Home / పవన్ టుడే / ఉద్దానం స‌మ‌స్య‌ను దేశం దృష్టికి తీసుకెళ్ల‌డ‌మే నా ప‌ర్య‌ట‌న ఉద్దేశం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ఉద్దానం స‌మ‌స్య‌ను దేశం దృష్టికి తీసుకెళ్ల‌డ‌మే నా ప‌ర్య‌ట‌న ఉద్దేశం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

img-20170103-wa0073 img-20170103-wa0075ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు ఇచ్చాపురం వెళ్లిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. గ‌త నెల‌లో రాలేక‌పోయినందుకు క్ష‌మాప‌ణ చెబుతూ త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు.. త‌మిళ‌నాడు సిఎం జ‌య‌ల‌లిత మృతి కార‌ణంగా ఆమెకు సంతాపం తెలిపే ఉద్దేశంతోనే అప్పుడు ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకున్న‌ట్టు వివ‌ర‌ణ ఇచ్చారు.. 20 ఏళ్లుగా ప్రాణాలు తోడేసేంత‌టి ఇలాంటి వ్యాధి ప్ర‌భ‌లి ఉన్నా., పాల‌కులు, ప్ర‌భుత్వాలు ఎందుకు స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేక‌పోయార‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌శ్నించారు.. పిల్ల‌లు కూడా ఈ వ్యాధి భారిన ప‌డ‌టం అన‌ను క‌ల‌చి వేసింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. తాను ఎలాంటి రాజకీయ ప్ర‌యోజ‌నాలు ఆశించి ఇక్క‌డ‌కు రాలేద‌ని., ఈ స‌మ‌స్య‌ను దేశం దృష్టికి, రాష్ట్రం దృష్టికి తీసుకువెళ్లాల‌న్న‌దే త‌న ప‌ర్య‌ట‌న ముఖ్య ఉద్దేశ‌మ‌ని జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు.. ముందుగా ఉద్దానం బాధితుల క‌ష్టాల‌ను వారి మాట‌ల్లోనే అడిగి తెలుసుకున్నారు..

img-20170103-wa0071

ఉద్దానం బాధితులు త‌మ బాధ‌ల‌ను జ‌న‌సేనాని ముందు ఉంచారు.. ఏళ్ల త‌ర‌బ‌డి ఈ మ‌హ‌మ్మారి భారిన ప‌డి తాము నానా క‌ష్టాలు అనుభ‌విస్తున్నామ‌ని అవేధ‌న వ్య‌క్తం చేశారు.. మ‌న‌సు బ‌త‌కాల‌ని పిస్తున్నా., ఆర్ధిక ప‌రిస్థితి చావాల‌ని పిస్తోందంటూ ఓ రోగి త‌మ ప‌రిస్థితిని ప‌వ‌న్ ముందుంచారు.. జ‌న‌సేనాని రాక అయినా., త‌మ బ‌తుకుల్లో మార్పు వ‌స్తుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు..

Share This:

804 views

About Syamkumar Lebaka

Check Also

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు …

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen + thirteen =