Home / సేన సేవ / ఉద్దానానికి ఊర‌ట‌.. జ‌న‌సేనుడి ప‌ర్య‌ట‌న‌తో పాల‌కుల్లో క‌ద‌లిక‌..

ఉద్దానానికి ఊర‌ట‌.. జ‌న‌సేనుడి ప‌ర్య‌ట‌న‌తో పాల‌కుల్లో క‌ద‌లిక‌..

img-20170103-wa0171

రెండు ద‌శాబ్దాలుగా ఉన్న స‌మ‌స్య‌.. అంతుప‌ట్ట‌ని స‌మ‌స్య‌.. ప‌రిష్కారం దొర‌క‌ని స‌మ‌స్య.. ప్ర‌జ‌ల ప్రాణాలు హరించేస్తున్న స‌మ‌స్య‌.. వేలాది మంది అమాయ‌కులు బ‌ల‌వుతున్నా., వారి ఓట్ల‌తో గెలిచిన నాయ‌కుల‌కి గానీ., వారి ఓట్ల‌తో గ‌ద్దెనెక్కిన ప్ర‌భుత్వాల‌కుగానీ వారి దుస్థితి కాన‌రాలేదు.. ఎట్ట‌కేల‌కు ఉద్దానం బాధితుల వెత‌లు జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దృష్టికి వ‌చ్చాయి.. వారి బాధ‌లు నేరుగా ఆల‌కించి., వాటిని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు జ‌న‌సేనుడు నేరుగా క‌దిలారు.. ఇచ్చాపురం వేదిక‌గా ప్ర‌భుత్వాన్ని, పాల‌కుల్ని నిల‌దీశారు.. ఇంత‌పెద్ద స‌మ‌స్య మీకు ఎందుకు ప‌ట్ట‌లేద‌ని ప్ర‌శ్నించారు.. బాధితుల త‌రుపున ప్ర‌భుత్వానికి ప‌లు విజ్ఞాప‌న‌లు చేశారు.. యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోమంటూ అల్టిమేటం ఇచ్చారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న దెబ్బ‌కి ప్ర‌భుత్వం దిగివ‌చ్చింది.. నేరుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రంగంలోకి దిగి., కార్యాచ‌ర‌ణ‌కు ఆదేశాలు జారీ చేశారు..

img-20170103-wa0077

ఫ‌లితం ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఉన్న స‌మ‌స్య ప‌రిష్కారం ద‌శ‌గా అడుగులు వ‌డివ‌డిగా ప‌డుతున్నాయి.. స‌ర్కారు వ్యాధి తీవ్ర‌త‌ను గుర్తించింది.. ప‌వ‌న్ దెబ్బ‌కి స్పందించిన పాల‌కులు కార్య‌చ‌ర‌ణ‌కు రంగం సిద్ధం చేస్తున్నారు.. ఇప్ప‌టికే జ‌ల‌శుద్దికి సంబంధించి గ్రామీణాభివృద్ది ఉన్న‌తాధికారులు ఉద్దానంలో ప‌ర్య‌టించి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకున్నారు..

ఇక కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల అస‌లు లెక్క‌లు కూడా బ‌య‌టికి వ‌స్తున్నాయి.. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కి ముందు వైద్యఆరోగ్య మంత్రికి కేవ‌లం 6 వేల మంది వ్యాధిగ్ర‌స్తులు మాత్ర‌మే క‌న‌బ‌డ‌గా., తాజాగా ఆ సంఖ్య వంద రెట్లు పెరిగింది.. స‌ర్వేల్లో అస‌లు లెక్క‌లు బ‌య‌టికి వ‌స్తున్నాయి.. అస‌లు వ్యాధిగ్ర‌స్తులే లేర‌ని గ‌తంలో అధికారులు తేల్చిచెప్పిన గ్రామాల్లోనూ ప‌దుల సంఖ్య‌లో బాధితులు న‌మోద‌వుతున్నారు.. 2010లో సేక‌రించిన అర‌కొర స‌మాచారం మిన‌హా., ఇంత తీవ్ర‌త ఉన్న వ్యాధికి సంబంధించి జిల్లా అధికారుల వ‌ద్ద సైతం ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన లెక్క‌లు లేవు.. ఇప్పుడు అస‌లు వ్యాధిగ్ర‌స్తులు ఎంత‌మంది..? అందులో డ‌యాల‌సిస్ చేయించుకుంటున్న‌వారు ఎంత‌మంది..? మృతులు ఎంత‌మంది అనే లెక్క‌లు.. అప్ప‌టికీ ఇప్ప‌టికీ వంద రెట్లు అధికంగా ఉండ‌డం., పాల‌కులు, పాల‌నాయంత్రాంగం నిర్వాకం బ‌య‌ట‌ప‌డుతోంది.. జ‌న‌సేనుడి దెబ్బ‌కి ఆరోగ్య‌మంత్రి ద‌గ్గ‌రుండి మ‌రీ చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు..

img-20170104-wa0018

ఇప్ప‌టికే ఉద్దానం ప్రాంతంలో మ‌రో రెండు డ‌యాల‌సిస్ సెంట‌ర్ల ఏర్పాటుకి సంబంధించి జీవో నంబ‌ర్ 19ని స‌ర్కారు జారీ చేసింది.. దీనికి సంబంధించి వైద్యఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పూనం మాల‌కొండ‌య్య ఉత్త‌ర్వులు జారీ చేశారు.. సొంపేట‌, పాల‌కొండ‌ల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.. ప్ర‌భుత్వంలో వ‌చ్చిన ఈ క‌ద‌లిక జ‌న‌సేనాని, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుణ్య‌మేన‌ని., ఆయ‌న‌కి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటామ‌ని ఉద్దానం ప్ర‌జ‌లు కృత‌జ్ఞ‌తాభివంద‌నాలు తెలుపుతున్నారు.. మొత్తానికి స‌మ‌స్య ఎక్క‌డుంటే అక్క‌డుంటా..; దాన్ని పార‌ద్రోలాకే విశ్ర‌మిస్తాన‌న్న జ‌న‌సేనుడు త‌న మాట‌ను నిల‌బెట్టుకున్నారు.. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స‌మ‌స్య‌లు ఆయ‌న వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నాయి..

Share This:

1,559 views

About Syamkumar Lebaka

Check Also

ఆ జ‌న‌సేన అభ్య‌ర్ధి గెలిస్తే.. పుంగ‌నూరు ప్ర‌గ‌తి ప‌థ‌మే..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీసుకురాబోతున్న మార్పు ఏ స్థాయిలో ఉంటుందంటే.., ఆ పార్టీ అభ్య‌ర్ధులు గెలుపు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్దికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 + three =