Home / జన సేన / ఉత్త‌రాంధ్ర పోరాట యోధుడు చాగంటికి జ‌న‌సేనుడి ప‌రామ‌ర్శ‌.. ప‌వ‌న్‌కి రావు ఆశీస్సులు..

ఉత్త‌రాంధ్ర పోరాట యోధుడు చాగంటికి జ‌న‌సేనుడి ప‌రామ‌ర్శ‌.. ప‌వ‌న్‌కి రావు ఆశీస్సులు..

విశాఖ‌లో ఉత్త‌రాంధ్ర మేధావుల‌తో భేటీ అనంత‌రం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కేర్ ఆసుప‌త్రికి వెళ్లారు.. ఓ పెద్దాయ‌న‌ని ప‌రామ‌ర్శించి., ఆయ‌న దీవెన‌లు అందుకున్నారు.. జ‌న‌సేనానిని క‌ల‌వాల‌న్న ఆ పెద్దాయ‌న ఆకాంక్ష తీర్చేందుకే ఆయ‌న ఆసుప‌త్రికి వ‌చ్చారు.. ఆ పెద్దాయ‌న‌కి అంత ప్రాముఖ్య‌త దేనికి, అప్ప‌టిక‌ప్పుడు ఉన్న‌ప‌ళంగా ఆసుప‌త్రికి ఎందుకు వెళ్లారు..? ఆ పెద్దాయ‌న పేరు చాగంటి సుంద‌ర‌రావు.. ఉత్తరాంధ్ర ప్ర‌జ‌ల కోసం పోరాటం చేసిన 92 ఏళ్ల యోధుడు.. అంద‌రికీ సి.ఎస్ రావుగా సుప‌రిచితులు ఆయ‌న‌.. ఐఈఎస్ పూర్తి చేసిన సి.ఎస్ రావు సెంట్ర‌ల్ ప్లానింగ్ క‌మిష‌న్‌లో స‌భ్యుడిగా సేవ‌లు అందించారు.. ప‌ద‌వీ విర‌మ‌న అనంత‌రం మాతృభూమికి తిరిగి వ‌చ్చిన ఆయ‌న‌, ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుపై అలుపెరుగ‌ని పోరాటం చేశారు.. చేస్తూనే ఉన్నారు.. ప్ర‌జా స్పంద‌న అనే స్వ‌చ్చంద సంస్థ ఏర్పాటు చేసిన చాగంటి., ప్ర‌జ‌ల ప్రాధ‌మిక హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం ఉద్య‌మించారు..

విశాఖ సెంట్ర‌ల్ జైలు స్థ‌లంపై వ‌ల‌స రాజ‌కీయ నాయ‌కుల క‌న్ను ప‌డ‌గా, ఆ భూమిని కాపాడేందుకు ఢిల్లీ స్థాయిలో పోరాడి విజ‌యం సాధించారు.. ఆయ‌న జీవితంలో విశాఖ సెంట్ర‌ల్ జైలుని, సెంట్ర‌ల్ పార్క్‌గా అభివృద్ది చేసేందుకు ఆయ‌న చేసిన కృషి చెప్పుకోద‌గిన అంశం.. దీంతో పాటు విశాఖ ప‌రిస‌రాల్లో నిర్వాసితుల స‌మ‌స్య‌ల‌పై జ‌రిగిన ప‌లు పోరాటాల‌కు ఆయ‌న తెర‌వెనుక నుంచి త‌న‌వంతు సాయం అందించారు..

ప్ర‌మాద‌వ‌శాత్తు జారిప‌డి 92 ఏళ్ల వ‌య‌సులో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న చాగంటి సుంద‌ర్‌రావు., నిబ‌ద్ద‌త‌తో కూడిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌కి రూపం ఇచ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని క‌ల‌వాల‌న్న కోరిక క‌లిగింది.. విష‌యాన్ని ఆచార్య కె.ఎస్ చ‌లం, కె.వి ర‌మ‌ణ‌ల‌కి చెప్ప‌గా., మ‌ధ్యాహ్నం జరిగిన స‌మావేశానంత‌రం ఈ ఇద్ద‌రు మాజీ వీసీలు జ‌న‌సేనుడికి విష‌యాన్ని చెప్పారు.. ఉత్త‌రాంధ్ర పోరాటాల కురువృద్ధుడు, పోరాట యోధుడు ఆయిన చాగంటి వివ‌రాలు తెలుసుకున్న ప‌వ‌న్‌., వెంట‌నే సి.ఎస్ రావుని ప‌రామ‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. కేర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న ద‌గ్గ‌ర‌కి వెళ్లి, ఆరోగ్య స్థితిపై ఆరా తీశారు.. మీ లాంటి మేధావులు, పోరాట యోధుల ఆశీస్సులు కావాలంటూ ప్ర‌ణ‌మిల్లారు.. జ‌న‌సేనుడి విన‌మ్ర‌త‌కి, నిజాయితీతో కూడిన ఆయ‌న పోరాటానికి ఫ్లాట్ అయిన చాంగంటి సుంద‌ర్‌రావు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న ప్ర‌యాణంలో విజ‌యం సాధించాల‌ని ఆశీర్వ‌దించారు.. ఓ మేధావి, ప్ర‌జా పోరాట యోధుడు అనారోగ్యంతో ఉన్నాడ‌న్న విష‌యాన్ని తెలుసుకున్న జ‌న‌సేన అధినేత‌కి ఆయ‌న్ని చూసి, ఆశీస్సులు అందుకునే వ‌ర‌కు కాళ్లాడ‌లేదు.. విధ్వ‌త్తుకి ఆయన‌కున్న ప్రేమ అలాంటిది..

Share This:

1,237 views

About Syamkumar Lebaka

Check Also

కాకినాడ సెజ్‌లో జ‌న‌సేనాని.. బాధితుల వెత‌లు విన్న ప‌వ‌న్‌.. విత్ ఫోటో గ్యాల‌రీ..

కాకినాడ సెజ్‌..కేవీ రావు అక్ర‌మాల‌పై బాధితుల పోరాటానికి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురువారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించారు.. యూ.కొత్త‌ప‌ల్లి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × 1 =