Home / పవన్ టుడే / ఉద్దానం స‌మ‌స్య‌పై యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స్పందించ‌కుంటే.. యుద్ధం త‌ప్ప‌దు- జ‌న‌సేనాని హెచ్చ‌రిక‌

ఉద్దానం స‌మ‌స్య‌పై యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స్పందించ‌కుంటే.. యుద్ధం త‌ప్ప‌దు- జ‌న‌సేనాని హెచ్చ‌రిక‌

img-20170103-wa0075

ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.. ద‌శాబ్దాలుగా జ‌నం చ‌నిపోతుంటే., ఎందుకు ఈ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం చూప‌లేక‌పోయార‌ని పాల‌కుల్ని ప్ర‌శ్నించారు.. నిధుల్లేవు అని చెబుతున్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై త‌న‌దైన స్ట‌యిల్లో ధ్వ‌జ‌మెత్తారు.. ఇంత పెద్ద స‌మ‌స్య మీకు విప‌త్తుగా ఎందుకు క‌న‌బ‌డ‌లేద‌ని ప్ర‌శ్నించారు.. డిమోనిటైజేష‌న్ ద్వారా బ్యాంకుల్లో నిండిన డ‌బ్బును ఉద్దానం బాధితుల క‌ష్టాలు తీర్చేందుకు కేటాయించాల‌ని డిమాండ్ చేశారు.. ఆరు వేల కోట్ల రాష్ట్ర మెడిక‌ల్ బ‌డ్జెట్‌లో ఓ వంద కోట్లు కేటాయించ‌లేరా అని నిల‌దీశారు.. పుష్క‌రాల‌కు వంద‌ల కోట్లు, రాజ‌ధాని నిర్మాణానికి వేల కోట్లు ఖ‌ర్చుపెడుతున్న ప్ర‌భుత్వాలు., మ‌హ‌మ్మారి భారినప‌డి వేలాది మంది చ‌నిపోతుంటే ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదో బ‌దులు చెప్పాల‌ని జ‌న‌సేనాని డిమాండ్ చేశారు..

img-20170103-wa0071

డ‌యాల‌సిస్ సెంట‌ర్లు ఏర్పాటు చేశామ‌న్న ఆరోగ్య మంత్రి కామినేని వ్యాఖ్య‌ల‌పైనా ఆయ‌న తీవ్రంగా స్పందించారు.. డ‌యాల‌సిస్ వ్యాధి ముదిరి చివ‌రి క్ష‌ణాల్లో ఉన్న‌వారి కోస‌మ‌న్న సంగ‌తి ముందు గుర్తించాల‌ని సూచించారు.. క్రానిక్‌గా ఈ వ్యాధి గురించి పూర్తిగా అధ్య‌య‌నం చేసి., ఆరంభంలో ఉన్న‌వారికి ఎలాంటి మందులు అందించాల‌ని అనే అంశంపై దృష్టి సారించాల‌న్నారు.. ఉద్దానం స‌మ‌స్య ప‌రిష్కారం ప‌ట్ల జ‌న‌సేన పార్టీ పూర్తి చిత్త‌శుద్దితో ఉంద‌న్న జ‌న‌సేనాని., దీనిపై పూర్తి స్థాయిలో అధ్య‌య‌నానికి ఓ క‌మిటీ వేస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు.. పార్టీ ప్ర‌ముఖులు డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్‌, స‌మ‌స్య‌ను పార్టీ దృష్టికి తీసుకువ‌చ్చిన సందీప్‌ల‌తో పాటు ఐదుగురు స‌భ్య‌లు ఇందులో ఉంటార‌ని., 15 రోజుల్లో వీరు ఓ స‌మ‌గ్ర నివేధిక రూపొందిస్తార‌ని తెలిపారు.. నివేధిక సిద్ధం అయ్యాక తానే స్వ‌యంగా ఈ స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు..

ఉద్దానం కిడ్నీ వ్యాధి దెబ్బ‌కి అనాధ‌లు అయిన పిల్ల‌ల‌కు., ప్ర‌స్తుతం వ్యాధితో పోరాడుతున్న రోగుల‌కు ఎలాంటి సాయం చేస్తారో 48 గంట‌ల్లో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించాల‌ని జ‌న‌సేన అధినేత డిమాండ్ చేశారు.. ప్ర‌జ‌ల ఓట్ల‌తో ఎన్నికై ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోక పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. ఉద్దానం స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వం స్పందించ‌క‌పోతే ప్ర‌జా ఉద్య‌మం నిర్మిస్తామ‌ని హెచ్చ‌రించారు..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × two =

%d bloggers like this: