Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / ఉత్త‌రాధిప‌త్య రాజ‌కీయాల‌పై జ‌న‌సేనాని ఫైర్‌.. శాంతియుతంగా చేస్తే రిప‌బ్లిక్ డే ఉద్య‌మానికి మ‌ద్ద‌తు..

ఉత్త‌రాధిప‌త్య రాజ‌కీయాల‌పై జ‌న‌సేనాని ఫైర్‌.. శాంతియుతంగా చేస్తే రిప‌బ్లిక్ డే ఉద్య‌మానికి మ‌ద్ద‌తు..

sgs-pk1

దేశ రాజ‌కీయాల్లో ఉత్త‌రాది ఆధిప‌త్యంపై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు.. గాంధీని ప్రేమిస్తాం.. అంబేద్క‌ర్‌ని ఆరాధిస్తాం.. స‌ర్ధార్ ప‌టేల్‌కి సెల్యూట్ చేస్తాం.. రాజ్యాంగాన్ని సైతం గౌర‌విస్తాం.. కానీ త‌లెగ‌రేసే ఉత్త‌రాది నాయ‌క‌త్వం., ద‌క్షిణాది ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రుస్తూ పోతే మాత్ర చూస్తూ కూర్చోమ‌ని హెచ్చ‌రించారు.. మెడ‌లు వంచి కింద కూర్చోబెడ‌తామ‌న్నారు.. ఉత్త‌రాదివారి ఆధిప‌త్యంలో కొన‌సాగుతున్న నేటి రాజ‌కీయాల తీరుని ఎండ‌గ‌ట్టారు.. ఉత్త‌రభార‌త రాజ‌కీయ శ్రేష్టుల‌కి అస‌లు ద‌క్షిణ భార‌తంలో ఎన్ని భాష‌లున్నాయో తెలుసా., వాళ్ల‌కి మ‌నంమంతా మ‌ద‌రాసీయుల‌మూనంటూ దుయ్య‌బ‌ట్టారు..

sgs-pk2

ఉత్త‌రాధి నాయ‌కుల అడుగుల‌కి మ‌డుగులొత్తే., తెలుగు పాల‌కుల‌పై కూడా విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయంలో ధైర్యం, ఆత్మ‌గౌర‌వం, స‌మ‌గ్ర‌త‌., జ‌వాభుదారీత‌నం అనేవి మ‌చ్చుకైనా క‌న‌బ‌డ‌కుండా పోయాయ‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు..

నేటి అవ‌కాశ‌వాద‌, వేర్పాటువాద‌, క్రిమిన‌ల్ రాజ‌కీయాల మీద దేశ్ బ‌చావో పేరుతో జ‌న‌సేన పార్టీ ఓ మ్యూజిక‌ల్ ఆల్బ‌మ్‌ని రూపొందించింది.. దేశాన్ని ర‌క్షించ‌మంటూ పార్టీ గొంతెత్త‌బోతోంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.. ఈ ఆల్బ‌మ్‌ని ముందుగా ఫిబ్ర‌వ‌రి 5న విడుద‌ల చేయాల‌ని భావించిన‌ట్టు., అయితే అంత‌కంటే ముందుగానే జ‌న‌వ‌రి 24నే విడుద‌ల చేయ‌నున్నామ‌ని జ‌న‌సేనాని ప్ర‌క‌టించారు..

sgs-pk

ఇక జ‌న‌వ‌రి 26 ఉద్య‌మంపైనా ఓ ప్ర‌క‌ట‌న చేశారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త శాంతియుతంగా పోరాటం చేయ‌ద‌లిస్తే., రిప‌బ్లిక్ డే పోరుకి జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తు ఉంటుంది.. వారి వెంటే ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు… యువ‌త‌ను ఉత్తేజ‌ప‌రిచేందుకు తిడితే భ‌రించాం..విడ‌గొట్టి గెంటేస్తే.. స‌హించాం..
ఇచ్చిన‌మాట నిల‌బెట్టుకోక‌పోతే తిర‌గ‌బ‌డ‌తాం@@ అన్న‌ది.. రిప‌బ్లిక్ డే ఉద్య‌మం ద్వారా ఆంధ్రా యువ‌త కేంద్రానికి తెలియ‌చెప్పాలని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు..

Share This:

897 views

About Syamkumar Lebaka

Check Also

బాబుల్లారా మా “బాబు” బంగారం- “నకిలీ మాత్రం అనవద్దు… ఇట్లు మీ ప‌చ్చ మీడియా.!!!

మా “బాబు” బంగారం -పచ్చ మీడియాలో.. మా “బాబు” శృంగారం – ఆ ఒక్కటీ అడక్కు! మా “బాబు” చాణిక్యుడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × four =