‌న్నింటిపై ఉంటుంది.. ప్రాజెక్టు నిర్మాణంలో గానీ, ర‌న్నింగ్‌లో గానీ ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే., 100 కిలోమీట‌ర్ల ప‌రిధి వ‌ర‌కు మొత్తం భ‌స్మీప‌ట‌లం కాక‌త‌ప్ప‌దు.. అంటే విశాఖ వ‌ర‌కు మొత్తం శ్మ‌శానంగా మారుతుంది.. తిరిగి 20 ఏళ్లు దాటే వ‌ర‌కు ఆ ప్రాంతంలో అడుగు పెట్టే అవ‌కాశం ఉండ‌దు.. సుమారు కోటి మందికి నిత్యం ఈ ప్ర‌మాదం పొంచి ఉంటుంది.. ఇక తీర‌ప్రాంతం మొత్తం ఉపాధి కోల్పోవ‌డం ఖాయ‌మే.. రేడియోధార్మిక త‌రంగాలు స‌ముద్రంలోని మ‌త్స్య సంప‌ద‌ని నాశ‌నం చేసేస్తాయి.. ద‌క్షిణాసియాలోనే అతిపెద్ద మార్కెట్ విశాఖ చేపల ఎక్స్‌పోర్టు మూత‌ప‌డడం ఖాయం..

ఈ ప్రాజెక్టుకి వ్య‌తిరేకంగా చాలా ఉద్య‌మాలే జ‌రిగాయి., కానీ స‌రైన నాయ‌క‌త్వం లేక అవి చ‌ల్లారిపోయాయి.. ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప‌నుల ప్రారంభానికి ఏప్రిల్ డెడ్‌లైన్‌., ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు కూడా రాలేదు.. కానీ నిర్మాణ సంస్థ గ‌ట్టిగానే పావులు క‌దుపుతోంది.. ఉద్య‌మించి ఉద్య‌మించి అల‌సిపోయిన ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కి ఏం చేయాలో తోచ‌ని ప‌రిస్థితి.. ప్రాజెక్టు ప్ర‌పోజ‌ల్ పెట్టిన నాటి నుంచి విప‌క్షంలో ఉన్న నాయ‌కులు మాత్రం వ‌చ్చి నాలుగు రోజులు మురిపించి పోతారు.. అధికారంలోకి వ‌చ్చాక వారూ ముఖం చాటేస్తారు.. నేటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా ఒక‌ప్పుడు ప్రాజెక్టు వ్య‌తిరేక ఉద్య‌మంలో పాల్గోన్న‌వారే .. దీంతో త‌మ ఆదుకునే దిక్కుకోసం ఎద‌రుచూసి చూసి క‌ళ్లు కాయ‌లు కాచిన ఆ ప్రారంత ప్ర‌జ‌ల‌కి., ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దేవుడిలా క‌నిపించారు.. ఆయ‌న ఏ స‌మ‌స్య హ్యాండిల్ చేసినా ఇట్టే ప‌రిష్కారం ల‌భిస్తుండ‌డంతో., కొవ్వాడ‌ బాధితుల‌తో పాటు ఉత్త‌రాంధ్ర మొత్తం ఆయ‌న‌పై కోటి ఆశ‌లు పెట్టుకుంది.. ఈ ప్రాజెక్టుని జ‌న‌సేన అధినేత ఆప‌గ‌లిగితే., ఉత్త‌రాంధ్ర నెత్తిన పెద్ద కుంప‌టి దించిన‌ట్టేన‌ని ఆ ప్రాంత ప్ర‌జ‌లు భావిస్తున్నారు..

ఇక 21న జ‌న‌సేన అధినేత శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న ఉన్న‌నేప‌ధ్యంలో జ‌న‌సేన టీం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించి ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ చేప‌ట్టింది.. జ‌న‌సేన అధినేత నియ‌మించిన ఉద్దానం కిడ్నీ రిలీఫ్ టీం స‌భ్యుడు డాక్ట‌ర్ దుర్గారావు ఆధ్వ‌ర్యంలో ఆ ప్రాంతంలో అధ్య‌య‌నం జ‌రిగింది.. కొవ్వాడతో పాటు అణువిద్యుత్ ప్రాజెక్టు బాధిత ప్రాంతం మొత్తం మ‌త్య్స‌కార కుటుంబాలే ఎక్కువ‌.. సుమారు 2 వేల ఎక‌రాల‌కు పైగా భూమిని ఈ విద్యుత్ ప్రాజెక్టుకి ప్ర‌భుత్వ క‌ట్ట‌బెట్టేందుకు ప్ర‌తిపాధించ‌గా., ఐదు గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయాల్సిన ప‌రిస్థితి.. ఉన్న ఊరు వ‌దిలి వెళ్లేందుకు బాధితులు ఏమాత్రం సుముఖంగా లేరు.. కానీ పాల‌కులు, యాజ‌మాన్యం క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెప్పో., బ‌ల‌వంతంగానో అక్క‌డి నుంచి ఖాళీ చేయించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.. జ‌న‌సేన అధినేత అండ త‌మ‌కి ల‌భిస్తే., ఉత్త‌రాంధ్ర ప్రాణాలు తోడేసే అణువిద్యుత్ ప్రాజెక్టును త‌రిమేందుకు ప్రాణాలు సైతం ప‌ణంగా పెడ‌తామ‌ని చెబుతున్నారు.. స్వ‌యానా కొవ్వాడ స‌ర్పంచ్ మాట‌ల్లో వారి ఆవేద‌న విన‌వ‌చ్చు..

21న మ‌త్స్య‌కారుల కోసం సిక్కోలు వ‌స్తున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., అదే వ‌ర్గానికి చెందిన త‌మ కోసం కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టుని అడ్డుకుంటార‌ని బ‌ల‌మైన న‌మ్మ‌కంతో ఉన్నారు.. ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత హార్వార్డ్ టూర్‌లో అక్క‌డ అణు విద్యుత్ ప్లాంట్‌ని ప‌రిశీలించి., వివ‌రాలు తెలుసుకున్నారు.. ఇప్ప‌టికే అభివృద్ది చెందిన దేశాలు ఉన్న ప్లాంట్‌ల‌ను మూసేస్తున్నాయి.. ఈ నేప‌ధ్యంలో ఉద్దానం బాధితుల‌కి ఊర‌ట క‌ల్పించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఈ ప్రాజెక్టుకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌డం ద్వారా ఉత్త‌రాంధ్రకు మ‌రోసారి ఊర‌ట క‌ల్పిస్తార‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు..

Share This:

3,677 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + twelve =