Home / పవన్ టుడే / ఉద్దానంపై సిఎం ప్ర‌క‌ట‌న ప‌ట్ల ప‌వ‌న్ హర్షం.. స‌ర్కారు స్పంద‌న తొలి విజ‌య‌మ‌న్న జ‌న‌సేనుడు..

ఉద్దానంపై సిఎం ప్ర‌క‌ట‌న ప‌ట్ల ప‌వ‌న్ హర్షం.. స‌ర్కారు స్పంద‌న తొలి విజ‌య‌మ‌న్న జ‌న‌సేనుడు..

pud4 pud5

ఉద్దానం మూత్ర‌పిండాల వ్యాధిగ్ర‌స్తుల విషయంలో ఏపీ సిఎం చంద్ర‌బాబు నాయుడు చేసిన ప్ర‌క‌ట‌న ప‌ట్ల జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సంతృప్తి వ్య‌క్తం చేశారు.. బాధితుల‌ను ఆదుకునే దిశ‌గా సిఎం సానుకూలంగా స్పందించ‌డం ప‌ట్ల హర్షం వ్య‌క్తం చేశారు.. ఈ నెల మూడున జ‌న‌సేనాని ఉద్దానం బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు ఇచ్చాపురం వెళ్ల‌డంతో పాటు వారి త‌రుపున ప్ర‌భుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు.. స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించేందుకు 48 గంట‌ల డెడ్‌లైన్ కూడా పెట్టారు.. శుక్ర‌వారం సిక్కోలు జిల్లాలో ప‌ర్య‌టించిన ఏపీ సిఎం ప‌వ‌న్ డిమాండ్ల ప‌ట్ల సానుకూలంగా స్పందించారు.. ఉద్దానం బాధితుల‌ను ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.. బాబు ప్ర‌క‌ట‌న‌పై ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన ఆయ‌న‌., ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం త‌మ తొలి విజ‌యంగా అభివ‌ర్ణించారు.. నిస్స‌హాయులైన బాధితుల ప‌క్షాన నిల‌బ‌డి వారి స‌మ‌స్య‌ల‌ను వివ‌రించ‌డానికి కృషి చేసిన మీడియాకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు..

pud pud1

 

ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్ర‌స్తులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం అన్ని పార్టీల సామాజిక బాధ్య‌త అని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.. ఉద్దానం బాధితుల స‌మ‌స్య‌లు పూర్తిగా తొల‌గిపోయే వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని రాజ‌కీయ పార్టీలు స్పందిస్తూనే ఉండాల‌ని సూచించారు.. మీడియా మ‌ద్ద‌తు కూడా కొన‌సాగాల‌ని జ‌న‌సేనాని కోరారు..

ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై విమ‌ర్శ‌నాత్మ‌క వ్యాఖ్య‌లు చేసిన జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుకి కౌంట‌ర్ ఇచ్చారు.. ఉద్దానం బాధితులు ప‌డుతున్న క‌ష్టాలు జిల్లా మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడి కంటే చంద్ర‌బాబే బాగా అర్ధం చేసుకున్నార‌ని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. ఉద్దానం విజ‌యం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపాయి..

Share This:

About Syamkumar Lebaka

Check Also

6-14709031181

రైలు ప్ర‌మాదం మృతుల‌కు ప‌వ‌న్ నివాళి., బాధిత కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్‌..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదం ఘ‌ట‌న‌పై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పందించారు.. 40 మంది ప్రాణాలు బ‌లిగొన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × 2 =