Home / పవన్ టుడే / ఉద్దానం ప‌ర్య‌ట‌న‌పై జ‌న‌సేనాని ట్వీట్‌.. పాల‌కుల వైఫ‌ల్యంపై విమ‌ర్శ‌లు…

ఉద్దానం ప‌ర్య‌ట‌న‌పై జ‌న‌సేనాని ట్వీట్‌.. పాల‌కుల వైఫ‌ల్యంపై విమ‌ర్శ‌లు…

img-20170102-wa0026 img-20170102-wa0027 img-20170102-wa0028

ఉద్దానం.. ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతానికి కోన‌సీమ లాంటి ప్రాంతం.. అయితే అక్క‌డ ప్ర‌కృతి ర‌మ‌ణీయ‌త వెనుక ఉన్న విషాదం ఉద్దానం నెప్రోప‌తిగా చెప్ప‌బ‌డే అంతుప‌ట్ట‌ని మూత్ర‌పిండాల రోగం.. ఇక్క‌డ బాధితుల సంఖ్య అధికారికంగా వేల‌ల్లో., అన‌ధికారికంగా ల‌క్ష‌ల్లో ఉంటుంది.. పాల‌కులు మారినా., ప్ర‌భుత్వాలు మారినా ఉద్దానం నెఫ్రోప‌తి కేవ‌లం ఎన్నిక‌ల హామీకే ప‌రిమితం అవుతూ వ‌స్తోంది.. ఇదే స‌మ‌స్య జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ దృష్టికి వ‌చ్చింది.. ఆ ప్రాంత ప్ర‌జ‌ల వెత‌లు తెలుసుకున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., మంగ‌ళ‌వారం ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించ‌నున్నారు.. అందుకు సంబంధించిన వివ‌రాలు ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు…

ఉద్దానం ఉత్త‌రాంధ్ర కోస్తాకి కోన‌సీమ లాంటిదన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఉద్దానం నెఫ్రోప‌తితో అనే స‌మ‌స్య మాటున ఆ అందం మ‌టుమాయ‌మ‌య్యింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. ఈ అంతుతెలియ‌ని రోగానికి గ‌డ‌చిన 20 ఏళ్ల‌లో 20 వేల మందికి పైగా బ‌ల‌య్యార‌ని ఆయ‌న ఆవేధ‌న వ్య‌క్తం చేశారు.. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముస‌లి వ‌ర‌కు వ‌యోబేధం లేకుండా ఈ వ్యాధి అంద‌ర్నీ క‌భ‌ళిస్తుంద‌న్న ఆయ‌న‌., ప్ర‌స్తుతం కొన్ని ల‌క్ష‌ల మంది ఈ వ్యాధిచే పీడింప‌బ‌డుతున్నార‌న్నారు.. స‌మ‌స్య ఇంత తీవ్ర‌మైన‌దైనా పాల‌కులు గాని., ఆ ప్రాంతం నుంచి ఎన్నికైన శాస‌న‌స‌భ్యులకు గాని గ‌డ‌చిన 20 ఏళ్ల‌లో ఎవ్వ‌రూ దీని గురించి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డాన్ని జ‌న‌సేనాని దుయ్య‌బ‌ట్టారు.. ఈ స‌మ‌స్య జ‌న‌సేన పార్టీ దృష్టికి వ‌చ్చింద‌ని., త‌మ మీడియా టీమ్ స్వ‌యంగా ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించి., ఉద్దానం ప‌రిస్థితుల‌పై ఓ డాక్యుమెంట‌రీ త‌యారు చేశార‌ని ప‌వ‌న్ తెలిపారు..

ఉద్దానం బాధితుల‌ను స్వ‌యంగా ప‌రామ‌ర్శించేందుకు, వారి క‌ష్టాలు తెలుసుకునేందుకు రేపు ఆ ప్రాంతానికి వెళ్తున్న‌ట్టు తెలిపారు.. కొంత మంది ఉద్దానం బాధితులతో స్వ‌యంగా మాట్లాడ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.. ఉద్దానం బాధితుల క‌ష్టాల‌పై జ‌న‌సేన రూపొందించి డాక్యుమెంట‌రీ తాలూకు వివ‌రాలు., పార్టీ అఫీషియ‌ల్ యూ ట్యూబ్ ఛాన‌ల్‌లో కూడా ఉంచిన‌ట్టు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలిపారు..

Share This:

869 views

About Syamkumar Lebaka

Check Also

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు …

One comment

  1. Sir pawan kalyan garu, uttarandhra paryatana vundhi, kanı naku pass ledhu, naku pass kavali, visakhapathanam lo evarini contact avvali, from manikyalarao tatipakala janasena party active member visakhapathanam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 1 =